డీసీహెచ్‌ఎస్ అధికారుల తొలగింపు | dchs officers remove in adilabad district | Sakshi
Sakshi News home page

డీసీహెచ్‌ఎస్ అధికారుల తొలగింపు

Published Sat, Oct 15 2016 10:51 AM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM

డీసీహెచ్‌ఎస్ అధికారుల తొలగింపు - Sakshi

డీసీహెచ్‌ఎస్ అధికారుల తొలగింపు

సీహెచ్‌సీ సూపరింటెండెంట్లకే బాధ్యతలు
 ప్రధాన ఆస్పత్రులుగా నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఉట్నూర్ ఆస్పత్రులు..?
 
సాక్షి, నిర్మల్ : కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) పరిధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)ల పర్యవేక్షణ బాధ్యతను జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి(డీసీహెచ్‌ఎస్) నుంచి తొలగించారు. ఆయా జిల్లాల్లోని జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్‌లకే ఈ బాధ్యతలను అప్పగించారు. డీసీహెచ్‌ఎస్ పేరును తొలగిస్తూ సూపరింటెండెం ట్ జిల్లా హెడ్‌క్వార్టర్స్ అని మార్పు చేశారు.
 
డీసీహెచ్‌ఎస్ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని నాలుగు జిల్లాలకు పంపకాలు చేశారు. ఇక రానున్న రోజుల్లో నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఉట్నూర్ ఆస్పత్రులు జిల్లా ప్రధాన ఆస్పత్రులుగా మార్చేందుకు ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది.
 
 ఆస్పత్రులు ఇవే...
 ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్, భైంసా, ఖానాపూర్, ఉట్నూర్, ఆసిఫాబాద్, సిర్పూర్(టి), బెల్లంపల్లి, మంచిర్యాల, నిర్మల్(ఎన్‌సీహెచ్) డీసీహెచ్‌ఎస్ పరిధిలోకి వచ్చేవి. ఈ ఆస్పత్రుల్లో 404 మంజూరు పోస్టులు ఉండగా 248 మంది రెగ్యులర్, 43మంది కాంట్రాక్ట్, 75 మంది ఔట్‌సోర్సింగ్, 9 మంది ఇతర ఉద్యోగులు ఉన్నారు. ఇందులో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది, ఆఫీస్ మినిస్టీరియల్  స్టాఫ్ వస్తారు.
 
 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఆస్పత్రుల పర్యవేక్షణ అంతా డీసీహెచ్‌ఎస్ చూసేవారు. జీతాలు, పదోన్నతులు, బదిలీలు, సెలవులు, ఇంక్రిమెంట్లు, క్రమబద్ధీకరణ, బడ్జెట్, టీఏ, డీఏ, ఇతర అంశాలకు సంబంధించి జిల్లాస్థాయిలో అయితే ఇక్కడ లేనిపక్షంలో జోనల్, రాష్ట్రస్థాయికి పంపించేవారు. చిన్న జిల్లాలు ఏర్పాటు నేపథ్యంలో డీసీహెచ్‌ఎస్ అధికారులను తొలగించేసి ఆయా జిల్లాలోని జిల్లా కేంద్ర సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌కు ఈ బాధ్యతలను బదిలీ చేశారు. తద్వారా ఆస్పత్రులు, సిబ్బందికి సంబంధించిన పూర్తి పర్యవేక్షణ ఇకపై సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌పైనే ఉంటుంది.
 
 ఆయా జిల్లాల్లోకి ఈ ఆస్పత్రులు
 నిర్మల్ ఏరియా ఆస్పత్రి, నిర్మల్ ప్రసూతి ఆస్పత్రి, భైంసా ఆస్పత్రి, ఖానాపూర్ ఆస్పత్రి నిర్మల్ జిల్లాలోకి, మంచిర్యాల, బెల్లంపల్లి ఆస్పత్రులు మంచిర్యాల జిల్లాలోకి, ఆసిఫాబాద్, సిర్పూర్(టి) ఆస్పత్రులు కొమ్రం భీం జిల్లాలోకి, ఉట్నూర్ ఆస్పత్రి ఆదిలాబాద్ జిల్లాలోకి వస్తాయి. నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఉట్నూర్ ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లకు ఆఫీస్ ఆఫ్ ద సూపరింటెండెంట్ బాధ్యతలను అప్పగించారు.
 
 మెరుగైన సేవలకు కృషి..
 - డాక్టర్ సురేశ్, సూపరిండెంట్ జిల్లా హెడ్‌క్వార్టర్స్ టీవీవీపీ, నిర్మల్
 నిర్మల్ ఏరియా ఆస్పత్రి, ప్రసూతి ఆస్పత్రి, భైంసా, ఖానాపూర్ ఏరియా ఆస్పత్రు ల్లో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తాం. అన్ని ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స జరిగేలా చర్యలు మరింత ఎక్కువగా తీసుకుంటాం. రోగులకు అన్ని రకాలుగా సౌకర్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement