‘ఆటో ఛాలెంజ్’కి రెడీనా! | Hrithik Roshan Auto Rickshaw Challenge | Sakshi
Sakshi News home page

‘ఆటో ఛాలెంజ్’కి రెడీనా!

Published Mon, Sep 22 2014 11:44 PM | Last Updated on Sat, Sep 2 2017 1:48 PM

‘ఆటో ఛాలెంజ్’కి రెడీనా!

‘ఆటో ఛాలెంజ్’కి రెడీనా!

 సామాజిక మాధ్యమంలో ఇప్పుడు ‘ఛాలెంజ్’ల హవా సాగుతోంది. ఆ మధ్య ‘ఐస్ బకెట్’ ఛాలెంజ్ ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంచలనమే సృష్టించిందని చెప్పాలి. పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం ఐస్ నీళ్ల బకెట్‌ని నెత్తిపై బోర్లించుకొని అభ్యంగన స్నానాలు చేసేశారు. దీన్ని ప్రేరణగా తీసుకున్న కొందరు రైస్ బకెట్ ఛాలెంజ్, మై ట్రీ ఛాలెంజ్ అంటూ సామాజిక స్పృహతో ఛాలెంజ్‌లు మొదలుపెట్టారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ మరో కొత్త ఛాలెంజ్‌కి శ్రీకారం చుట్టారు. అదే ‘ఆటో ఛాలెంజ్’. ఇదెలా పుట్టిందంటే... ఓ రోజు రాత్రి ఇంటికెళ్తుంటే హృతిక్‌కి ఓ చిలిపి ఆలోచన వచ్చిందట. వెంటనే...
 
 కారుని ఓ సేఫ్ ప్లేస్‌లో పార్క్ చేసేసి, ఆటుగా వెళ్తున్న ఆటోని ఆపారట. ఆ ఆటోవాలాతో బేరం కుదుర్చుకుని ఇంటికి చేరారట. విచిత్రమేంటంటే... ఆ ఆటోవాలా కూడా హృతిక్‌ని గుర్తు పట్టలేదట. ఇప్పటివరకూ కారు అద్దాల్లోంచి ప్రపంచాన్ని చూసిన హృతిక్, ఒక సామాన్యుడిలా ఆటోలో జర్నీ చేస్తూ చెప్పలేనంత ఆనందాన్ని పొందారట. ఈ విషయాన్ని ఆయన నేరుగా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అంతటితో ఆగకుండా... ‘‘నేను ఆటోలో జర్నీ చేసినట్లు... మీరు కూడా జర్నీ చేయగలరా? వారం రోజులు టైమిస్తున్నా. మీ సత్తా ఏంటో నిరూపించుకోండి’’ అంటూ అదే ట్విట్టర్ ద్వారా తన తోటి స్టార్లకు హృతిక్ సవాలు విసిరారు.
 
  ఆయన సవాల్ విసిరిన వారిలో షారుక్‌ఖాన్, ప్రియాంక చోప్రా, ఉదయ్‌చోప్రా, డినో మోరియా ఉన్నారు. అయితే... హృతిక్ సవాలు విసిరి నాలుగు రోజులు గడుస్తున్నా... ఒక్క ఉదయ్ చోప్రా తప్ప ఛాలెంజ్‌కి ఎవరూ రియాక్ట్ కాలేదు. దాంతో వెంటనే... ‘‘ప్రియాంక చోప్రా దమ్మున్న అమ్మాయి. ఆమె ఈ సవాల్‌కి సిద్ధమనుకుంటున్నా? టైమ్ ఇంకా మూడ్రోజులే ఉంది’’ అంటూ మరో ట్వీట్ చేశారు హృతిక్. మరి ఈ సవాల్‌ని ప్రియాంక స్వీకరించి, ఆటో ఎక్కుతారో, లేదో. వెయిట్ అండ్ సీ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement