నలుగురు పోలీసుల సస్పెన్షన్ | Four policemen Violence Against Women | Sakshi
Sakshi News home page

నలుగురు పోలీసుల సస్పెన్షన్

Published Sat, Apr 4 2015 11:42 PM | Last Updated on Tue, Aug 21 2018 8:14 PM

Four policemen Violence Against Women

న్యూఢిల్లీ : దొంగతనం చేసినట్టు అంగీకరించాలంటూ దక్షిణ రోహిణి పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు మహిళలను హింసించిన నలుగురు పోలీసులను శనివారం సస్పెండ్ చేశారు. చేయని నేరం చేసినట్లు అంగీకరించాలని నలుగురు పోలీసులు తమను కొట్టినట్లు బాధిత మహిళలు ఫిర్యాదు చేయడంతో సబ్ ఇన్స్‌పెక్టర్‌తో పాటు మరో ముగ్గురు పోలీసులను విధుల నుంచి తొలగించారు.

ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసు శాఖ ధ్రువీకరించింది. నేరం ఒప్పుకోవాల్సిందిగా బలవంతం పెట్టినందుకు, మహిళలను కొట్టినందుకు ఐపీసీ సెక్షన్ 323, 330, 342, 509 కింద కేసు నమోదు చేసి.. అంతర్గత విచారణకు ఆదేశించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement