ఇక బుక్ బకెట్ చాలెంజ్ | Book Bucket Challenge | Sakshi
Sakshi News home page

ఇక బుక్ బకెట్ చాలెంజ్

Published Sun, Sep 7 2014 12:24 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 PM

ఐస్ బకెట్, రైస్ బకెట్ చాలెంజ్‌ల తరహాలో నగరంలో కొత్తగా బుక్ బకెట్ చాలెంజ్ ఆవిర్భవించింది. సోషల్ మీడియాలో పుట్టిన ఈ కొత్త గేమ్స్‌తో గ్రంథాలయూలను ఏర్పాటు చేయనున్నారు.

 అన్నానగర్: ఐస్ బకెట్, రైస్ బకెట్ చాలెంజ్‌ల తరహాలో నగరంలో కొత్తగా బుక్ బకెట్ చాలెంజ్ ఆవిర్భవించింది. సోషల్ మీడియాలో పుట్టిన ఈ కొత్త గేమ్స్‌తో గ్రంథాలయూలను ఏర్పాటు చేయనున్నారు. పది పుస్తకాల పేర్లను ఇచ్చి, వీటన్నింటినీ వారం వ్యవధిలో చదవాలనే షరతు విధిస్తారు. ఇందులో ఓడిపోయిన వారు వారి దగ్గరున్న పది పుస్తకాలను స్థానిక గ్రంథాలయాలకు విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయాలనే తలంపుతో ఈ బుక్ బకెట్ చాలెంజ్ మొదలైంది. సోషల్ మీడియాలోని బుక్ బకెట్ ఛాలెంజ్ గేమ్‌లు విక్రం సేథ్, హార్పర్‌లీ, ఎఎ మిల్‌నీ, డవుగ్లస్ ఆడమ్స్, గోసెన్నీ - అడర్‌జో, జెకె రోలింగ్స్, పి.జి.వుడ్ హౌస్, ఎనిడ్ బ్లైటన్, మార్గరెట్ మిచెల్ వంటి ప్రముఖ రచయితలు రాసిన పలు పుస్తకాలను ఉంచారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement