వాట్సప్ హెల్ప్‌లైన్‌కు విశేష స్పందన | good response whats up special help line | Sakshi
Sakshi News home page

వాట్సప్ హెల్ప్‌లైన్‌కు విశేష స్పందన

Published Sun, Aug 10 2014 10:36 PM | Last Updated on Fri, Jul 27 2018 1:16 PM

good response whats up special help line

 న్యూఢిల్లీ: నగర పోలీసు శాఖలో అవినీతిని నిరోధించేందుకు ఉన్నతాధికారులు నడుం బిగించారు. ఇందులోభాగంగా వాట్సప్ హెల్ప్‌లైన్‌ను త్వరలో ప్రారంభించారు. ఒకరిని వేధింపులకు గురిచేయడంగానీ లేదా లంచాలకు పాల్పడడం వంటివిగానీ చేయడం జరిగితే అందుకు సంబంధించిన వీడియో క్లిప్‌లను వాట్సప్‌లో లోడ్ చేయొచ్చు. అత్యవసరమనుకుంటే 9910641064 నంబర్‌కు కాల్‌చేసి వివరాలను అందించవచ్చు. ఈ వాట్సప్ హెల్ప్‌లైన్‌ను ఈ నెల ఆరో తేదీన సంబంధిత అధికారులు ప్రారంభించారు. కాగా ఈ హెల్ప్‌లైన్‌కు అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఈ విషయమై విజిలెన్స్ విభాగం డీసీపీ సింధు పిళ్లై ఆదివారం మీడియాతో మాట్లాడుతూ అవినీతికి సంబంధించి ఏదైనా ఆడియోగానీ లేదా వీడియోగానీ తమ వద్ద ఉంటే ప్రజలు తమ వాట్సప్ హెల్ప్‌లైన్ నంబర్‌కు పంపవచ్చన్నారు. వాట్సప్ హెల్ప్‌లైన్ నంబర్‌ను అన్ని ఆంగ్ల, హిందీ దినపత్రికలతోపాటు ఎఫ్‌ఎం చానళ్లలోనూ ప్రకటన ఇచ్చామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement