Workers rights
-
కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్న ప్రభుత్వాలు
కుషాయిగూడ: కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తోందని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు కె.హేమలత విమర్శించారు. సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సీఐటీయూ) తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభను శనివారం కుషాయిగూడలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ దేశంలో కార్మిక చట్టాలు నీరుగారిపోవడంతో జీవించలేని పరిస్థితులు నెలకొంటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్మికుల హక్కులను హరిస్తూ కార్పొరేట్లకు పెద్దపీఠ వేశారని మండిపడ్డారు. ఇండస్ట్రియల్ కోడ్ బిల్లు మూలంగా చట్టసభల్లో కార్మికుల సమస్యలు ప్రస్తావించే అవకాశముండదని, సమ్మెను చట్టవిరుద్ధంగా పరిగణిస్తారని తెలిపారు. ఇక తెలంగాణలో నియంత దొరపాలన సాగుతోందని హేమలత ఆరోపించారు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఇటీవలి ఆర్టీసీ కార్మికుల సమ్మేనని చెప్పారు. ఈ నేపథ్యంలో వచ్చే జనవరి 8న జరిగే జాతీయ సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
శ్రమజీవుల పండగ మేడే..
కార్మికుల హక్కుల సాధనలో భాగంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి. వాటి ఫలితంగా కార్మికుల సంక్షేమ కోసం ప్రభుత్వాలు అనేక చట్టాలు ప్రవేశపెట్టాయి. కొన్ని నామమాత్రంగా అమలవుతున్నా చాలా వరకు అమలుకు నోచుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. వాటి కొన్ని చట్టాలు.. ఇలా ఉన్నాయి.. 1948లో కనీస వేతన చట్టం, 1988 లో దుకాణాల, సంస్థల చట్టం 1923లో కార్మిక వ్యవహరాల చట్టం, 1947లో కార్మిక వివాదాల చట్టం, 1946లో ఇండస్ట్రీయల్ ఎంప్లాయ్మెంట్, 1972గ్రాట్యూటీ చెల్లింపు, 1926లో కార్మికసంఘాల చట్టం, 1936లో వేతన చెల్లింపు చట్టం, 1970లో కాంట్రాక్ట కార్మిక చట్టం, బీడీ కార్మికుల చట్టం, 1965లో బోతస్ చెల్లింపు చట్టం, 1979 లో అంతరాష్ట్ర వలస కార్మికుల చట్టం, 1974లో జాతీయ పండగ, ఇతర సెలవుల చట్టం, 1979లో హమాలీ, అదర్ మ్యానువల్ చట్టం, 1976లో సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ చట్టం, సమాన వేతనాల చట్టం, బాల కార్మికుల చట్టం, మహిళ కార్మికుల చట్టం, 1987లో కార్మిక సంక్షేమ నిధి, 1961లో మోటార్ రవాణా కార్మికుల చట్టం, కార్మిక రాజ్యభీమా చట్టంతో పాటు భవన నిర్మాణరంగ కార్మిక సంక్షేమ చట్టం అమలులోకి వచ్చాయి. కానీ అమలుకు నోచుకోవడం లేదు. అవగాహన అవసరం ఎంతో మంది కార్మికులు నిరంతరం కష్టపడుతుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కాయకష్టం చేస్తారు. కార్మికులు ఒళ్లు నొప్పులు తగ్గేందుకు మద్యానికి అలవాటవుతారు. ఇది సరైంది కాదు. కొంతమంది మధ్యాహ్న భోజనానికి ప్రాధాన్యం ఇవ్వరు. పనిచేయాలంటే ఆహారం తీసుకోవడం తప్పనిసరి. ఆరో గ్య సమస్యలు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయవద్దు. వీటిపై అవగాహన అవసరం.. ప్రతి కార్మికుడి పేరిట సంబంధిత సంస్థ కొంత ఆరోగ్యబీమా కోసం ప్రీమియం చెల్లిస్తోంది. ప్రతి కార్మికుడు తన కుటుంబ సభ్యుల పేరుతో ఈఎస్ఐ కార్డు తీసుకోవాలి. ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు. భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేక ప్రమాదబీమా అందుబాటులో ఉంది. నెలకు రూపాయి ప్రీమియం చెల్లించి ఈ సదుపాయాన్ని పొందవచ్చు. ఏదైనా ప్రమాదాలు జరిగి కార్మికుడు మరణిస్తే రూ.2 లక్షల బీమా అందిస్తారు. వైకల్యం పొందితే రూ.లక్ష ఇస్తారు. ఇవే కాక 1968 చట్టం ప్రకారం దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు, 1948 ఫ్యాక్టరీల చట్టం కింద పనిచేస్తున్న కార్మికులకు, 1961 మోటార్ చట్టం కింద పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమ మండలి అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తోంది. దీర్ఘకాలిక వ్యాధుల కోసం, ప్రసూతి లబ్ధి పథకం, కుటుంబ నియంత్రణ పథకం, ఉపకార వేతనాలు తదితర సౌకర్యాలను ప్రభుత్వాలు అందజేస్తున్నారుు. ఈ చట్టాలపై కూడా ప్రతి కార్మికుడికి అవగాహన అవసరం. -
సమ్మె స్ఫూర్తితో హక్కుల సాధన
- రౌండ్ టేబుల్ సమావేశంలో వ క్తలు - హాజరైన ఎమ్మెల్యే దివాకర్‌రావు, టీబీజీకేఎస్, జేఏసీ నేతలు శ్రీరాంపూర్ : తెలంగాణ ఏర్పాటుకోసం చేసిన సకల జనుల సమ్మె పోరాట స్ఫూర్తితో సింగరేణి కార్మికుల హక్కులను సాధించుకుందామని వక్తలు పిలుపునిచ్చారు. సకల జనుల సమ్మె జరిగి నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్‌లోని ప్రగతి మైదానం సీఈఆర్ క్లబ్లో ఆదివారం రౌండ్ టేబుల్ సమావే శం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మె ల్యే దివాకర్‌రావు, టీబీజీకేఎస్ మాజీ అధ్యక్షుడు కెంగర్ల మ ల్లయ్య, సింగరేణి జేఏసీ చైర్మన్ ఎండీ.మునీర్, ఎంపీపీ బేర సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. తొలుత తెలంగాణ అమరులకు నివాళులర్పించారు. అనంతరం వక్తలు సకల జనుల సమ్మెలో కార్మికుల పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ఈ మేరకు నాటి సమ్మె స్ఫూర్తితో.. ప్రస్తుతం హక్కుల సాధన, సదుపాలు, ఉద్యోగాల కోసం పోరాడాలని వారు కార్మికులకు పిలుపునిచ్చారు. సమావేశంలో నూనె మల్లయ్య, దమ్మాల శ్రీనివాస్‌తో పాటు పలువురు కళాకారులు తమ పాటలతో ఆకట్టుకున్నారు. సీఎం దృష్టికి సింగరేణి సమస్యలు.. సింగరేణి కార్మికుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని మంచిర్యాల ఎమ్మెల్యే ఎన్.దివాకర్‌రావు తెలిపా రు. అలాగే, శ్రీరాంపూర్‌లో సకల జనుల సమ్మె స్మృతి చిహ్నం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. కాగా, కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని పేర్కొన్నా రు. పలు తీర్మానాలను ఆమోదించిన ఈ సమావేశంలో శ్రీరాంపూర్ జేఏసీ కన్వీనర్ గోషిక మల్లేష్, సర్పంచ్ ఎం.రాజేంద్రపాణి, టీబీజీకేఎస్ నాయకులు పెద్దపల్లి కోటిలింగం, బంటు సారయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వంగ తిరుపతి, జిల్లా కార్యదర్శి వేల్పుల రవీందర్, నాయకులు కానుగంటి చంద్రయ్య, ముస్కె సమ్మయ్య, చిలువేరు సదానందం, జావేద్, ఏ.కిషన్ తదితరులు పాల్గొన్నారు. -
హక్కులు పరిరక్షిద్దాం
సాక్షి, చెన్నై: కార్మికుల హక్కుల్ని పరిరక్షించడమే లక్ష్యంగా ముందుకు వెళదామని మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ పిలుపునిచ్చారు. న్యాయమూర్తుల పదవుల భర్తీల్లో మహిళలకు సముచిత న్యాయం జరుగుతోందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాలలో మంగళవారం న్యాయ సంబంధిత అంశాలపై సదస్సు జరిగింది. ఆ వర్సిటీ వీసీ వనగాముడి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో పారిశ్రామిక రంగం కీలక భూమిక పోషిస్తున్నదని పేర్కొన్నారు. ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సముచిత న్యాయం దక్కే విధంగా , వారి హక్కుల పరిరక్షణ లక్ష్యంగా ముందుకు వెళదామని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధిలో వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సేవారంగంలు కీలక భూమిక పోషిస్తున్నా, ఆర్థిక పరంగా సేవా రంగం ముఖ్యపాత్రను కల్గి ఉన్నదని వివరించారు. మహిళా న్యాయమూర్తులకు సముచిత న్యాయం దక్కే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. న్యాయమూర్తుల నియామకాల్లో యాభై శాతం మేరకు మహిళల్ని ఇప్పటికే నియమించారని తెలిపారు. -
కార్మిక చట్టాల్లో మార్పులు తెస్తాం
కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: కార్మికుల హక్కులను కాపాడుతూ వారి సంక్షేమం, అభివృద్ధి కోసం చట్టాల్లో మార్పులు చేయనున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. శుక్రవారం బర్కత్‌పురలోని రీజినల్ పీఎఫ్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి కార్మికుడితోబ్యాంక్ ఖాతా తెరిపించే బాధ్యత కంపెనీదేనన్నారు. దేశంలో తొలిసారిగా భవన నిర్మాణ, బీడీ కార్మికులకు పీఎఫ్ సదుపాయం కల్పించి, ఐడీ కార్డులు, యూనివర్సల్ అకౌంట్ నెంబర్లు ఇస్తామని తెలిపారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ‘ఎంప్లాయీస్ డిపాజిట్- బ్యాంకు లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీం’ కింద చెల్లిస్తున్న పరిహారాన్ని రూ.1.30 లక్షల నుంచి రూ.3.60 లక్షలకు పెంచినట్లు మంత్రి వెల్లడించారు. సికింద్రాబాద్ బోయిగూడ కమాన్ వద్దనున్న ఈఎస్ఐ ఆస్పత్రిని 200 పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. అదేవిధంగా రామగుండం, వరంగల్ ఈఎస్ఐ ఆస్పత్రులను అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పైడి భీమవరం, తిరుపతిల్లో 100 పడకల ఆస్పత్రులు, నాచారంలోని ఈఎస్ఐ ఆస్పత్రిలో దంత కళాశాలను ఏర్పాటు చేయనున్నట్లు దత్తాత్రేయ తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా శిక్షణాకేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఫ్యాషన్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ సెంట్రల్ పీఎఫ్ కమిషనర్ కేవీ సర్వేశ్వరన్, రీజినల్ కమిషనర్ ఎంవీఎస్ఎస్ శ్రీ కృష్ణ, కమిషనర్లు అశ్రఫ్ కామిల్, రవీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.