బీఎన్‌ఎంసీలో కాంగ్రెస్ గెలుపు
Published Mon, Sep 2 2013 11:21 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
భివండీ, న్యూస్‌లైన్: భివండీ నిజాంపుర మున్సిపల్ కార్పొరేషన్‌లో రెండు వార్డులకు జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. ఈ వార్డులకు ఆదివారం ఉప ఎన్నికలు నిర్వహించగా, సోమవారం ఫలితాలు వెలువడ్డాయి. వార్డు నంబరు-5(ఎ) కాంగ్రెస్ మహిళ కార్పొరేటర్ రెహానా సిద్దిఖీ, వార్డు నంబరు-6 (బి) కార్పొరేటర్ నూరుద్దీన్ అన్సారీ పదవులు రద్దు కావడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో వార్డు నంబరు 5 (ఎ) నుంచి పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థి సిద్దిఖీ అంజుమ్‌అహ్మద్ గెలిచారు.
ఆమెకు 2,237 ఓట్లు పోలవగా ప్రత్యర్థిగా బరిలోకి దిగిన ఎన్సీపీ అభ్యర్థి షేక్ బద్రున్సీసా ముఖ్తార్‌కు 1,401 ఓట్లు వచ్చాయి. దీంతో అంజుమ్ 836 ఓట్ల అధిక్యంతో గెలిచారు. వార్డు నంబరు-6 (బీ)లో కాంగ్రెస్ అభ్యర్థి అన్సారీ దావుద్ ఇబ్రాహింకు 1,562 ఓట్లు పోలవగా ప్రత్యర్ధి అయిన ఎన్సీపీకి చెందిన అన్సారీ ఔరంగాజేబ్‌కు 994 ఓట్లు వచ్చాయి. దీంతో దావూద్ 568 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
Advertisement
Advertisement