జయపురం: కొరాపుట్ జిల్లా కొట్‌పాడ్ పోలీస్‌స్టేషన్ పరిధి కుసిమి రైల్వే పట్టాల వద్ద లభించిన యువకుడు, బాలికల మృతదేహాల సంఘటనపై దర్యా ప్తు జరిపి వాప్తవాలు తెలుసుకోవాలని మృతుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు వా రు కోట్‌పాడ్ పోలీసులను కలిసి విన్నవించారు. ఈ నెల 21 వ తేదీన కొరాపుట్ జిల్లా కొట్‌పాడ్ సమీప కుసిమి రైల్వేస్టేషన్ పట్టాలపై ఇద్దరు యువతీయువకుల మృతదేహాలు ఉన్నట్లు సాక్షిలో వార్త ప్రచురించిన విషయం విదితమే. పట్టా లపై మృతి చెందిన వారిద్దరూ అన్నా చెల్లెళ్లు అవుతారని తెలిసింది. వారిద్దరూ ఆముండి పొదర్ గ్రామానికి చెందినవారు.
వారి మరణం ఎలా సంభవించిందన్నది చర్చనీయాంశమైంది. వారు ఆత్మహత్య చేసుకున్నారా? లేదా ఎవరైనా హత్య చేశారా? అన్నది వెల్లడి కాలేదు. అయితే వారిని ఎవరో హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. వార్డు మెంబర్ అర్జున భొత్ర, బాలిక ధనమతి ముదులి తండ్రి మెటా ముదులి, మృతి చెం దిన యువకుడు పరశురాం ముదులి తండ్రి సన ముదులి తదితరులు పోలీసులను కలిసి వారి మరణంపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని పోలీసులను కోరారు. ఉభయ కటుంబాల వారు దగ్గరి బంధువులు. మరణించి వారిద్దరూ వరుస కు అన్నా చెల్లెళ్లు. అంతేకాకుండా వారి మధ్య ఎటువంటి వివాదాలుగాని, తగాదాలు, కుటుంబ కలహాలుగాని లేవని బంధువులు వెల్లడించారు. వారు ఆత్మహత్య చేసుకోలేదని భావిస్తున్నామన్నారు.
హత్యకు గురయ్యారేమో?
వారిని ఎవరో హత్య చేసి రైల్వేట్రాక్ పక్కన పడవేశారని బంధువులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సంఘటనా స్థలంలో బాలిక దగ్గర విరిగిన గాజులు పడి ఉన్నాయని, కొంత దూరంలో రక్తపు మరకలు ఉన్నాయని పోలీసులకు తెలియజేశారు. అలాగే యువకుడి గావంచా కూడా పడి ఉందని తెలిపారు. సంఘటన జరిగిన రోజున ధనమతి, పరశురాంలు గ్రామంలో ఒక మహిళతో కలిసి కెనాల్ రోడ్డులో వెళ్లారని అందుచేత ఈ సంఘటనపై ఆ మహిళకు తెలిసి ఉండవచ్చని మృతుల కుటుంబ సభ్యులు, గ్రామవాసులు అభిప్రాయ పడుతున్నారు. మొదట అందరూ వారిని ప్రేమికులుగా అనుమానించారు. తరువాత వారి దగ్గర బంధువులు అన్నాచెల్లెళ్లు అని తెలిపారు. అయితే వీరిద్దరి మరణానికి గల పూర్తి కారణాలు తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment