dentists
-
Corona Care: ఆ టూత్ బ్రష్ వాడకండి!
సాక్షి, అమరావతి బ్యూరో: మనం వాడే టూత్ బ్రష్‌లు కోవిడ్ వాహకాలుగా మారుతున్నాయా? కోవిడ్ బారినపడిన వారు వినియోగించిన బ్రష్‌లను కోలుకున్నాక కూడా వాడితే ప్రమాదమా? రోజూ పళ్లు తోముకునే బ్రష్‌లతోనూ ముప్పు పొంచి ఉందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నారు దంత వైద్య నిపుణులు. బ్రెజిల్ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. దీనిని ‘బ్రెజిల్ జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ సీజెస్’ ప్రచురించింది. ఈ నేపథ్యంలో టూత్ బ్రష్‌ల వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తలను దంత వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకసారి కోవిడ్ బారినపడి కోలుకున్న వారు కొన్నాళ్లకు మళ్లీ కరోనా బారిన పడుతున్న కేసుల్లో టూత్ బ్రష్‌ల పాత్ర కూడా ఉందని పరిశోధకులు తేల్చారు. ఈ బ్రష్‌లపై కనీసం 72 గంటల పాటు కరోనా వైరస్ సజీవంగా ఉంటుంది. అందువల్ల కోవిడ్ సోకినప్పుడు వాడిన బ్రష్‌నే కోలుకున్న తర్వాత కూడా వాడటం వల్ల కొంతమందికి తిరిగి కరోనా సోకుతున్నటుŠట్ ఆ అధ్యయనంలో నిర్ధారించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కోవిడ్ నుంచి కోలుకున్న వారు పాత టూత్ బ్రష్, టంగ్ క్లీనర్లను పడేసి కొత్తవి వాడాలని దంత వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కోవిడ్ రోగులు వాడే వాష్‌రూమ్‌ల్లో ఇతర కుటుంబ సభ్యుల టూత్ బ్రష్‌లు, టంగ్‌క్లీనర్లు, టూత్ పేస్ట్‌లతో పాటు ఇతర టాయిలెట్ వస్తువులు/సామగ్రిని ఉంచకూడదని సూచిస్తున్నారు. ఆ బ్రష్‌లు వాడకూడదు కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత వారు మళ్లీ ఆ బ్రష్‌లను ఉపయోగించకూడదు. రోగి వాడిన బ్రష్‌పై కనీసం 72 గంటల పాటు కరోనా వైరస్ సజీవంగా ఉంటుందని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్ల కోవిడ్ సోకిన 14 రోజుల తర్వాత పాత బ్రష్‌లు, టంగ్ క్లీనర్లను వదిలేసి కొత్తవి వాడాలి. కోవిడ్ బాధితులు నోటి శుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి. నోటిలో వైరస్/బ్యాక్టీరియా నివారణకు గోరు వెచ్చటి ఉప్పునీటిని పుక్కిలించాలి. – డాక్టర్ సుధ, విభాగాధిపతి, ప్రభుత్వ దంత వైద్య కళాశాల, విజయవాడ చదవండి: Corona: పిల్లల్లో కోవిడ్ లక్షణాలను ఎలా గుర్తుపట్టాలి? -
దంతం.. వీరి వ్యాపార మంత్రం!!
చేతి గ్లౌజ్ నుంచి డెంటిస్ట్ చెయిర్ వరకూ.. * దంత వైద్య పరికరాలను విక్రయిస్తున్న మై డెంటిస్ట్ చాయిస్ * 80 రకాల బ్రాండ్లు.. 6 వేలకు పైగా ఉత్పత్తుల లభ్యం * వచ్చే ఏడాది మధ్య ప్రాచ్య, ఆఫ్రికా దేశాలకూ విస్తరణ * రూ.20 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దంత పరిశ్రమలోని ప్రధాన సమస్య ఏంటో తెలుసా.. దంత పరికరాలు, ఉత్పత్తుల కొనుగోళ్లే! ఎందుకంటే ఆయా ఉత్పత్తుల్లో 80% విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. ఉన్న కొద్దిపాటి విక్రయ కేంద్రాలైనా మెట్రో నగరాలకే పరిమితం. మరి, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని దంత వైద్యుల పరిస్థితేంటి? ..ఇదిగో సరిగ్గా ఇలాంటి అనుభవం స్థానిక దంత వైద్యుడు అల్లాడి చంద్రశేఖర్‌కూ ఎదురైంది. దాన్నే వ్యాపార అవకాశంగా భావించాడు. టెక్నాలజీ నిపుణులైన సునీల్ మేడ, శివప్రసాద్ పిన్నపురాల ఇద్దరితో కలిసి ఈ-కామర్స్ సంస్థను ఆరంభించాడు. నిజానికి సీబీఐటీలో ఇంజినీరింగ్ చేసేటప్పటి నుంచీ శివ ప్రసాద్, సునీల్ స్నేహితులు. అమెరికాలో 15 ఏళ్ల పాటు వివిధ ఐటీ కంపెనీల్లో సహోద్యోగులగా పనిచేశారు. ఓ రోజు డాక్టర్ చంద్రశేఖర్ అల్లాడి.. తన మిత్రుడైన శివ ప్రసాద్‌తో దంత పరిశ్రమలోని సమస్యను, వ్యాపార అవకాశాలను చర్చించాడు. అదే అవకాశంగా భావించి సునీల్‌తో కలసి వారిద్దరూ రూ.60 లక్షల పెట్టుబడితో మై డెంటిస్ట్ చాయిస్.కామ్‌ను ప్రారంభించారు. 2014 జూలైలో ఆరంభమైన ఈ సంస్థ... చేతి గ్లౌజ్‌ల నుంచి మొదలుపెడితే డెంటిస్ట్ చెయిర్ వరకూ వైద్యుడికి అవసరమైన అన్ని రకాల ఉత్పత్తుల్నీ అందిస్తుంది. దీనికి సంబంధించి సునీల్ మేడా చెప్పింది ఆయన మాటల్లోనే... 80 బ్రాండ్లు.. 6 వేల ఉత్పత్తులు.. ‘‘ప్రస్తుతం మా వద్ద జీసీ ఇండియా, జీడీసీ, ఐవోక్లార్, డెన్స్ప్లే, ప్రైమ్ డెంటల్, మనీ, ఎస్డీఐ, పీవో వంటి 80 రకాల బ్రాండ్లు, సుమారు 6 వేలకు పైగా ఉత్పత్తులున్నాయి. అమెరికాకు చెందిన వాక్యూక్లియర్ సంస్థతో ఎక్స్‌క్లూజివ్ ఒప్పందం చేసుకున్నాం. దీంతో విదేశీ మార్కెట్లో విడుదలయ్యే ఉత్పత్తులను మన దేశీయ విపణిలోనూ విక్రయించే వీలుంటుంది. ఈ ఏడాది ముగిసేనాటికి మరో రెండు కంపెనీల తోనూ ఎక్స్‌క్లూజివ్ ఒప్పందాలు చేసుకుంటాం. నేరుగా దంత వైద్య పరికరాలు, ఉత్పత్తుల తయారీ సంస్థలతో ఒప్పందం చేసుకోవటం వల్ల ఇతరులతో పోలిస్తే 10 శాతం తక్కువ ధరకే మేం విక్రయిస్తాం. ఉత్పత్తుల డెలివరీ కోసం ఫెడెక్స్, డీటీడీసీ, డెల్హివరీ సంస్థలతో, 100 కిలోలు మించిన సరుకుల డెలివరీ కోసం ఈకార్గో, వీఆర్ఎల్ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. రూ.20 కోట్ల నిధుల సమీకరణ... ఈ ఏడాది మార్చిలో అమెరికాకు చెందిన ఇద్దరు ఏంజిల్ ఇన్వెస్టర్లు మా సంస్థలో కోటి రూపాయల పెట్టుబడి పెట్టారు. ఈ ఏడాది ముగిసే నాటికి సిరీస్-ఏలో భాగంగా రూ.20-30 కోట్ల నిధులు సమీకరించాలని నిర్ణయించాం. నెక్సస్ వెంచర్ వంటి ఒకటి రెండు వీసీ సంస్థలతో చర్చిస్తున్నాం. త్వరలో రోజువారీ ఆర్డర్ల విలువను లక్షకు, ఉత్పత్తుల సంఖ్యను 20 వేలకు చేర్చాలని లక్ష్యించాం. ప్రస్తుతం మా సంస్థలో 16 మంది ఉద్యోగులున్నారు. మరో వారం రోజుల్లో ఐఓఎస్ వర్షన్ యాప్‌నూ మార్కెట్లోకి విడుదల చేస్తున్నాం. వచ్చే ఏడాది మధ్యప్రాచ్య, ఆఫ్రికా దేశాలకూ విస్తరించనున్నాం. ఆ తర్వాత ఆర్థోపెడిక్, నర్సింగ్ విభాగాల్లోకి కూడా వస్తాం.’’ రూ.4-5 కోట్ల వ్యాపార లక్ష్యం... ప్రస్తుతం 1,000-1,200 మంది డెంటిస్ట్‌లు కస్టమర్లుగా ఉన్నారు. ఇందులో 60 శాతం మంది రిపీటెడ్ కస్టమర్లే. రోజుకు రూ.40-50 వేల విలువైన ఆర్డర్లొస్తున్నాయి. నెలకు రూ.15-20 లక్షల వ్యాపారాన్ని చేస్తున్నాం. ఇందులో ఖర్చులన్నీ పోగా 6-7 శాతం లాభాలుంటాయి. ఈ ఏడాది ముగిసేనాటికి రూ.4-5 కోట్ల వ్యాపారాన్ని చేరుకోవాలని లక్ష్యించాం. ఎక్కువ ఆర్డర్లు ముంబై నుంచి వస్తున్నాయి. హైదరాబాద్ వాటా 10-15 శాతం ఉంటుంది. హైదరాబాద్‌లో పార్థా డెంటల్, డెంటిస్ట్, అపోలో వంటి వాటికి దంత వైద్య పరికరాలు, ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాం. మా సంస్థకు రిటర్న్‌లు 2-3% మధ్య ఉంటాయి. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
హీరోయిన్గా దంత వైద్యురాలు
కథానాయకులైన వైద్యులున్నారు గానీ ,కథానాయికలైన వైద్యురాళ్లుఅరుదే. అలాంటి కొదవైన ఖాతాలోకి నటి మాయ చేరారు.దంత వైద్యురాలు ఈమె జిన్ చిత్రం ద్వారా కథానాయికగా తెరంగేట్రం చేస్తున్నారు.అయితే అంతకు ముందే ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలోకి ప్రవేశించిన ఈ బ్యూటీ ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి రావడంతో చిత్రపరిశ్రమ కొంచెం సవాల్‌గానే ఉందంటున్నారు. ఈమె సినీ కలలు, కోరికలేమిటో చూద్దాం. నాకు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించాలని ఆశ. నేనీ రంగంలోకి రావాలనుకోవడానికి ఆయన దర్శకత్వంలో వచ్చిన గజినీ చిత్రంలోని కథానాయికి కల్పన పాత్ర స్ఫూర్తి. నటుడు సూర్య అంటే చచ్చేంత అభిమానం.ఆయనకు జంటగా నటించాలని ఆశగా ఉంది. ఇక నా రోల్ మోడల్ జెనీలియా.ఆమె నటించిన పాత్రలన్నీ టీనేజ్ పాత్రలే. నా ఫ్రెండ్స్‌లో చాలా మంది జెనీలియా పాత్రలా ప్రవర్తిస్తారు. ఇక నా తొలి చిత్రం జిన్ గురించి చెప్పాలంటే ఇది దెయ్యం ఇతి వృత్తంతో తెరకెక్కుతున్న విభిన్న కథా చిత్రం. ఇందులో నాది నటనకు అవకాశం ఉన్న పాత్ర. కాళీవెంకట్,అర్జునన్హరి, మునీష్కాంత్ లాంటి సహ నటులతో నటించడం మంచి అనుభవం.కొత్త చిత్రాల అవకాశాలు చాలా వస్తున్నాయి.అయితే వాటి ఎంపిక విషయంలో చాలా శ్రద్ధ వహిస్తున్నాను. -
రాష్ట్రంలో సగం మందికి దంత సమస్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 50 శాతం మంది వివిధ రకాల దంత సమస్యలతో బాధపడుతున్నారని, అలాగే, దేశంలోనూ ఎక్కువ మంది ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని దంతవైద్య నిపుణులు తెలిపారు. దీనిని అధిగమించేందుకు ప్రతి ఒక్క దంతవైద్యుడూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలయన్స్ ఫర్ క్యావిటీ-ఫ్రీ ఫీచర్ సంస్థ (ఏసీఎఫ్‌ఎఫ్) ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని హైటెక్స్‌లో భారతీయ దంతవైద్య సదస్సు-2014 జరిగింది. ఇందులో పలువురు నిపుణులు పాల్గొని మాట్లాడారు. ఎక్కువ మంది పిప్పిపళ్ల సమస్యతో బాధపడుతున్నారని.. దీన్ని అధిగమించేందుకు వైద్యులు, ఎన్జీవోలు ముందుకు రావాలని ఏసీఎఫ్‌ఎఫ్ సహ డెరైక్టర్, కింగ్స్ కాలేజ్ లండన్ ప్రొఫెసర్ రామన్బేడీ తెలిపారు. ప్రభుత్వాలు కూడా సహకరించాలని సూచించారు. పిప్పిపళ్ల సమస్య చిన్నారుల్లో అధికంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాల్లో 50 శాతం, గ్రామాల్లో 34 శాతం మంది ఐదేళ్లలోపు చిన్నారులు పిప్పిపళ్ల సమస్యను ఎదుర్కొంటున్నారని చెప్పారు. సమగ్ర నోటి ఆరోగ్యానికి, పిప్పిపళ్ల సమస్యను నియంత్రించేందుకు వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నామని తెలిపారు. భారతీయ డెంటల్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ డాక్టర్ అశోక్ ధోబ్లే మాట్లాడుతూ.. ఏసీఎఫ్ఎఫ్తో ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషకరమని.. దీని ద్వారా సమాజంలో పిప్పిపళ్ల సమస్యను అధిగమించి, నోటి సంరక్షణపై అవగాహన కలిగించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.