విద్యాశాఖ స్వరూపం ఇదీ..
Published Mon, Oct 17 2016 11:39 AM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM
జిల్లాలో 1392 పాఠశాలలు
1,36,231 మంది విద్యార్థులు
3034 మంది ఉపాధ్యాయులు
424 ఉపాధ్యాయ ఖాళీలు
ఆదిలాబాద్ టౌన్: జిల్లా పునర్విభజనతో విద్యాశాఖలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు జిల్లా వ్యాప్తంగా నాలుగు వేల ప్రభుత్వ పాఠశాలలు ఉండేవి. ఇందులో 4,69,760 మంది విద్యార్థులు విద్యను అభ్యసించేవారు. దాదాపు 13 వేల మంది ఉపాధ్యాయులు పని చేసేవారు. 52 మండలాలల్లో కేజీబీవీలు ఉండేవి. పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం ఆర్వీఎం ప్రత్యేకంగా ఉండేది. విభజన తర్వాత ఆర్వీఎంను విద్య శాఖలో విలీనం చేశారు. ఇక్కడ పనిచేసే సెక్టోరియల్ అధికారులను కొత్తగా ఏర్పాౖటెన మూడు జిల్లాలకు బదిలీ చేశారు. ఇదివరకు జిల్లాలో పనిచేసిన డీఈఓ సత్యనారాయణ రెడ్డి రంగారెడ్డి జిల్లాకు బదిలీపై వెళ్లారు. నిజామాబాద్ జిల్లాలో పనిచేసిన డీఈఓ కె.లింగయ్య ఆదిలాబాద్‌కు వచ్చిన విషయం విధితమే.
వివరాలు..
డీఈవో కె.లింగయ్య
ఉప విద్యాధికారి శ్యామ్‌రావు
ఎంఈవోలు 18
జిల్లాలో మొత్తం పాఠశాలలు 1392
ప్రాథమిక పాఠశాలలు 984
యూపీఎస్ 173
ఉన్నత పాఠశాలలు 228
మోడల్ స్కూళ్లు 04
ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు 42
జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలలు 635
విద్యార్థుల సంఖ్య 1,36,231
బాలురు 69,301
బాలికలు 66,934
ఎయిడెడ్ పాఠశాలలు 02
మదర్సాలు 17
బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు 01
కేంద్రీయ విద్యాలయం 01
ఆశ్రమ పాఠశాలలు 46
ప్రైవేట్ పాఠశాలలు 126
కేజీబీవీలు 13
ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల సంఖ్య 37,319
జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు 3,034
ఉపాధ్యాయ ఖాళీలు 424
Advertisement
Advertisement