నగరంలో సోమవారం జరిగిన ఢిల్లీ పోలీసు వ్యవస్థాపక దినోత్సవ పరేడ్‌లో ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌గానీ, ఆయన మంత్రివర్గ సహచరులు
సాక్షి, న్యూఢిల్లీ : నగరంలో సోమవారం జరిగిన ఢిల్లీ పోలీసు వ్యవస్థాపక దినోత్సవ పరేడ్‌లో ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌గానీ, ఆయన మంత్రివర్గ సహచరులు గానీ పాల్గొనలేదు. దీనికి అంత ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం లేదని, మంగళవారం జరిగే ఎట్ హోమ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ చెప్పారు. గతంలో కూడా మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదనే విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. బస్సీసోమవారం ఉదయం కేజ్రీవాల్‌ను కలసి పోలీసు వ్యవస్థాపక దినోత్సవానికి రావాలంటూ ఆహ్వానించారు. కేజ్రీవాల్ కార్యక్రమం సమయాన్ని రాసుకున్నారని, మంగళవారం జరిగే కార్యక్రమానికి హాజరవుతారనే నమ్మకం తనకుందని బస్సీ చెప్పారు.
కేజ్రీవాల్‌తో జరిగిన సమావేశంలో శాంతిభద్రతల పరిరక్షణ, మహిళల భద్రతకు సంబంధించి తాము చేపడుతున్న చర్యలపై చర్చించినట్లు బస్సీ చెప్పారు. ఢిల్లీవాసుల భద్రతకు ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుందంటూ ముఖ్యమంత్రి తనకు హామీ ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రికి భద్రత విషయంలో కేజ్రీవాల్ అభీష్టాన్ని గౌరవిస్తామన్నారు. పోలీసులు కల్పించే భద్రత సామాన్యులు తనను కలవడానికి అడ్డంకిగా మారొచ్చని సీఎం భావిస్తున్నారని, అందువల్లనే ఆయనకు భద్రతను పునర్‌వ్యవస్థీకరిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పొందవచ్చు. అయితే కిందటిసారి సీఎం అయిన సందర్భంలోనూ భద్రతను నిరాకరించారు. పోలీసు భద్రత అనేది కేజ్రీవాల్‌కు, ప్రజలకు మధ్య అడ్డుగోడలా మారుతుందని, అందువల్ల కేజ్రీవాల్ ఈసారి కూడా భద్రత తీసుకోబోరంటూ ఆప్ నేత ఆశుతోష్ వారం క్రితం తెలిపిన సంగతి విదితమే. ఇదే అంశ ంపై మీడియా అడిగిన ప్రశ్నకు బస్సీ సమాధానమిస్తూ కేబినెట్‌కు, ముఖ్యమంత్రికి భద్రత కల్పించడం తమ బాధ్యతని అన్నారు. ప్రముఖుల పదవులను బట్టి తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తామన్నారు. అదే సమయంలో వారి అవసరాల్నికూడా దృష్టిలో ఉంచుకుంటామన్నారు. భద్రతకు సంబంధించిన వివరాలను బయపెట్టబోనన్నారు.
కళ్లు తిరిగి పడిపోయిన మహిళా అధికారి
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పరేడ్‌లో పాల్గొన్న మహిళా అధికారిణి సృ్పహ తప్పి పడిపోయింది. పరేడ్ అనంతరం మహిళా భద్రతపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రసంగిస్తుండగా నియతి మిట్టల్ అనే మహిళా అధికారిణి ఆకస్మికంగా కిందపడిపోయింది. దీనిని గమనించిన రాజ్‌నాథ్‌సింగ్ ఒక్క నిమిషంపాటు ఆ తర్వాత తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇదే సమయంలో సహ ఉద్యోగులు నియతిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సుదీర్ఘ పని గంటలే ఇందుకు కారణమని ఇతర అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ఇదే విషయమై పోలీసు శాఖ అధికార ప్రతినిధి రాజన్‌భగత్ మాట్లాడుతూ ఇటువంటివి సర్వసాధారణమేనన్నారు. ఒకే స్థితిలో ఎక్కువ సమయం అలాగే నిలబడితే ఇలా జరుగుతుందన్నారు. సుదీర్ఘ సమయంపాటు ఒకే స్థితిలో నిలబడాల్సి వస్తే ఏమిచేయాలనే విషయంలో శిక్ష ణా సమయంలో వీరికి నిపుణులు తగు సలహాలు, సూచనలు ఇస్తారన్నారు.