ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు? | Delhi assembly elections in February? | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు?

Published Thu, Dec 25 2014 10:31 PM | Last Updated on Sat, Sep 2 2017 6:44 PM

Delhi assembly elections in February?

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జనవరి మొదటి వారంలో వెలువడే అవకాశం ఉంది. ఫిబ్రవరి రెండు లేదా మూడో వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వినోద్ జోషి, సీఈఓ విజయదేవ్, జిల్లాల ఎన్నికల అధికారులు(డీఈఓలు) సమావేశమై సమీక్ష జరిపారు. ప్రజలకు ఓటుపై అవగాహన కల్పించేందుకు చేపట్టాల్సిన డ్రైవ్‌పై చర్చించారు. అదేవిధంగా బుధవారం జరిగిన సమీక్ష సమావేశంలో సమస్యాత్మక ప్రాంతాల  గుర్తింపు, ఎన్నికలకు అవసరమయ్యే మానవ వనరులు తదితర విషయాలపై కసరత్తు చేశారు. ఈ మేరకు నివేదికలు అందించాలని డీఈఓలను ఆదేశించినట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement