ఆస్తి వివాదం..ఆగిన అంత్యక్రియలు
వేములవాడ : ఆస్తి విషయంలో నెలకొన్న వివాదం వల్ల ఓ వ్యక్తి అంత్యక్రియలు మధ్యలోనే ఆగిపోయాయి. ఈ సంఘటన వేములవాడలో చోటు చేసుకుంది. వేములవాడకు చెందిన పోలాస విశ్వనాథం (95) అనే వ్యక్తికి పిల్లలు లేకపోవడంతో మేనల్లుడు అయిన కిషన్‌ను పెంచుకున్నాడు. అయితే సొంత తమ్ముడు నరసింహచారి కొడుకు చిరంజీవి మాత్రం తనను చిన్నప్పుడే దత్తత తీసుకున్నాడు అని అంత్యక్రియలు తనే చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శవాన్ని రోడ్డు మీదే ఉంచి ఇరువురు గొడవకు దిగారు.
దీంతో తమ్ముడు కొడుకు చిరంజీవి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం తరువాత అంత్యక్రియలు చేయాలని చెప్పారు.