జీఎస్‌ఎస్‌కు కన్నీటి వీడ్కోలు | GSS tearful farewell | Sakshi
Sakshi News home page

జీఎస్‌ఎస్‌కు కన్నీటి వీడ్కోలు

Published Fri, Dec 27 2013 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM

GSS tearful farewell

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : జాతీయ కవి జీఎస్. శివరుద్రప్ప (జీఎస్‌ఎస్)కు ఇక్కడి బెంగళూరు విశ్వ విద్యాలయంలోని కళాగ్రామలో గురువారం సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. 87 ఏళ్ల జీఎస్‌ఎస్ దీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ సోమవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. అంతిమ యాత్రకు ముందు పార్థివ శరీరాన్ని కిమ్స్ ఆస్పత్రి నుంచి బనశంకరిలోని నివాసానికి తరలించారు.

అనంతరం కన్నడ సాహిత్య పరిషత్ ఆవరణ, రవీంద్ర కళా క్షేత్రలో ప్రజల దర్శనార్థం ఉంచారు. మాజీ ముఖ్యమంత్రి, కేజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప, బీఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు సహా పలువురు రాజకీయ ప్రముఖులు, స్వామీజీలు ఆయన భౌతిక కాయాన్ని దర్శించుకుని నివాళులర్పించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement