districts bifurcation
-
Karimnagar: పనిభారంతో పరిపాలన అస్తవ్యస్తం
‘పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల విభజన చేశామని, ప్రజాసమస్యలు వెనువెంటనే పరిష్కారమవుతాయని, ఎలాంటి అర్జీలకైన సత్వరమే స్పందించి జవాబుదారీతనం పాటించేలా పాలన ఉంటుందని చెప్పిన పాలకుల మాటలు నీటిమూటలవుతున్నాయి. జిల్లాల విభజన జరిగి ఏళ్లు గడుస్తున్నా కీలకమైన శాఖలకు అధికారులు లేకపోవడంతో పరిపాలన అస్తవ్యస్తంగా మారుతోంది. ప్రజలు తమ అర్జీలతో జిల్లా కలెక్టరేట్లో ప్రతీ సోమవారం జరిగే ప్రజావాణికి వెల్లువలా రావడం, పోవడం వంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎవరిని కదలించినా సమస్యకు పరిష్కారం దొరకడం లేదన్న మాటలే వినిపిస్తున్నాయి’. కరీంనగర్: జిల్లాలో ఇన్చార్జీల పాలనే కొనసాగుతోంది. వివిధ శాఖలకు పూర్తిస్థాయి జిల్లా అధికారులు లేరు. మరోవైపు ఒక్కో అధికారికి అదనంగా మరో శాఖ బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ పనిచేసే వారికి ఇతర జిల్లాల బాధ్యతలు ఇచ్చారు. సంబంధిత అధికారి ఏ వారం ఎక్కడ ఉంటారో తెలియని దుస్థితి నెలకొంది. జిల్లా కార్యాలయాల్లో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న ఆరోపణలున్నాయి. ఏళ్లుగా డెప్యూటేషన్లపై ఒకేచోట.. జిల్లాల పునర్విభజన తర్వాత కార్యాలయాల్లో పూర్తిస్థాయి ఉద్యోగులను నియమించకపోవడంతో డెప్యూటేషన్లపై ఏళ్లుగా ఒకేచోట కొనసాగుతున్నారు. 15 మంది వరకు జిల్లా విద్యాశాఖ, ఎంఈవో కార్యాలయాల్లో, కొందరు ఉపాధ్యాయులు అనధికారికంగా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. రెవెన్యూ, వైద్యశాఖల్లో 20 నుంచి 30 మంది ఇలాగే ఉన్నారు. వైద్యశాలల్లో సిబ్బందిపై పర్యవేక్షణ కొరవడింది. ఇన్చార్జీల చేతుల్లో కీలక శాఖలు ► జిల్లాలో రెవెన్యూ వ్యవస్థను పర్యవేక్షించాల్సిన డీఆర్వో పోస్టులో రెండేళ్లుగా అదనపు కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. ► జిల్లాలోని 16 మండలాల్లో ఎంఈవో ఖాళీ పోస్టులు వెక్కిరిస్తున్నాయి. రెండు ఉప విద్యాధికారి పోస్టులు సైతం ఖాళీగానే ఉన్నాయి. ► జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా ఇన్చార్జి అధికారిగానే వ్యవహరిస్తున్నారు. ► కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు వైద్య సేవలందిస్తున్న కరీంనగర్ ప్రధానాస్పత్రిలో సూపరింటెండెంట్ పోస్టు కొన్నేళ్లు ఖాళీగా ఉంది. దీంతో అదేశాఖలో పనిచేస్తున్న రత్నమాలకు సూపరింటెండెంట్‌గా బాధ్యతలు అప్పగించారు. ► మెడికల్ షాపులను పర్యవేక్షించాల్సిన డ్రగ్ ఇన్స్పెక్టర్ కిరణ్ పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ► గనులు, భూగర్భ గనుల శాఖకు సంబంధించి ఏడీగా వ్యవహరిస్తున్న సత్యనారాయణకు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల అదనపు బాధ్యతలు ఉన్నాయి. ఇదే శాఖలో అసిస్టెంట్ జువాలజీ(ఏజీ)గా ఉన్న రవిబాబు కరీంనగర్, ములుగు జిల్లాల ఇన్చార్జిగా ఉన్నారు. ► తూనికలు కొలతల శాఖ జిల్లా అధికారి రవీందర్ జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదే శాఖలో రెండు ఇన్స్పెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ► జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజమనోహర్‌రావు ఎనిమిదేళ్లుగా ఇన్చార్జి అధికారిగానే పనిచేస్తున్నారు. ► మార్కెటింగ్ శాఖ ఏడీ పద్మావతి కొన్ని నెలలు సెలవులో వెళ్లడంతో అదే శాఖలో పనిచేస్తున్న పెద్దపల్లి జిల్లా అధికారికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ► కరీంనగర్ అగ్రికల్చర్ ఏడీ పోస్టు కొన్నేళ్లుగా ఖాళీగా ఉంది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ► కార్మిక శాఖ అధికారి రమేశ్‌బాబు గత 3 నెలలుగా సెలవులో ఉండటంతో సంగారెడ్డి జిల్లా కార్మికశాఖ అధికారి రవీందర్‌రెడ్డిని ఇన్చార్జిగా నియమించారు. ► జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ తార్యనాయక్ నిజామాబాద్, నిర్మల్ జిల్లాల ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదే శాఖలో మరో రెండు ఇన్స్పెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ► మహిళా శిశు సంక్షేమ శాఖ ఇన్చార్జి అధికారిగా సబితకుమారి పని చేస్తున్నారు. ► ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు గంగారాం, మధుసూదన్‌లకు ఉమ్మడి జిల్లా పరిధిలోని పరిపాలన వ్యవహారాలు చూడాల్సి రావడం, అదనపు బాధ్యతలతో ఆ శాఖలపై పూర్తి పట్టు సాధించలేక పోతున్నారన్న విమర్శలున్నాయి. -
అన్నమయ్య జిల్లాపై పచ్చ పాలిట్రిక్స్
టీడీపీ నాయకులు ఆ పార్టీ అధినేత కంటే రెండాకులు ఎక్కువే చదివినట్టున్నారు. ఆయన రెండు కళ్ల సిద్ధాంతంతో ప్రసిద్ధి చెందితే వీరు ప్రాంతానికో పాత్ర వేస్తూ రాద్ధాంతం చేస్తున్నారు. అక్కడో మాట.. ఇక్కడో మాట.. పూటకో మాట.. మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ఏర్పాటుపై పాలి‘ట్రిక్స్’ చేస్తున్నారు. వీరి వ్యవహారం ఇపుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మదనపల్లె కేంద్రంగా జిల్లా కావాలని, రాజంపేట కేంద్రంగా ఉండాలని, రాయచోటి ఎంపిక సరైనదంటూ ఆయా ప్రాంతాల్లో పాలిట్రిక్స్ చేస్తున్నారు. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాల్సిన ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. రాజంపేట: అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన సౌలభ్యత.. భౌగోళిక పరిస్ధితులు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే అజెండాగా ప్రభుత్వం కొత్త జిల్లాలను ప్రకటించింది. అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉండేలా శాస్త్రీయ అధ్యయనాలతో పునర్విభజన ప్రక్రియ చేపట్టింది. ఈ క్రమంలో రాజంపేట లోక్‌సభ పరిధిలో రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు, పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లె అసెంబ్లీ సెగ్మెంట్లతో పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల పేరిట జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లా విషయంలో టీడీపీ నేతలు మాత్రం తమదైన శైలిలో విషం కక్కుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ప్రజలను రెచ్చగొట్టేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ఎవరెవరు..ఎలా రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ప్రకటనపై రాజంపేట పార్లమెంటరీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి తదితర నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రభుత్వ ప్రకటనపై హర్షం వ్యక్తంచేస్తున్నారు. రాజంపేట, రైల్వేకోడూరులో రాజంపేట కేంద్రంగా ప్రకటించాలని రాజంపేట టీడీపీ ఇన్చార్జి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు అండ్ కో ఉద్యమం ముసుగేసుకొని రాజకీయచలి కాచుకుంటున్నారనే విమర్శలున్నాయి. అలాగే మదనపల్లెలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ నానాయాగీ చేస్తున్నారు. మరోవైపు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి కూడా జిల్లాల పునర్విభజనపై టీడీపీ ట్రిపుల్ యాక్షన్ ఎపిసోడ్లో తనవంతు పాత్ర పోషిస్తున్నారు. ఒక నిర్ణయమంటూ లేకుండా, స్పష్టమైన వైఖరిని ప్రదర్శించకుండా ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా వీరు వ్యవహరించడం సరికాదని పలువురు మండిపడుతున్నారు. ఒక్కో చోట.. ఒక్కో మాట.. రాజకీయ పార్టీలు కీలక విషయాలకు సంబంధించి ఒక స్టాండ్ తీసుకుంటారు. ఆ పార్టీ నిర్ణయం మేరకు శ్రేణులు కట్టుబడతాయి. కానీ చంద్రబాబు సంగతి అలా కాదు. ఆయన ఒకే విషయంపై పలు రకాలుగా స్టాండ్ తీసుకుంటారు. రాజకీయలబ్ధి కోసం ఎలాంటి ప్రకటనలకైనా తెగబడిపోతారు. బాబుస్ఫూర్తితో ఆయనను మించి టీడీపీ నేతలు ప్రాంతానికి తగ్గట్టు స్వరాలను మారుస్తున్నారు. ప్రజలను గందరగోళానికి గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మదనపల్లెలో జిల్లా కేంద్రం ఉండాలని అక్కడి తెలుగుదేశం నేతలు, రాజంపేటను కేంద్రంగా చేయాలని ఇక్కడి టీడీపీ శ్రేణులు నానా యాగీచేస్తున్నారు. రాయచోటిలో మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రకటనలు చేయడమే కాకుండా సంబరాలు జరుపుకుంటున్నారు. వీరి తీరును పలువురు విమర్శిస్తున్నారు. ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా వ్యవవహరిస్తున్నారని మండిపడుతున్నారు. టీడీపీ వైఖరి స్పష్టంచేయాలి అన్నమయ్య జిల్లా విషయంలో టీడీపీ వైఖరి స్పష్టం చేయాలి. ఆ నేతల తీరు అనుమానంగా ఉంది. ఒక పక్క రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని కోరుతున్నారు. మరోపక్క మదనపల్లెలోనూ అదే పాట పాడుతున్నారు. ఇంకోపక్క రాయచోటిలో ఆపార్టీ వారే కృతజ్ఞతలను తెలుపుతున్నారు. రాజకీయపార్టీలు స్పష్టమైన వైఖరి లేకుండా మాట్లాడటం సరైన విధానం కాదు. –మేడా విజయశేఖర్‌రెడ్డి, జేఏసీ నాయకుడు, రాజంపేట ఒకే నిర్ణయానికి కట్టుబడాలి ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా కాకుండా అన్నమయ్య జిల్లాపై టీడీపీ స్పష్టమైన వైఖరి తెలపాలి. రాజకీయపార్టీల నాయకులు ఒకే నిర్ణయానికి కట్టుబడాలి. మూడు ప్రాంతాల్లో మూడు రకాలుగా ట్రిపుల్ యాక్షన్ చేస్తున్న టీడీపీ తీరును ప్రజలు గుర్తించాలి. –దాసరి చిదానందగౌడ్, రాష్ట్రబీసీ సంక్షేమసంఘం నేత, రాజంపేట -
‘నిర్లక్ష్యంపై చర్యలు తప్పవు’
చేవెళ్ల: పాలనా సౌలభ్యం కోసమే సీఎం కేసీఆర్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టారని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం ఆయన చేవెళ్ల మండల సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సమావేశానికి హాజరు కాని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుమునుపు ఆయన చేవెళ్లలో ఏసీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘త్రీ’మన్ షో
ఫుల్‌చార్జ్: ఖమ్మం జాయింట్ కలెక్టర్ ఇన్ చార్జ్ : కల్లూరు, ఖమ్మం రెవెన్యూ డివిజన్లు సత్తుపల్లి : జాయింట్ కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి త్రిపాత్రాభినయం చేస్తున్నారు. జేసీగా కొనసాగుతూనే ఖమ్మం, కల్లూరు డివిజన్లకు ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఖమ్మం జిల్లా పరిధి రెండు రెవెన్యూ డివిజన్లకు పరిమితమైంది. ఖమ్మం డివిజన్ కు తోడుగా కొత్తగా కల్లూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. ఖమ్మం ఆర్డీఓగా పనిచేస్తున్న టి.వినయ్‌కృష్ణారెడ్డికి ప్రభుత్వం ఖమ్మం జాయింట్ కలెక్టర్‌గా ఉద్యోగోన్నతి ఇచ్చింది. ఇదే క్రమంలో కొత్తగా ఏర్పడిన కల్లూరుకు ఆర్డీఓను నియమించకపోగా, ఖమ్మం ఆర్డీఓ పోస్టును కూడా భర్తీ చేయలేదు. దీంతో వినయ్‌కృష్ణారెడ్డి ప్రస్తుతం ఈ రెండింటి బాధ్యతలు అదనంగా చూస్తున్నారు. పది నుంచి ఆరు మండలాలకు... కల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, ఏన్కూరు మండలాలు ఉన్నాయి. పైన పేర్కొన్న మండలాలతోపాటు మధిర, ఎర్రుపాలెం, వైరా, జూలూరుపాడు మండ లాలను కలిపి పది మండలాలతో వైరా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వైరా రెవెన్యూ డివిజన్ పై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం కావటం తో డివిజన్ కేంద్రం కల్లూరుకు మారింది. మధిర, ఎర్రుపాలెం మండలాలు కల్లూరు కు దూరం అవుతాయని అక్కడ ఆందోళనలు జరిగాయి. వైరాలోనూ రెవెన్యూ డివిజన్ కొనసాగించాలని నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో మధిర, ఎర్రుపాలెం, వైరా మండలాలను ఖమ్మం రెవె న్యూ డివిజన్ లో కలిపారు. జూలూరుపా డు మండలం భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో ఆ జిల్లాలో కలపాలని ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో జూలూరుపాడును భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలిపారు. దసరా పర్వదినాన కల్లూరు రెవెన్యూ డివిజన్ కా ర్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. స్టాఫ్ ఫుల్.. కల్లూరు రెవెన్యూ డివిజన్ లో డివిజనల్ పరిపాలనాధికారి(డీఏఓ), నలుగురు సీనియర్ అసిస్టెంట్లు, నలుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు నాయబ్ తహసీల్దార్లు, డిప్యూటీ ఇన్స్ స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్, డిప్యూటీ స్టాటికల్ ఆఫీసర్(డీఎస్ఓ), ఇద్దరు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు భర్తీ చేశారు. ఐదు సెక్షన్లు ఉన్నాయి. కల్లూరు ఆర్డీఓ పరిధిలోని ఆరు మం డలాల్లో 104 రెవెన్యూ గ్రామాలకుగాను 3,29,882మంది జనాభా ఉన్నారు. క ల్లూరు తహసీల్దార్ కార్యాలయంలో తా త్కాలికంగా ఆర్డీఓ కార్యాలయాన్ని ఏర్పా టు చేశారు. ఇందులో ఉన్న తహసీల్దార్ కార్యాలయాన్ని ఎంపీడీఓ కార్యాలయం పక్కనే ఉన్న నియోజకవర్గ స్థాయి రైతుశిక్షణ కేంద్రంలోకి మార్చారు. ఫుల్‌టైం ఆర్డీఓ లేకపోవటంతో నూతనంగా ఏర్పడిన కల్లూరు రెవెన్యూ డివిజన్ లో పరిపాలనాపరంగా ఇంకా మార్పులు, చేర్పులు కనిపించటం లేదు. 18 నుంచి 15 మండలాలకు తగ్గిన ఖమ్మం డివిజన్ జిల్లాల పునర్విభజనకు ముందు ఖమ్మం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఖమ్మం అర్బ న్, కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్, మధిర, ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని, ముదిగొండ, వైరా, కొణిజర్ల, ఏన్కూరు, తల్లా డ, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు, సత్తుపల్లి మండలాలు ఉండేవి. జిల్లాల పునర్వి భజన, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో కల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోకి ఆరు మండలాలు వెళ్లాయి. కొత్తగూడెం రెవెన్యూ డివిజన్ నుంచి కారేపల్లి, కామేపల్లి మండలాలు వచ్చి చేరగా, కొత్తగా రఘునాథపాలెం రెవెన్యూ మం డలంగా ఆవిర్భవించింది.దీంతో డివిజన్ పరిధి 15 మండలాలకు పరిమితమైంది. -
ఖమ్మం కీలకం..
పునర్విభజన నేపథ్యంలో... అభివృద్ధిలో నగరానిదే కీలక పాత్ర వాణిజ్యపరంగా మరింత పురోగతి మున్ముందుకు వ్యవసాయరంగం సాగర్ కాలువ.. రెండు రిజర్వాయర్లు.. వ్యవసాయ రంగం.. గ్రానైట్ పరిశ్రమలు.. విస్తరిస్తున్న రియల్ఎస్టేట్, వస్త్ర వ్యాపారం.. ఇలా దినదినం ప్రవర్థమానంగా వెలుగొందుతోంది. పునర్విభజన తర్వాత ఖమ్మం జిల్లా పురోభివృద్ధిలో కీలకంగా మారనుంది.. వ్యాపారాల కోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి బతుకునిస్తోంది.. జిల్లా అభివృద్ధికి నగరమే ఆయువుపట్టు కానుంది. ఖమ్మం: ఖమ్మం జిల్లాకు స్తంభాద్రి కీలకం కానుంది. పునర్విభజన తర్వాత ఐదు నియోజకవర్గాలకే పరిమితమైన జిల్లాకు ఖమ్మం దిక్సూచి కానుంది. ఒకప్పుడు గ్రానైట్‌కు మారుపేరుగా ఉన్న జిల్లా.. కొన్ని ఆటుపోట్ల మధ్య పరిశ్రమలు కాస్త దివాళా తీశాయి. సాగర్ ఎడమ కాలువ, పాలేరు రిజర్వాయర్, వైరా రిజర్వాయర్ ఉండటం వల్ల జిల్లాలో ఆయకట్టు పెరిగింది. ఈ నేపథ్యంలో ఖమ్మం వాణిజ్య నగరంగా మరింత పురోగతి సాధిస్తుండగా.. వ్యవసాయమే ప్రధానం కానుంది. 4,374 చ.కి.మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న జిల్లాలో ఎక్కువ శాతం సాగుతోనే ముందుకు సాగనుంది. ఇదీ ఖమ్మం చరిత్ర.. ఖమ్మం కార్పొరేషన్ ను పూర్వం ఖమ్మం మెట్టుగా వ్యవహరించేవారు. దీని సరైన పేరు కంబం మెట్టు.. సంస్కృతంలో స్తంభాచలం అనే పేరుతో ‘హరిభట్టు’ అనే సంస్కృత కవి ఉదహరించినట్లు చెబుతారు. దీనికే ‘స్తంభగిరి’, ‘స్తంభాద్రి’ అనే పేర్లు కూడా ఉండేవి. ఈశ్యానం దిక్కున ఉన్న గుట్టపై ఈ గ్రామ ప్రజల ఆరాధ్య దైవం స్తంభాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఉంటుంది. అలాగే 1530లో హరిభట్టు రాసిన వరహాపురాణంలో ఖమ్మం నగర ప్రాముఖ్యతను వివరించినట్లు ఆధారాలు ఉన్నాయి. కాకతీయ రాజులు– వేంగి చాళుక్యులకు సామంతులుగా ఉన్న రోజుల్లో క్రీస్తు శకం 934 నుంచి 945 మధ్య కాలంలో కాకర్త్యగుండనార్యుడు, బేతరాజు ఈ ప్రాంతాన్ని పాలించినట్లు చరిత్ర చెబుతోంది. నిజాం రాష్ట్రంలో ఉన్న ఖమ్మం.. వరంగల్ జిల్లాలో ఒక తాలూకాగా ఉండేది. ఖమ్మం తహసీల్‌కు 1761 నుంచి 1803 వరకు జఫరద్దౌలా తహసీల్దార్‌గా ఉండేవారు. ఆ తర్వాత 1953, నవంబర్ 1న ఖమ్మం పట్టణం జిల్లా కేంద్రంగా ప్రత్యేక జిల్లాగా ఆవిర్భవించింది. ఇలా వెయ్యేâýæ్లకుపైగా చరిత్ర కలిగిన నగరం విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, తెలంగాణ, ఆంధ్రా మాండలికాల కలగలుపుగా.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వారధిగా.. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థా¯ŒS, గుజరాత్ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమూహంగా వెలుగొందుతోంది. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా.. 1942, ఏప్రిల్ ఒకటిన స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఏర్పడిన ఖమ్మం.. 1952లో గ్రేడ్–3 మున్సిపాలిటీగా మారింది. 1959లో గ్రేడ్–2 మున్సిపాలిటీగా అవతరించింది. పట్టణ జనాభా పెరుగుతుండటంతో 1980లో గ్రేడ్ –1 మున్సిపాలిటీగా మార్చారు. తర్వాత 2005, మే 2001న స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా నగరం ఆవిర్భవించింది. రెండు దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రంలో వేగవంతంగా ఖమ్మం మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుండటంతో 2012, అక్టోబర్ 19న కార్పొరేషన్ గా అప్‌గ్రేడ్ చేస్తూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రూ.1,200కోట్లకు చేరిన మార్కెట్ టర్నోవర్.. జిల్లాలో వ్యవసాయ రంగం కీలకం కావడంతో నగరంలోని వ్యవసాయ మార్కెట్ దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం రూ.1,200కోట్ల టర్నోవర్‌తో రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉన్న మార్కెట్లలో ఒకటిగా నిలిచింది. ప్రధానంగా పత్తి, మిర్చి, వరి పంటలు ఇక్కడ అత్యధికంగా విక్రయిస్తారు. మరోవైపు నగరం విస్తృతం కావడంతో వాణిజ్య పరంగా కార్పొరేట్ సంస్థలు సైతం ఖమ్మం వైపు మొగ్గుచూపుతున్నాయి. ఇప్పటికే అనేక షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయగా.. మరికొన్ని కార్పొరేట్ షాపింగ్ మాల్స్ ఖమ్మం వైపు వచ్చే అవకాశం ఉంది. నగర పరిసర ప్రాంతాల్లో జిల్లా పునర్విభజన నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగం కొద్దిగా వెనుకంజ వేసినప్పటికీ.. నగర అభివృద్ధి నేపథ్యంలో అది తిరిగి పుంజుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని వ్యాపార విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏదేమైనా ఖమ్మం జిల్లాకు నగరం ప్రస్తుతం కీలకంగా మారింది. విస్తీర్ణం : 93 చ.కి.మీ. జనాభా : 3,56,000 గృహాల సంఖ్య : 98,548 డివిజన్లు : 50 -
విద్యాశాఖ స్వరూపం ఇదీ..
జిల్లాలో 1392 పాఠశాలలు 1,36,231 మంది విద్యార్థులు 3034 మంది ఉపాధ్యాయులు 424 ఉపాధ్యాయ ఖాళీలు ఆదిలాబాద్ టౌన్: జిల్లా పునర్విభజనతో విద్యాశాఖలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు జిల్లా వ్యాప్తంగా నాలుగు వేల ప్రభుత్వ పాఠశాలలు ఉండేవి. ఇందులో 4,69,760 మంది విద్యార్థులు విద్యను అభ్యసించేవారు. దాదాపు 13 వేల మంది ఉపాధ్యాయులు పని చేసేవారు. 52 మండలాలల్లో కేజీబీవీలు ఉండేవి. పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం ఆర్వీఎం ప్రత్యేకంగా ఉండేది. విభజన తర్వాత ఆర్వీఎంను విద్య శాఖలో విలీనం చేశారు. ఇక్కడ పనిచేసే సెక్టోరియల్ అధికారులను కొత్తగా ఏర్పాౖటెన మూడు జిల్లాలకు బదిలీ చేశారు. ఇదివరకు జిల్లాలో పనిచేసిన డీఈఓ సత్యనారాయణ రెడ్డి రంగారెడ్డి జిల్లాకు బదిలీపై వెళ్లారు. నిజామాబాద్ జిల్లాలో పనిచేసిన డీఈఓ కె.లింగయ్య ఆదిలాబాద్‌కు వచ్చిన విషయం విధితమే. వివరాలు.. డీఈవో కె.లింగయ్య ఉప విద్యాధికారి శ్యామ్‌రావు ఎంఈవోలు 18 జిల్లాలో మొత్తం పాఠశాలలు 1392 ప్రాథమిక పాఠశాలలు 984 యూపీఎస్ 173 ఉన్నత పాఠశాలలు 228 మోడల్ స్కూళ్లు 04 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు 42 జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలలు 635 విద్యార్థుల సంఖ్య 1,36,231 బాలురు 69,301 బాలికలు 66,934 ఎయిడెడ్ పాఠశాలలు 02 మదర్సాలు 17 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు 01 కేంద్రీయ విద్యాలయం 01 ఆశ్రమ పాఠశాలలు 46 ప్రైవేట్ పాఠశాలలు 126 కేజీబీవీలు 13 ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల సంఖ్య 37,319 జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు 3,034 ఉపాధ్యాయ ఖాళీలు 424 -
పాలన.. గాడిన
ప్రజల్లో తొలగుతున్న గందరగోళం ప్రభుత్వశాఖలపై పెరిగిన అవగాహన వీడియో కాన్ఫరెన్స్‌లతో కలెక్టర్ల బిజీబిజీ క్రైం మీటింగ్‌లతో పోలీస్ కమిషనర్... రెండోరోజు ‘కొత్త’ అధికారులు బిజీబీజీ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై దృష్టి సాక్షి, కరీంనగర్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా పలు ప్రభుత్వ శాఖల విలీనం, పాలన వ్యవస్థ తీరు తెన్నులపై ప్రజల్లో నెలకొన్న గందరగోళం ఇప్పుడిప్పుడే తొలగిపోతోంది. ప్రభుత్వ శాఖల విలీనం, పునర్విభజనపై అవగాహన పెరుగుతోంది. ఇప్పటివరకు విడివిడిగా ఉన్న జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా), ఇంది కాంత్రి పథం (ఐకేపీ), జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ఇప్పుడు ఒకే గొడుగు కిందకు వచ్చి డీఆర్‌డీఏగా అవతరించింది. అంతకు ముందున్న ప్రాజెక్టు డెరైక్టర్ (పీడీ) పోస్టును రద్దు చేసి ఇప్పుడు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీవో)గా నామకరణం చేశారు. స మాచారం పౌర సంబంధాల శాఖలో పర్యాటక, పురావస్తు, సాంస్కృతిక శాఖలను విలీనం చేయగా, ఇంతకు ముందు ఆ బాధ్యతలను చూసే డివిజనల్ పబ్లిక్ రిలేషన్ అఫీసర్ (డీపీఆర్వో) తప్పించారు. ఇప్పుడా బాధ్యతలను డిప్యూటీ డైరక్టర్(డీడీ) స్థాయి అధికారికి అప్పగించారు. కరీంనగర్‌కు ఈ పోస్టును కేటాయించి, త్వరలోనే డీడీని నియమించనున్నారు. అదేవిధంగా ఐసీడీఎస్ శాఖలోకి వికలాంగుల సంక్షేమశాఖ ను విలీనం చేశారు. వికలాంగ, వయోవృద్ధుల, శిశు మహిళాభివృద్ధి శాఖగా ఏర్పడగా, ఇదివరకున్న పీడీ పోస్టు స్థానంలో జిల్లా సంక్షేమాధికారిని నియమించారు. పౌరసరఫరాల శాఖలోను డీఎస్వో హోదాను పెంచి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి (డీసీఎస్)గా చేశారు. ఇలా వాణి జ్య పన్నులు, ఇంటర్మీడియెట్ విద్య, బీసీ సంక్షే మ, పశుసంవర్ధక, గిరిజన సంక్షేమం, అటవీ, పోలీసుశాఖల్లోను జరిగిన స్వల్ప, భారీ మార్పులపై నెలకొన్న గందరగోళం నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు. అభివృద్ధి పథం, ఆశల సౌధం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లాల పునర్విభజన అనంతరం అభివృద్ధి, సంక్షేమ లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత, ఆ జిల్లాలతో పాటు మిగిలిన జిల్లాల్లోను ఏ విధమైన అభివృద్ధి చేయవచ్చన్న దిశలో అధికార యంత్రాంగం అడుగులు వేస్తోం ది. ‘పునర్విభజన’లో జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి కొత్తగా ఏర్పడిన తర్వాత మిగిలిన కరీంనగర్ జిల్లా అభివృద్ధిపై అధికార యంత్రాంగం ప్రధానంగా దృష్టి సారించింది. జిల్లాల పున ర్వి భజన అనంతరం జిల్లా కలెక్టర్‌గా సర్ఫరాజ్ అహ్మద్, జాయింట్ కలెక్టర్‌గా బద్రి శ్రీనివాస్, కొత్తగా ఏర్పడిన పోలీసు కమిషనరేట్‌కు కమిషనర్‌గా వీబీ.కమలాసన్‌రెడ్డి ఈ నెల 11న బాధ్యతలు చేపట్టారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా టీమ్‌గా డీఆర్డీవో వెంకటేశ్వర్రావు, ఐసీడీఎస్ పీడీ గిరిజారాణి , వ్యవసాయాధికారి(డీఏవో) సీహెచ్.తేజోవతి, మెప్మా పీడీ వెంకటేశ్వర్లు, డీపీవో నారాయణ, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మాధవరావు, జిల్లా వైద్య ఆర్యోగశాఖాధికారి రాజేశం, డీఈవో పెగుడ రాజీవ్, డీఐఈవో ఎల్.సుహాసిని తదితర శాఖల జిల్లా ఉన్నతాధికారులు అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా ముందు కు సాగుతున్నారు. జిల్లాలోని పర్యాటక, పారిశ్రామిక ప్రాంతాలను గుర్తించే పనిలో నిమగ్నమైన యంత్రాంగం.. ఆ రంగాలపైనా నివేదికలు తయారు చేస్తోంది. ఖనిజ సంపద పరిరక్షణ, వినియోగం ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంపుపైనా దృష్టి సారించారు. ప్రభుత్వం ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి అందరి లక్ష్యంగా ముందుకెళ్తుండటంలో యంత్రాంగం బిజీబిజీగా ఉన్నారు. జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. పథకాల అమలుపై అధికారులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్ ఇతర శాఖల అధికారులు పనుల్లో నిమగ్నం అయ్యారు. కరీంనగర్ పోలీసు కమిషనర్ వీబీ.కమలాసన్‌రెడ్డి నేర సమీక్ష, శాంత్రి భద్రతల పరిరక్షణ సమావేశాల్లో బిజీ బిజీగా ఉన్నారు. -
కొంగొత్త రాజకీయం
ఐదు జిల్లాలకు ప్రత్యేక కమిటీలు ముందుగానే నియమించిన సీపీఎం ఈ నెల 20లోపు ఏర్పాటుకు కాంగ్రెస్, బీజేపీ కసరత్తు అధికార పార్టీలో అయోమయం ఏప్రిల్ వరకు పాత కమిటీలే ! సాక్షి, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన రాజకీయ పార్టీలను అయోమయంలో పడేస్తోంది. రాజకీయ పార్టీల సంస్థాగత స్వరూపం ఎలా ఉండాలనే విషయంలో అన్ని పార్టీల్లో అస్పష్టత నెలకొంది. దసరా రోజు వరకు ఉన్న పరిస్థితికి ప్రస్తుత పరిస్థితికి పొంతన కుదరడం లేదు. ఇన్ని రోజులు గ్రేటర్ వరంగల్, వరంగల్ జిల్లా విభాగాలుగా ఉన్న రాజకీయ పార్టీల కమిటీలను ఎలా ఏర్పాటు చేయాలో తెలియక గందరగోళం నెలకొంది. ప్రధానంగా గ్రేటర్ వరంగల్ కమిటీ కొనసాగింపుపై అన్ని పార్టీలు ఆలోచన చేస్తున్నాయి. గ్రేటర్ వరంగల్ జిల్లా కమిటీలను వరంగల్ అర్బన్ జిల్లా కమిటీలుగా మార్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాయి. సీపీఎం అన్ని పార్టీల కంటే ముందుగానే జిల్లా కమిటీలను నియమించింది. వరంగల్ అర్బన్ జిల్లా కార్యదర్శిగా ఎస్.వాసుదేవరెడ్డి, వరంగల్ రూరల్ జిల్లా కార్యదర్శిగా ఎం.చుక్కయ్య, మహబూబాబాద్ జిల్లా కార్యదర్శిగా సాదుల శ్రీనివాస్, భూపాలపల్లి జిల్లా కార్యదర్శిగా సూడి కృష్ణారెడ్డి, జనగామ జిల్లా కార్యదర్శిగా యు.రవిలను నియమించింది. కాంగ్రెస్‌లో కొత్త జిల్లా కమిటీల నియామకం కోసం అక్టోబరు 20లోపు ప్రతిపాదనలు పంపాలని అన్ని జిల్లాల ప్రస్తుత డీసీసీలకు ఏఐసీసీ ఆదేశాలు ఇచ్చింది. వరంగల్ జిల్లాలో కొత్త కమిటీల కూర్పుపై కొంత సందిగ్ధత నెలకొంది. గ్రేటర్ వరంగల్ కమిటీని కొనసాగించాలా.. వద్దా.. అనే విషయంపై చర్చ జరుగుతోంది. డీసీసీ ప్రస్తుత అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఉంది. దీని కోసం ప్రస్తుత గ్రేటర్ వరంగల్ కమిటీని రద్దు చేసే ప్రతిపాదన ఉన్నట్లు తెలిసింది. మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి, జయశంకర్ జిల్లా అధ్యక్షుడిగా మల్లాడి రాంరెడ్డిని అధ్యక్షుడిగా నియమించనున్నట్లు తెలిసింది. జనగామ జిల్లా అధ్యక్షుడిగా చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి, వై.సుధాకర్‌లలో ఒకరు నియమితులయ్యే అవకాశం ఉంది. వరంగల్ రూరల్ జిల్లాకు ఇనుగాల వెంకట్రామిరెడ్డి, కొండేటి శ్రీధర్ పేర్లను పీసీసీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. డీసీసీ అధ్యక్షుల నియామకంపై శుక్రవారం హైదరాబాద్‌లో పీసీసీ స్థాయిలో సమావేశం జరగనుందని హస్తం పార్టీ వర్గాలు తెలిపారు. అధికార టీఆర్ఎస్ పార్టీ జిల్లాల వారీగా కమిటీల ఏర్పాటుపై కసరత్తు ఇంకా మొదలుపెట్టలేదు. టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ వచ్చే ఏప్రిల్‌లో జరగనుంది. దీంతోప్రస్తుత కమిటీలను వచ్చే ఏప్రిల్ వరకు కొనసాగిస్తారని తెలుస్తోంది. పరిపాలన మార్పులపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ ఇప్పట్లో టీఆర్ఎస్ కమిటీలను నియమించే అవకాశం లేదని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అన్ని రకాల నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన తర్వాతే టీఆర్ఎస్కు కొత్త జిల్లాల కమిటీలను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. గులాబీ పార్టీ అధిష్టానం త్వరలోనే జిల్లాలకు తాత్కాలిక కన్వీనర్లను నియమించే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. టీఆర్ఎస్కు ప్రస్తుతం వరంగల్, గ్రేటర్ వరంగల్ జిల్లా కమిటీలు ఉన్నారు. గ్రేటర్ వరంగల్ కమిటీని వరంగల్ అర్బన్ జిల్లా కమిటీగా మార్చే అవకాశం ఉంది. మిగిలిన నాలుగు జిల్లాల అధ్యక్ష పదవుల కోసం భారీగా పోటీ ఉండనుంది. భారతీయ జనతా పార్టీలో కొత్త జిల్లాల ప్రకారం కమిటీలు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్టోబరు 15, 16 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. వరంగల్ జిల్లా కార్యవర్గ సమావేశం సైతం ఈ తేదీల్లో జరగనుంది. ఈ సమావేశాల్లోనే కొత్త కమిటీల కూర్పుపై నిర్ణయం తీసుకోకున్నారు. బీజేపీలో ప్రస్తుతం వరంగల్, గ్రేటర్ వరంగల్ జిల్లాల కమిటీలు ఉన్నాయి. వరంగల్ జిల్లా కమిటీని వరంగల్ రూరల్ జిల్లా కమిటీగా మార్చనున్నారు. ప్రస్తుతం ఉన్న వరంగల్ కమిటీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యే అవకాశం ఉంది. గ్రేటర్ వరంగల్ కమిటీని వరంగల్ అర్బన్ కమిటీగా మార్చనున్నారు. గ్రేటర్ వరంగల్ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ పదవి కోసం గ్రేటర్‌లోని పలువురు నేతలు పోటీ పడుతున్నారు. జయశంకర్(భూపాలపల్లి) జిల్లా కమిటీ అధ్యక్ష పదవి రేసులో చందుపట్ల కీర్తి, నాగపురి రాజమౌళి పేర్లు వినిపిస్తున్నారుు. జనగామ జిల్లా అధ్యక్ష పదవి కోసం కె.వి.ఎల్.ఎన్.రెడ్డి, నెల్లుట్ల నర్సింహారావు పేర్లను పార్టీ అధిష్టానం పరిశీలించనుంది. మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా గాదె రాంబాబు, పెదగాని సోమయ్య పేర్లు వినిపిస్తున్నాయి. టీడీపీలో కొత్త జిల్లాల కమిటీల ప్రక్రియ ఇంకా మొదలుకాలేదు. సంస్థాగతంగా పార్టీ బలహీనం కావడంతో కొత్త కమిటీల నియామకంపై జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. సీపీఐ నిర్మాణ మహాసభ నవంబర్ 7, 8 తేదీల్లో తొర్రూరులో జరగనుంది. ఈ సమావేశాల్లో ఐదు జిల్లాల కమిటీలను నియమించనున్నారు. అనంతరం నవంబరు 28, 29, 30 తేదీల్లో వరంగల్‌లోనే రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. వైఎస్సార్ సీపీ కొత్త జిల్లాలకు పార్టీ కమిటీలపై దృష్టి పెట్టింది. త్వరలోనే జిల్లాలకు ప్రత్యేకంగా కమిటీలను నియమించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. -
అనారోగ్యశ్రీగా మారుస్తున్న సీఎం
వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి సాక్షి, హైదరాబాద్: పేదల పెన్నిధిగా ఉన్న ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ పథకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం మార్చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ ధ్వజమెత్తింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మానస పుత్రిక అయిన ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ పథకాన్ని ప్రారంభించి, 920 రుగ్మతలకు ఇందులో భాగంగా వైద్యసేవలు అందించిన ఘనత దివంగత నేత వైఎస్సార్‌దేనని పేర్కొంది. మంగళవారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... వైఎస్సార్ హయాంలో 2007లో మొదట మూడు జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రారంభించి, ఆ తర్వాత అన్ని జిల్లాలకు వర్తింపజేసి పకడ్బందీగా అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ సీఎం అయ్యాక బిల్లులను సకాలంలో చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలను ప్రైవేట్ ఆస్పత్రులు ఆరు సార్లు బంద్ చేశాయన్నారు. ఏటా బతుకమ్మ నిర్వహణకు నిధులు పెంచుతూ పోతున్న ప్రభుత్వం, ఆరోగ్యశ్రీ అంటే ఎందుకంత నిర్లక్ష్యం చూపుతున్నదో చెప్పాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల ఆరోగ్యశ్రీ బకాయిలను వెంటనే విడుదల చేసి, భవిష్యత్‌లో మళ్లీ ఈ సేవలు స్తంభించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.