గాలికుంటుకు పరిహారం | 'Illegal - discipline, an increase in the duration of Compliance | Sakshi
Sakshi News home page

గాలికుంటుకు పరిహారం

Published Sat, Oct 12 2013 4:39 AM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM

రాష్ర్టంలో గాలికుంటు వ్యాధితో మృతిచెందిన పశువులకు సంబంధించిన యజమానులకు రూ.25 వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది.

 =‘అక్రమ-సక్రమ’ వర్తింపు వ్యవధి పెంపు  
 =మంత్రి వర్గం నిర్ణయాలు

 
 సాక్షి, బెంగళూరు : రాష్ర్టంలో గాలికుంటు వ్యాధితో మృతిచెందిన పశువులకు సంబంధించిన యజమానులకు రూ.25 వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. బెంగళూరుతో పాటు ఇతర నగరాల్లో అక్రమ-సక్రమ వర్తింపు వ్యవధిని పెంచాలని తీర్మానించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన సమావేశం అనంతరం న్యాయ శాఖ మంత్రి టీబీ. జయచంద్ర  మంత్రి వర్గం నిర్ణయాలను విలేకరుల సమావేశంలో తెలిపారు. ముఖ్యాంశాలు.
 
= గాలికుంటు వ్యాధితో మరణించిన ఒక్కో ఆవుకు రూ.25 వేల నష్ట పరిహారం. ఇందులో కర్ణాటక పాడి సమాఖ్య వాటా రూ.10 వేలు. గేదెలు, దూడలకు నష్ట పరిహారం త్వరలో వెల్లడి.
 
= బెంగళూరు సహా నగరాల్లో బ్లూప్రింట్‌కు వ్యతిరేకంగా నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు వ్యవధి విస్తరణ. ఇప్పటి వరకు 2009 డిసెంబరు 31కి ముందు నిర్మించిన భవనాలకే ఈ పథకం వర్తించేది. ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చి, గవర్నర్ దానిపై సంతకం చేసే తేదీ వరకు విస్తరణ.
 
= ఆశా కార్యకర్తలకు ఇకపై నెలకు రూ.1,000 ప్రోత్సాహకం.  
 
= పేద విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లు.
 
= రేషన్ షాపుల్లో అక్రమాల నిరోధానికి నలుగురితో కమిటీ.
 
= జిల్లాకో తాలూకాలో ఉచిత డయాలసిస్ కేంద్రం
 
= ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో అన్ని ఆదాయ వర్గాలకు ఇళ్ల నిర్మాణానికి విధానం
 
= ముఖ్యమంత్రికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంపిక అధికారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement