
రోడ్డు ప్రమాదంలో మరణించిన పాండియన్
చెన్నై: ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో పెళ్లి చేసుకునేందుకు ప్రేమజంట ఇంటినుంచి పారి పోయి... బైకుపై వెళుతూ లారీని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ప్రేమికుడు అక్కడికక్కడే మృతిచెందగా ప్రియురాలికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన వేలూరు సమీపంలో చోటుచేసుకుంది. వేలూరు జిల్లా ఆంబూరు సమీపంలోని మాదనూర్ పాలార్ గ్రా మానికి చెందిన పాండియన్(28), అదే గ్రామానికి చెందిన యువతి(19) ప్రేమించుకున్నారు.
వీరి ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో రెండు రోజుల క్రితం ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. వీరి తల్లిదండ్రులు ఎంత వెతికినా వారి ఆచూకీ కనిపించలేదు. ఆంబూరు తాలుకా పోలీసులకు పాండియన్‌పై అనుమానం ఉందని యువతి తండ్రి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రేమజంట కోసం గాలిస్తున్నారు.
ఈ క్రమంలో ప్రేమజంట శనివారం ఉదయం చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిలో బైకులో ఆంబూరు వైపు వెళుతుండగా వేలూరు సమీపంలోని అలిమేలుమంగాపురం వద్ద ముందు వెళుతున్న లారీని బైకు ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రే మజంట రోడ్డుపై పడడంతో పాండియన్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. యువతికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న సత్‌వచ్చారి పోలీసు లు అక్కడకు చేరుకుని యువతిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.