దేశ రాజధాని నగరంలోని కొరియర్ ఫ్యాక్టరీలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
ఆదివారం కావడంతో తప్పిన ముప్పు
న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలోని కొరియర్ ఫ్యాక్టరీలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని ఓఖ్లా ఫేస్-2లో ఉదయం 8 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. కాగా, ఆదివారం ఈ ఘటన జరగడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదని ఢిల్లీ అగ్నిమాపక అధికారి ఎ.కె.శర్మ తెలిపారు. ‘ఉదయం 8:15 సమయంలో ఈ సంఘటన జరిగింది. ప్రమాద విషయం తెలియగానే 14 అగ్నిమాపక శకటాలను ఘటనాస్థలికి పంపించాం’ అని చెప్పారు.