
పోలీసులు ఏర్పాటు చేసిన వినూత్న బ్యానర్
తమిళనాడు,టీ.నగర్: కరోనా మహమ్మారితో యమలోకం హౌస్‌ఫుల్ కానుందని, అందరూ ఇళ్లలోనే ఉండాలంటూ దిండుగల్ పోలీసులు వినూత్న బ్యానర్‌తో అవగాహన కల్పిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంది. దిండుగల్ జిల్లాలో 45 మంది కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. దీంతో ప్రజలకు పోలీసులు పలు రకాలుగా అవగాహన కల్పిస్తున్నారు. ఇలావుండగా దిండుగల్ సౌత్ పోలీసులు ‘హౌస్‌ఫుల్’ యమలోకంలో స్థలం లేదని, యమధర్మరాజు దున్నపోతుపై ఆసీనుడై చేతులెత్తి నమస్కరిస్తున్న చిత్రంతో ‘దయచేసి ఎవరూ ఇళ్ల నుంచి బయటికి రావద్దు’ అని కోరుతున్నట్లు బ్యానర్ ఏర్పాటు చేసి వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment