విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ వారి దసరా ఉత్సవాలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
విజయవాడ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ వారి దసరా ఉత్సవాలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గమ్మ గర్భాలయం నుంచి అమ్మవారి ఉత్సవ మూర్తులను మంగళవాయిద్యాల నడుమ మహామంటపానికి తరలించారు. వేకువజాము నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. ప్రస్తుతం ఆలయంలో నాలుగు క్యూలైన్లలో భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. వీవీఐపీ, వీఐపీ దర్శనాలకు రూ. 500 , రూ.300 టికెట్లతో ప్రత్యేక క్యూ ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో ఎ. సూర్యకుమారి తెలిపారు.