
ఢిల్లీ గురించి అంతగా తెలియదు: మోడీ
న్యూఢిల్లీ: పార్లమెంట్ భౌగోళిక స్థితిగతుల గురించిగానీ, నగరంలోని వీధుల గురించిగానీ తనకు సరైన అవగాహన లేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. స్థానిక జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో శనివారం జరిగిన బీజేపీ జాతీయ మండలి తొలి సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ పైవిధంగా పేర్కొన్నారు. ‘ఢిల్లీలో ఆయన ఏమిచేస్తారని ప్రజలు అనుకుంటుంటారు. అప్పుడప్పుడూ నేను కూడా అలాగే అనుకుంటాను’ అని అన్నారు.