
ప్రజాస్వామ్యం అపహాస్యం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తున్న అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని....
► వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఐటీ విభాగం ఆగ్రహం
► వైఎస్.విజయమ్మ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు
బెంగళూరు(బనశంకరి): ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తున్న అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఐటీ విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం బెంగళూరు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఐటీ విభాగం ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ పుట్టిన రోజు కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రానిక్‌సిటీలోని దొడ్డతోగూరులో శేషారూడ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ విభాగం జనరల్ సెక్రటరీలు, శ్యామ్ సుందర్‌రెడ్డి కలకడ, వీరభద్రరావు మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అవినీతి డబ్బుతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ పార్టీని నిర్వీర్యం చేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేలు వీడినంత మాత్రాన పార్టీ బలహీనపడుతుందని అనుకోవడం పొరపాటని, పార్టీకి కార్యక ర్తలు, ప్రజలు అండగా ఉన్నారని తెలిపారు. అధికార పార్టీలోకి వెళ్తున్న ఎమ్మెల్యేలచే తక్షణం రాజీనామా చేయించి దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా నగర ఐటీ విభాగం సభ్యులు వెంకటసుబ్బయ్య, హరిబాబు పేనం, కైరా శ్రీనివాసులు, కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రకాష్‌రెడ్డి, బయప్పరెడ్డి, కుమార స్వామిరెడ్డి, అక్షయ్ టీ.కరణం, సురేంద్రరెడ్డి, ఓబుళరెడ్డి, నానిరెడ్డి, మునాఫ్, సబారీబేగం, దిల్షాద్ బేగం, రాజశేఖర్‌రెడ్డి, చంద్ర నారాయణ్‌రెడ్డి, జాన్సన్‌రాజు, నరేశ్, ప్రవీణ్, జనార్దన్‌రెడ్డి, రాహుల్‌రెడ్డి, సాయి దొడ్డతోగూరు తాలూకా పంచాయతీ అధ్యక్షుడు జీ.శంకర్‌రెడ్డి, ఆలయ కార్యదర్శి పురుషోత్తమరెడ్డి, రాజప్ప తదితరులు పాల్గొన్నారు.
సేవ్‌డెమెక్రసీ పేరుతో ఈ నెల 30న శనివారం సాయంత్రం 6 గంటలకు మారతహళ్లిలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. మరిన్ని వివరాల కోసం వెంకట్... 9945207998 , సురేంద్ర-9880549875, హరి-8722803924, కుమార్ -8892469526 నెంబర్లు సంప్రదించగలరు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు హాజరుకావాలని వారు కోరారు.