కార్మికుల హక్కుల సాధనలో భాగంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి. వాటి ఫలితంగా కార్మికుల సంక్షేమ కోసం ప్రభుత్వాలు అనేక చట్టాలు ప్రవేశపెట్టాయి. కొన్ని నామమాత్రంగా అమలవుతున్నా చాలా వరకు అమలుకు నోచుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. వాటి కొన్ని చట్టాలు.. ఇలా ఉన్నాయి.. 1948లో కనీస వేతన చట్టం, 1988 లో దుకాణాల, సంస్థల చట్టం 1923లో కార్మిక వ్యవహరాల చట్టం, 1947లో కార్మిక వివాదాల చట్టం, 1946లో ఇండస్ట్రీయల్ ఎంప్లాయ్‌మెంట్, 1972గ్రాట్యూటీ చెల్లింపు, 1926లో కార్మికసంఘాల చట్టం, 1936లో వేతన చెల్లింపు చట్టం, 1970లో కాంట్రాక్ట కార్మిక చట్టం, బీడీ కార్మికుల చట్టం, 1965లో బోతస్ చెల్లింపు చట్టం, 1979 లో అంతరాష్ట్ర వలస కార్మికుల చట్టం, 1974లో జాతీయ పండగ, ఇతర సెలవుల చట్టం, 1979లో హమాలీ, అదర్ మ్యానువల్ చట్టం, 1976లో సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ చట్టం, సమాన వేతనాల చట్టం, బాల కార్మికుల చట్టం, మహిళ కార్మికుల చట్టం, 1987లో కార్మిక సంక్షేమ నిధి, 1961లో మోటార్ రవాణా కార్మికుల చట్టం, కార్మిక రాజ్యభీమా చట్టంతో పాటు భవన నిర్మాణరంగ కార్మిక సంక్షేమ చట్టం అమలులోకి వచ్చాయి. కానీ అమలుకు నోచుకోవడం లేదు.
అవగాహన అవసరం
ఎంతో మంది కార్మికులు నిరంతరం కష్టపడుతుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కాయకష్టం చేస్తారు. కార్మికులు ఒళ్లు నొప్పులు తగ్గేందుకు మద్యానికి అలవాటవుతారు. ఇది సరైంది కాదు. కొంతమంది మధ్యాహ్న భోజనానికి ప్రాధాన్యం ఇవ్వరు. పనిచేయాలంటే ఆహారం తీసుకోవడం తప్పనిసరి. ఆరో గ్య సమస్యలు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయవద్దు. వీటిపై అవగాహన అవసరం.. ప్రతి కార్మికుడి పేరిట సంబంధిత సంస్థ కొంత ఆరోగ్యబీమా కోసం ప్రీమియం చెల్లిస్తోంది. ప్రతి కార్మికుడు తన కుటుంబ సభ్యుల పేరుతో ఈఎస్‌ఐ కార్డు తీసుకోవాలి. ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు.
భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేక ప్రమాదబీమా అందుబాటులో ఉంది. నెలకు రూపాయి ప్రీమియం చెల్లించి ఈ సదుపాయాన్ని పొందవచ్చు. ఏదైనా ప్రమాదాలు జరిగి కార్మికుడు మరణిస్తే రూ.2 లక్షల బీమా అందిస్తారు. వైకల్యం పొందితే రూ.లక్ష ఇస్తారు. ఇవే కాక 1968 చట్టం ప్రకారం దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు, 1948 ఫ్యాక్టరీల చట్టం కింద పనిచేస్తున్న కార్మికులకు, 1961 మోటార్ చట్టం కింద పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమ మండలి అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తోంది. దీర్ఘకాలిక వ్యాధుల కోసం, ప్రసూతి లబ్ధి పథకం, కుటుంబ నియంత్రణ పథకం, ఉపకార వేతనాలు తదితర సౌకర్యాలను ప్రభుత్వాలు అందజేస్తున్నారుు. ఈ చట్టాలపై కూడా ప్రతి కార్మికుడికి అవగాహన అవసరం.
శ్రమజీవుల పండగ మేడే..
Published Sun, May 1 2016 2:20 AM | Last Updated on Sun, Sep 3 2017 11:07 PM
Advertisement