అల్లకల్లోలమే లక్ష్యం | convicts first target is prathpa simha | Sakshi
Sakshi News home page

అల్లకల్లోలమే లక్ష్యం

Published Thu, Nov 3 2016 11:27 AM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM

అల్లకల్లోలమే లక్ష్యం

అల్లకల్లోలమే లక్ష్యం

►  ఒక్క వేటుతో తల నరకడంపై శిక్షణ కోసం వీధి కుక్కల వినియోగం
►  మొదటి టార్గెట్‌ ప్రతాప్‌సింహా
► విచారణలో నోరు విప్పిన ‘రుద్రేష్‌’ నిందితులు
►  మొత్తం ముగ్గురిని అంతమొందించాలనేది లక్ష్యం
►  ఇందుకోసం కేరళలోని కణ్ణూరులో కొద్ది కాలం మకాం  
►  ఆపరేషన్ ముర్గ్‌ పేరుతో కార్యాచరణ
►   విస్తుపోయే విషయాలు వెలుగులోకి..  



బెంగళూరు: రుద్రేష్‌ హత్య కేసులో నిందితుల మొదటి టార్గెట్‌ భారతీయ జనతా పార్టీకి చెందిన మైసూరు పార్లమెంటు సభ్యుడు ప్రతాప్‌సింహా అని తెలుస్తోంది. అంతేకాకుండా రుద్రేష్‌తో సహా మొత్తం ముగ్గురిని అంతమొందించాలన్నది వారి లక్ష్యం. గతనెల 16న బెంగళూరులోని శివాజీ నగర్‌లో  చోటు చేసుకున్న  రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) కార్యకర్త రుద్రేష్‌ హత్యకు సంబంధించి మహ్మద్‌సాధిక్, అహ్మద్‌ముజీబుల్లా, వాసీం అహ్మద్, ఇర్ఫాన్ పాషాలను అదే నెల 28న పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విచారణలో విస్తుగొలిపే విషయాలను నిందితులు వెల్లడించినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... రాష్ట్రంలో బీజేపీకి చెందిన ఓ ప్రముఖ నాయకుడితో పాటు ఒక విశ్వహిందూ పరిషత్‌ నాయకుడు, ఓ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తను హత్య చేసి  రాష్ట్ర వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించాలనేది వారి ప్రణాళిక. ఇందుకు ’ఆపరేషన్ ముర్గ్‌’ అని పేరుకూడా పెట్టుకున్నారు. ప్రణాళిక ప్రకారం మొదట బీజేపీలో నాయకుడిగా ఎదుగుతున్న యువకుడైన ప్రతాప్‌సింహాను అంతమొందించాలని భావించారు. అందుకోసం ఇటీవల ప్రతాప్‌సింహా పాల్గొనే వివిధ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు సేకరించారు. అటుపై ప్రతాప్‌సింహాను అందమొందించేందుకు రెండు పర్యాయాలు యత్నించి విఫలమయ్యారు. ఈ విషయాలన్నీ వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న పుస్తకాలు, కాగితాలు, మ్యాపుల్లో ఉన్నట్లు దర్యాప్తు బృందంలోని అధికారి ఒకరు తెలిపారు.  

కణ్ణూరులో ట్రైనింగ్‌..క్వీన్స్ రోడ్డులో స్కెచ్‌...
ప్రతాప్‌సింహాను అంతమొందించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో బెంగళూరుకు చెందిన, కేరళలో వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న సోషియల్‌ డెమెక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎస్‌డీపీఐ) నాయకుడు వీరికి అవసరమైన సహాకారం అందించడానికి ముందుకు వచ్చారు. నలుగురు నిందితులను ఘటన జరగడానికి కొద్ది రోజుల పాటు కేరళాలోని కణ్ణూరుకు పంపించారు. అక్కడ ద్విచక్ర వాహనంలో చిన్నచిన్న గల్లీలో వేగంగా ప్రయాణించడం, వాహనం నుంచి దిగి ఒక్కవేటుతో తల నరికి క్షణాల్లో తప్పించుకోవడం వంటి విషయాల్లో  శిక్షణ  ఇప్పించారు. ఇక తల నరకడంపై శిక్షణ కోసం అక్కడ వీధి కుక్కులను వినియోగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. అటుపై బెంగళూరు చేరుకున్న నిందితులు రుద్రేష్‌ హత్య జరగడానికి రెండు రోజుల ముందు క్వీన్స్ రోడ్డులోని ఓ ప్రార్థనా మందిరంలో సమావేశమై  తదుపరి టార్గెట్‌ ’ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త’ అని నిర్ధారించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో శివాజీ నగర్‌ ప్రాంతంలో రాజకీయంగా, వ్యాపారపరంగా ఎదుగుతున్న రుద్రేష్‌ పేరును ఫైనల్‌ చేశారు. ఇందుకు సమావేశంలో పాల్గొన్న మరికొంతమంది మద్దతు కూడా లభించింది. దీంతో వారు రుద్రేష్‌ను దారుణంగా హత్య చేశారు.

Advertisement

పోల్

Advertisement