కోర్టుకు వెళ్లి ర్యాలీకి అనుమతి తెచ్చుకోవాలా?
కోర్టుకు వెళ్లి ర్యాలీకి అనుమతి తెచ్చుకోవాలా?
Published Mon, Feb 20 2017 3:47 PM | Last Updated on Sat, Aug 11 2018 4:59 PM
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా విద్యను ప్రైవేటీకరణ వైపు ప్రోత్సహిస్తోందని సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి విమర్శించారు. ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. సర్కార్ విద్యను కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. గురుకుల పాఠశాలలు.. కేజీ టూ పీజీ కి ప్రత్యామ్నాయం కావాలన్నారు. మిగతా రాష్ట్రాల్లో 15 శాతం వరకు విద్యకు బడ్జెట్ కేటాయింపులు ఉంటే.. మన రాష్ట్రంలో కేవలం 8 శాతానికే పరిమితం చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగాల నోటీఫికేషన్స్ కేవలం పేపర్‌కే పరిమితం అవుతున్నాయని విమర్శించారు. నిరుద్యోగులు ర్యాలీ చేపట్టాలనుకుంటే దానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించడం సరికాదన్నారు.
ఇది ప్రజాస్వామ్య పాలనా.. లేక రాచరికపు పాలనా అని ప్రశ్నించారు. ర్యాలీ నిర్వహించాలంటే కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకోవాలా అంటూ మండిపడ్డారు. ఈ పరిణామాలు సిగ్గుచేటన్నారు. పోలీసులు విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించిందో కేసీఆర్ గుర్తు చేసుకోవాలన్నారు. నిరుద్యోగ ర్యాలీకి అనుమతి ఇవ్వకపోతే జరిగే పరిణామాలకు సర్కార్ బాధ్యత వహించాలన్నారు. కోమటిరెడ్డి ..ఉత్తమ్ ఎపిసోడ్ ముగిసిన అధ్యాయమని.. ఇద్దరి మధ్య రాజీ కుదిరినట్టు తెలిపారు.
Advertisement
Advertisement