COVID-19 Recovered Patients Should Change Their Toothbrush After Recovering Says Brazil Journal - Sakshi
Sakshi News home page

Corona Care: ఆ టూత్‌ బ్రష్‌ వాడకండి!

Published Tue, May 18 2021 10:45 AM | Last Updated on Tue, May 18 2021 8:02 PM

Covid Patients Must Change Used Brushes After Recovering Brazil Journal - Sakshi

‍ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి బ్యూరో: మనం వాడే టూత్‌ బ్రష్‌లు కోవిడ్‌ వాహకాలుగా మారుతున్నాయా? కోవిడ్‌ బారినపడిన వారు వినియోగించిన బ్రష్‌లను కోలుకున్నాక కూడా వాడితే ప్రమాదమా? రోజూ పళ్లు తోముకునే బ్రష్‌లతోనూ ముప్పు పొంచి ఉందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నారు దంత వైద్య నిపుణులు. బ్రెజిల్‌ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. దీనిని ‘బ్రెజిల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఇన్ఫెక్షియస్‌ సీజెస్‌’ ప్రచురించింది. ఈ నేపథ్యంలో టూత్‌ బ్రష్‌ల వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తలను దంత వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఒకసారి కోవిడ్‌ బారినపడి కోలుకున్న వారు కొన్నాళ్లకు మళ్లీ కరోనా బారిన పడుతున్న కేసుల్లో టూత్‌ బ్రష్‌ల పాత్ర కూడా ఉందని పరిశోధకులు తేల్చారు. ఈ బ్రష్‌లపై కనీసం 72 గంటల పాటు కరోనా వైరస్‌ సజీవంగా ఉంటుంది. అందువల్ల కోవిడ్‌ సోకినప్పుడు వాడిన బ్రష్‌నే కోలుకున్న తర్వాత కూడా వాడటం వల్ల కొంతమందికి తిరిగి కరోనా సోకుతున్నటుŠట్‌ ఆ అధ్యయనంలో నిర్ధారించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కోవిడ్‌ నుంచి కోలుకున్న వారు పాత టూత్‌ బ్రష్, టంగ్‌ క్లీనర్లను పడేసి కొత్తవి వాడాలని దంత వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కోవిడ్‌ రోగులు వాడే వాష్‌రూమ్‌ల్లో ఇతర కుటుంబ సభ్యుల టూత్‌ బ్రష్‌లు, టంగ్‌క్లీనర్లు, టూత్‌ పేస్ట్‌లతో పాటు ఇతర టాయిలెట్‌ వస్తువులు/సామగ్రిని ఉంచకూడదని సూచిస్తున్నారు.

ఆ బ్రష్‌లు వాడకూడదు
కోవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత వారు మళ్లీ ఆ బ్రష్‌లను ఉపయోగించకూడదు. రోగి వాడిన బ్రష్‌పై కనీసం 72 గంటల పాటు కరోనా వైరస్‌ సజీవంగా ఉంటుందని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్ల కోవిడ్‌ సోకిన 14 రోజుల తర్వాత పాత బ్రష్‌లు, టంగ్‌ క్లీనర్లను వదిలేసి కొత్తవి వాడాలి. కోవిడ్‌ బాధితులు నోటి శుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి. నోటిలో వైరస్‌/బ్యాక్టీరియా నివారణకు గోరు వెచ్చటి ఉప్పునీటిని పుక్కిలించాలి. 
– డాక్టర్‌ సుధ, విభాగాధిపతి, ప్రభుత్వ దంత వైద్య కళాశాల, విజయవాడ  

చదవండి: Corona: పిల్లల్లో కోవిడ్‌ లక్షణాలను ఎలా గుర్తుపట్టాలి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement