
తీరాన్ని తాకిన వర్దా తుపాను
చెన్నై: తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను వణికించిన వర్దా తుపాను సోమవారం మధ్యాహ్నం తీరాన్ని తాకింది. చెన్నై-పులికాట్ సరస్సు మధ్య తుపాను తీరాన్ని తాకిందని వాతావరణ శాఖ ప్రకటించింది.
దీని ప్రభావం మరో 36 గంటల పాటు తీవ్రంగా ఉంటుందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సహాయక బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 120-130 వేగంతో పెనుగాలులు వీచే అవకాశముందని జాతీయ విపత్తు నిర్వహణ సంస్ధ హెచ్చరించింది.