పోలవరం పనులపై సీఎం సమీక్ష | cm chandrababu naidu review meeting on polavaram project | Sakshi
Sakshi News home page

పోలవరం పనులపై సీఎం సమీక్ష

Published Mon, Oct 31 2016 2:26 PM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

పోలవరం పనులపై సీఎం సమీక్ష - Sakshi

పోలవరం పనులపై సీఎం సమీక్ష

విజయవాడ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులను క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వర్చువల్ ఇన్‌స్పెక్షన్ చేశారు. పనులు జరుగుతున్న తీరును అధికారులు, ట్రాన్స్‌ట్రాయ్, త్రివేణి సంస్థల ప్రతినిధులు సీఎంకు వివరించారు. ఈ వారం అదనంగా 75 వాల్వో ట్రక్కులు, 25 అశోక్ లేల్యాండ్ ట్రక్కులు, 7 భారీ ఎస్కవేటర్ల సాయంతో పెద్ద ఎత్తున తవ్వకం పనులు చేపట్టినట్లు ‘త్రివేణి’ ప్రతినిధులు వివరించారు. ప్రస్తుతం రోజుకు సగటున 37,544 క్యూబిక్ మీటర్ల చొప్పున స్పిల్‌వే, 30,242 క్యూబిక్ మీటర్ల చొప్పున స్పిల్ చానల్, 14,892 క్యూబిక్ మీటర్ల చొప్పున సాగుతున్న పవర్‌హౌస్ తవ్వకం పనులు జరుగుతున్నాయన్నారు.
 
నిర్దేశిత లక్ష్యాన్ని నిర్ణీత సమయంలోగా పూర్తిచేయాలని అధికారులు, ‘త్రివేణి’, ట్రాన్స్‌ట్రాయ్ ప్రతినిధులకు సీఎం సూచించారు. స్పిల్‌వేకు సంబంధించి నవంబర్‌లో రోజుకు 43,444 క్యూబిక్ మీటర్ల చొప్పున మొత్తం 13,03,320 క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. స్పిల్ చానల్‌కు సంబంధించి నవంబర్‌లో రోజుకు 1,84,000 క్యూబిక్ మీటర్ల చొప్పున మొత్తం 55,20,000 క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు పూర్తిచేయాలని నిర్ణయించారు. పవర్‌హౌస్ ఫౌండేషన్‌కు సంబంధించి నవంబర్‌లో రోజుకు 31,333 క్యూబిక్ మీటర్ల చొప్పున మొత్తం 9,40,000 క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు పూర్తిచేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement