హీరోయిన్‌గా దంత వైద్యురాలు | Dentist turns Actor debuts in Kollywood | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌గా దంత వైద్యురాలు

Published Thu, Aug 6 2015 2:56 AM | Last Updated on Wed, Apr 3 2019 9:12 PM

హీరోయిన్‌గా దంత వైద్యురాలు - Sakshi

హీరోయిన్‌గా దంత వైద్యురాలు

 కథానాయకులైన వైద్యులున్నారు గానీ ,కథానాయికలైన వైద్యురాళ్లుఅరుదే. అలాంటి కొదవైన ఖాతాలోకి నటి మాయ చేరారు.దంత వైద్యురాలు ఈమె జిన్ చిత్రం ద్వారా కథానాయికగా తెరంగేట్రం చేస్తున్నారు.అయితే అంతకు ముందే ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలోకి ప్రవేశించిన ఈ బ్యూటీ ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి రావడంతో చిత్రపరిశ్రమ కొంచెం సవాల్‌గానే ఉందంటున్నారు. ఈమె సినీ కలలు, కోరికలేమిటో చూద్దాం.
 
 నాకు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించాలని ఆశ. నేనీ రంగంలోకి రావాలనుకోవడానికి ఆయన దర్శకత్వంలో వచ్చిన గజినీ చిత్రంలోని కథానాయికి కల్పన పాత్ర స్ఫూర్తి. నటుడు సూర్య అంటే చచ్చేంత అభిమానం.ఆయనకు జంటగా నటించాలని ఆశగా ఉంది. ఇక నా రోల్ మోడల్ జెనీలియా.ఆమె నటించిన పాత్రలన్నీ టీనేజ్ పాత్రలే. నా ఫ్రెండ్స్‌లో చాలా మంది జెనీలియా పాత్రలా ప్రవర్తిస్తారు.
 
 ఇక నా తొలి చిత్రం జిన్ గురించి చెప్పాలంటే ఇది దెయ్యం ఇతి వృత్తంతో తెరకెక్కుతున్న విభిన్న కథా చిత్రం. ఇందులో నాది నటనకు అవకాశం ఉన్న పాత్ర. కాళీవెంకట్,అర్జునన్‌హరి, మునీష్‌కాంత్ లాంటి సహ నటులతో నటించడం మంచి అనుభవం.కొత్త చిత్రాల అవకాశాలు చాలా వస్తున్నాయి.అయితే వాటి ఎంపిక విషయంలో చాలా శ్రద్ధ వహిస్తున్నాను.         
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement