ప్రకటనలతో కేసీఆర్ కాలయాపన: జీవన్ రెడ్డి
నిజమాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి రైతులను ఆదుకునే ఆలోచన లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి విమర్శించారు. ఆర్ధిక భారం నుంచి తప్పించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం ప్రకటనలతో కాలయాపన చేస్తున్నారని, గత నాలుగు నెలల్లో ఆయన చేసిందేమి లేదని జీవన్ రెడ్డి విమర్శించారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదన్నారు.
ఈనెల 30లోగా రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలివ్వాలని, లేకుంటే అక్టోబర్ మొదటి వారం తర్వాత రైతులు రోడ్డెక్కక తప్పదని జీవన్ రెడ్డి తెలిపారు.