అజిత్‌తో నటించాలనుంది | great opportunity Ajith act Hansika Motwani | Sakshi
Sakshi News home page

అజిత్‌తో నటించాలనుంది

Published Mon, Nov 3 2014 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM

అజిత్‌తో నటించాలనుంది

అజిత్‌తో నటించాలనుంది

 రజనీకాంత్, కమలహాసన్ తరువాత కోలీవుడ్‌లో హీరోయిన్లు ఒక్కసారి అయినా కలిసి నటించాలని ఆశించే నటుడు అజిత్. అలాంటి నటుడితో జతకట్టాలన్న ఆకాంక్ష  హన్సికకు ఉందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఈ బబ్లీగర్ల్ కోరిక నెరవేరబోతోందనే ప్రచారాన్ని ఇటీవల మీడియా ఊదర గొట్టింది. దీంతో నిజంగానే అలాంటి అవకాశం తనకు రానుందేమోనని హన్సిక ఆనందించిందట. వీరం చిత్రం తరువాత అజిత్, దర్శకుడు శివ కాంబినేషన్‌లో మరో చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలోనే హన్సిక హీరోయిన్ అంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ హన్సిక కాదు అని ఆ చిత్ర దర్శకుడు ఇటీవల కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు.
 
 ఇది హన్సికకు నిరాశపరచే విషయమే. ఈ వ్యవహారంపై ఈ ముద్దుగుమ్మ స్పందిస్తూ అజిత్ సరసన నటించే అవకాశం రావడం గొప్ప విషయమేనంది. ఆయనతో జత కట్టాలనే కోరిక తనకు ఉందని చెప్పింది. అయితే అజిత్ సరసన ఆ చిత్రంలో నటించమని తనను ఎవరూ అడగలేదని తెలిపింది. భవిష్యత్తులో అజిత్‌కు జంటగా నటించే అవకాశం వస్తుందని ఆశిస్తున్నానంది. అదే విధంగా ప్రస్తుతం తాను పలు చిత్రాలతో బిజీగానే వున్నానని చెప్పింది. సుందర్ సి దర్శకత్వంలో విశాల్ సరసన ఆంబళ చిత్రంలోను, జయం రవితో రోమియో జూలియట్ చిత్రంలోను నటిస్తున్నానని తెలిపింది. త్వరలో విజయ్ నటించే నూతన చిత్రంలో ఆయనకు జంటగా నటించనున్నట్టు చెప్పింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement