‘త్రీ’మన్ షో | khammam joint collector taken charges to two more positions | Sakshi
Sakshi News home page

‘త్రీ’మన్ షో

Published Sun, Oct 30 2016 3:09 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 PM

khammam joint collector taken charges to two more positions

ఫుల్‌చార్జ్‌: ఖమ్మం జాయింట్‌ కలెక్టర్‌ 
ఇన్ చార్జ్‌ : కల్లూరు, ఖమ్మం రెవెన్యూ డివిజన్లు
 
 
సత్తుపల్లి : జాయింట్‌ కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి త్రిపాత్రాభినయం చేస్తున్నారు. జేసీగా కొనసాగుతూనే ఖమ్మం, కల్లూరు డివిజన్లకు ఇన్చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఖమ్మం జిల్లా పరిధి రెండు రెవెన్యూ డివిజన్లకు పరిమితమైంది. ఖమ్మం డివిజన్ కు తోడుగా కొత్తగా కల్లూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. ఖమ్మం ఆర్డీఓగా పనిచేస్తున్న టి.వినయ్‌కృష్ణారెడ్డికి ప్రభుత్వం ఖమ్మం జాయింట్‌ కలెక్టర్‌గా ఉద్యోగోన్నతి ఇచ్చింది. ఇదే క్రమంలో కొత్తగా ఏర్పడిన కల్లూరుకు ఆర్డీఓను నియమించకపోగా, ఖమ్మం ఆర్డీఓ పోస్టును కూడా భర్తీ చేయలేదు. దీంతో వినయ్‌కృష్ణారెడ్డి ప్రస్తుతం ఈ రెండింటి బాధ్యతలు అదనంగా చూస్తున్నారు.  
 
పది నుంచి ఆరు మండలాలకు... 
కల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, ఏన్కూరు మండలాలు ఉన్నాయి. పైన పేర్కొన్న మండలాలతోపాటు మధిర, ఎర్రుపాలెం, వైరా, జూలూరుపాడు మండ లాలను కలిపి పది మండలాలతో  వైరా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు  ప్రభుత్వం డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. వైరా రెవెన్యూ డివిజన్ పై పెద్ద ఎత్తున  అభ్యంతరాలు వ్యక్తం కావటం తో డివిజన్ కేంద్రం కల్లూరుకు మారింది. మధిర, ఎర్రుపాలెం మండలాలు కల్లూరు కు  దూరం అవుతాయని అక్కడ ఆందోళనలు జరిగాయి. వైరాలోనూ రెవెన్యూ డివిజన్ కొనసాగించాలని నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో మధిర, ఎర్రుపాలెం, వైరా మండలాలను ఖమ్మం రెవె న్యూ డివిజన్ లో కలిపారు. జూలూరుపా డు మండలం భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో ఆ జిల్లాలో  కలపాలని ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో జూలూరుపాడును భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలిపారు.  దసరా పర్వదినాన కల్లూరు రెవెన్యూ డివిజన్ కా ర్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. 
 
స్టాఫ్‌ ఫుల్‌..  
కల్లూరు రెవెన్యూ డివిజన్ లో డివిజనల్‌ పరిపాలనాధికారి(డీఏఓ), నలుగురు సీనియర్‌ అసిస్టెంట్లు, నలుగురు జూనియర్‌ అసిస్టెంట్లు, ఇద్దరు నాయబ్‌ తహసీల్దార్లు, డిప్యూటీ ఇన్స్ స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్, డిప్యూటీ స్టాటికల్‌ ఆఫీసర్‌(డీఎస్‌ఓ), ఇద్దరు ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులు భర్తీ చేశారు. ఐదు సెక్షన్లు ఉన్నాయి. కల్లూరు ఆర్డీఓ పరిధిలోని ఆరు మం డలాల్లో 104 రెవెన్యూ గ్రామాలకుగాను 3,29,882మంది జనాభా ఉన్నారు. క ల్లూరు తహసీల్దార్‌ కార్యాలయంలో తా త్కాలికంగా ఆర్డీఓ కార్యాలయాన్ని ఏర్పా టు చేశారు. ఇందులో ఉన్న తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఎంపీడీఓ కార్యాలయం పక్కనే ఉన్న నియోజకవర్గ స్థాయి రైతుశిక్షణ కేంద్రంలోకి మార్చారు. ఫుల్‌టైం ఆర్డీఓ లేకపోవటంతో నూతనంగా ఏర్పడిన కల్లూరు రెవెన్యూ డివిజన్ లో పరిపాలనాపరంగా ఇంకా మార్పులు, చేర్పులు కనిపించటం లేదు.  
 
18 నుంచి 15 మండలాలకు తగ్గిన ఖమ్మం డివిజన్
జిల్లాల పునర్విభజనకు ముందు ఖమ్మం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఖమ్మం అర్బ న్, కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్, మధిర, ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని, ముదిగొండ, వైరా, కొణిజర్ల, ఏన్కూరు, తల్లా డ, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు, సత్తుపల్లి మండలాలు ఉండేవి. జిల్లాల పునర్వి భజన, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో కల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోకి ఆరు మండలాలు వెళ్లాయి. కొత్తగూడెం రెవెన్యూ డివిజన్ నుంచి కారేపల్లి, కామేపల్లి మండలాలు వచ్చి చేరగా, కొత్తగా రఘునాథపాలెం రెవెన్యూ మం డలంగా ఆవిర్భవించింది.దీంతో డివిజన్ పరిధి 15 మండలాలకు పరిమితమైంది.   
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement