కొత్త 2వేల రూపాయల నోటు అంటూ మోసం | Farmer Duped With Copy Of Rs 2000 Note | Sakshi
Sakshi News home page

కొత్త 2వేల రూపాయల నోటు అంటూ మోసం

Published Sun, Nov 13 2016 12:49 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

కొత్త 2వేల రూపాయల నోటు అంటూ మోసం - Sakshi

కొత్త 2వేల రూపాయల నోటు అంటూ మోసం

చిక్‌మగళూరు: అ‍త్యంత భద్రత ప్రమాణాలతో తయారు చేసిన కొత్త 2000 రూపాయల నోటు పేరు చెప్పి ఓ వ్యక్తి రైతును బురిడీ కొట్టించాడు. ఒరిజినల్‌ 2వేల రూపాయల నోటు ఫొటోకాపీని అంతే సైజులో రైతుకు ఇచ్చాడు. కర్ణాటకలోని చిక్‌మగళూరులో ఈ ఘటన జరిగింది.

అశోక్‌ అనే రైతు ఉల్లిపాయలను అమ్మేందుకు శనివారం మార్కెట్‌కు తీసుకెళ్లాడు. ​ఓ గుర్తు తెలియనివ్యక్తి ఆయన వద్ద ఉల్లిపాయలు కొనుగోలు చేసి, ఓ నోట్‌ ఇచ్చి కొత్తగా వచ్చిన 2వేల రూపాయల నోటు అని చెప్పాడు. నిజమేనని భావించిన అశోక్‌ ఆ నోటును తీసుకెళ్లాడు. దీన్ని స్నేహితులకు చూపించగా అది ఒరిజినల్‌ నోటు కాదని, ఫొటో కాపీ అని చెప్పారు. చిక్‌మగళూరు ఎస్పీ అన్నామలై  మాట్లాడుతూ.. ఒరిజినల్‌ నోటు ఫొటో కాపీని గుర్తుతెలియని వ్యక్తి రైతుకు ఇచ్చాడని, ఎవరైనా ఈ విషయాన్ని సులభంగా గుర్తించగలరని చెప్పారు. కాగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన 2 వేల రూపాయల నోట్లు అందరికి అందుబాటులోకి రాకపోవడం, వాటిని చూసి ఉండకపోవడంతో కొందరు పొరపాటుపడే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement