ముందుజాగ్రత్తగా ఖాళీ | city council evacuation to Rohini Manziel's residents by Precaution | Sakshi
Sakshi News home page

ముందుజాగ్రత్తగా ఖాళీ

Published Fri, Nov 22 2013 11:51 PM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM

city council evacuation to Rohini Manziel's residents by Precaution

ఠాణే: ఇటీవలి కాలంలో శిథిల భవనాలు కూలుతున్న ఘటన నేపథ్యంలో నగర పాలక సంస్థ ముందుజాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది. కల్వా ప్రాంతంలో కూలిపోయే దశకు చేరుకున్న రోహిణీ మంజిల్‌లో నివసిస్తున్న వారిని శుక్రవారం మధ్యాహ్నం ఖాళీ చేయించింది. ఈ విషయమై ఠాణే మున్సిపల్ కార్పొరేషన్ (టీఎంసీ) విపత్తు నియంత్రణ విభాగం అధికారి సంతోష్ కదమ్ మీడియాతో మాట్లాడుతూ తాము నివసిస్తున్న  ప్రమాదకర స్థితిలో ఉందంటూ ఈ ఉదయం తమ కార్యాలయానికి ఓ అత్యవసర ఫోన్ కాల్ వచ్చిందన్నారు. దీంతో తమ సిబ్బంది అక్కడికి చేరుకుని అందులోని వారిని ఖాళీ చేయించారన్నారు. కాగా ప్రమాదకరస్థాయికి చేరుకున్న ఈ భవనం కల్వా మార్కెట్‌కు సమీపంలో ఉంది.
 
 ఇందులో ఆరు కుటుంబాలు జీవిస్తున్నాయి. అంతేకాకుండా దుకాణాలు కూడా ఉన్నాయి. కాగా ఇటీవల దివ  ప్రాంతంలోనూ ఓ భవనం ఒరిగిపోయింది. దీంతో సంబంధిత సిబ్బ ంది అందులో నివసిస్తున్న వారిని తక్షణమే ఖాళీ చేయించిన సంగతి విదితమే. వారం రోజుల క్రితం కల్వాలోని మరో భవనంలో నివసిస్తున్న పెళ్లి హడావుడిలో ఉండగా వారికి ఏదో శబ్దం వినిపించింది. దీంతో కీడు శంకించి సదరు భవనంలో నివసిస్తున్న వారిని పెళ్లి హడావుడిలో నిమగ్నమైన వారు ఖాళీ చేయించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ భవనం కూలిపోయిన సంగతి విదితమే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement