సాక్షి, చెన్నై: కార్మికుల హక్కుల్ని పరిరక్షించడమే లక్ష్యంగా ముందుకు వెళదామని మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ పిలుపునిచ్చారు. న్యాయమూర్తుల పదవుల భర్తీల్లో మహిళలకు సముచిత న్యాయం జరుగుతోందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాలలో మంగళవారం న్యాయ సంబంధిత అంశాలపై సదస్సు జరిగింది. ఆ వర్సిటీ వీసీ వనగాముడి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో పారిశ్రామిక రంగం కీలక భూమిక పోషిస్తున్నదని పేర్కొన్నారు. ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సముచిత న్యాయం దక్కే విధంగా , వారి హక్కుల పరిరక్షణ లక్ష్యంగా ముందుకు వెళదామని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధిలో వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సేవారంగంలు కీలక భూమిక పోషిస్తున్నా, ఆర్థిక పరంగా సేవా రంగం ముఖ్యపాత్రను కల్గి ఉన్నదని వివరించారు. మహిళా న్యాయమూర్తులకు సముచిత న్యాయం దక్కే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. న్యాయమూర్తుల నియామకాల్లో యాభై శాతం మేరకు మహిళల్ని ఇప్పటికే నియమించారని తెలిపారు.
హక్కులు పరిరక్షిద్దాం
Published Wed, Apr 1 2015 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 PM
Advertisement