దేశ రాజధాని న్యూఢిల్లీలో ఓ ప్రదేశం (పాత ఫొటో)
న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ భూకంపం సంభవించబోతోందంటూ నాసా పేరిట ఓ నకిలీ వార్త వాట్సాప్‌లో షేర్ అవుతోంది. 9.1 తీవ్రతతో రాబోయే భూకంపం లక్షల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంటుందని ఆ వార్త సారాంశం.
వచ్చే నెల 7వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య గురుగ్రామ్ కేంద్రంగా ఈ తీవ్ర భూకంపం సంభవిస్తుందని నాసా ప్రకటించినట్లు అందులో ఉంది. ఢిల్లీ, హరియాణా, పంజాబ్, జమ్మూ కశ్మీర్, తమిళనాడు, రాజస్థాన్, బిహార్‌లోని మీ సన్నిహితులందరికీ ఈ మెసేజ్‌ను వెంటనే షేర్ చేయండని కూడా రాసి ఉంది.
ఇది నకిలీ వార్త అని పసిగట్టేది ఇలా..
భూకంపం ఇప్పుడు సంభవిస్తుంది అని ముందుగానే ఊహించి చెప్పలేం. శాస్త్రవేత్తలు కూడా అలా చేయలేరు. న్యూఢిల్లీలో సంభవించే భూకంపం తమిళనాడుపై ఎలా ప్రభావం చూపుతుంది?. భారీ భూకంపం లాంటి విపత్తు ఢిల్లీని చుట్టుముట్టబోతుంటే నాసా కంటే ముందు భారత ప్రభుత్వమే దీనిపై ప్రకటన చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment