న్యూఢిల్లీ: ప్రపంచ మధుమేహ దినం సందర్భంగా అత్యధిక రక్త పరీక్షలు నిర్వహించిన నగరానికి చెందిన ఓ ప్రైవేటు సంస్థ గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. ఎస్‌ఆర్‌ఎల్ డయాగ్నోస్టిక్స్ సంస్థ ఢిల్లీ, ముంబై నగరాల్లో ఎనిమిది గంటల వ్యవధిలో 10,508 రక్తపరీక్షలు నిర్వహించింది. ఈ రికార్డు గతంలో యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పేరున నమోదైంది. గత మే నెలలో యూఏఈలో 9,642 పరీక్షలు నిర్వహించారు. మధుమేహం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు, ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించేందుకు గాను ప్రజలను ప్రోత్సహించే ప్రక్రియలో భాగంగా ఈ ఉచిత రక్త పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీలోని తీహార్ జైలు, నీమ్కా జైల్ లైబ్రరీ, నీమ్కా జైల్ వుమెన్స్ వార్డ్, ఎమిటీ స్కూల్, ఫోర్టిస్ షాలీమార్ బాగ్, ఫోర్టిస్ నోయిడా తదితర ప్రాంతాల్లోని ఎస్‌ఆర్‌ఎల్ డయగ్నోస్టిక్స్‌లో ఈ నిర్వహించారు. అలాగే ముంబైలో ధారవిలోని వివిధ కేంద్రాల్లో ఫోర్టిస్ వాశి, ఫోర్టిస్ ములుండ్‌లలో ఈ పరీక్షలు నిర్వహించారు.
రక్త పరీక్షల్లో గిన్నిస్ రికార్డు
Published Wed, Dec 3 2014 10:53 PM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM
Advertisement