అధికార కేంద్రంగా రాజ్‌నివాస్
Published Sun, Feb 16 2014 11:09 PM | Last Updated on Sat, Sep 2 2017 3:46 AM
రాష్ట్రపతి పాలన నిర్ణయం నేపథ్యంలో రాజ్‌నివాస్‌లోనే ఇక అన్ని అధికారిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఏ నిర్ఱయం తీసుకోవాలన్నా సంబంధిత అధికారులు ఇకపై కచ్చితంగా రాజ్‌నివాస్‌కు వెళ్లాల్సిందే. మరోవైపు ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, ఇతర అభివృద్ధి పనుల కోసం నిధుల విడుదలకు ఎల్‌జీ... ఓట్ ఆన్ అకౌంట్‌ను ఆమోదించాల్సి ఉంటుంది.
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి పాలన విధించాలని నిర్ణయించడంతో లెప్టినెంట్ గవర్నర్ నివాసం రాజ్‌నివాస్ ఇక అధికార కేంద్రంగా మారనుంది. పాలన మొత్తం లెప్టినెంట్ గవర్నర్ చేతుల్లోకి రానుంది. అన్ని ప్రభుత్వ విభాగాలు , మూడు మున్సిపల్ కార్పొరేషన్లు, ఎన్‌డీఎంసీ, విద్యుత్ సంస్థలు, ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ)లు ఆయన పరిధిలోకి వస్తాయి. పరిపాలన ను సమర్థంగా సాగించడం కోసం ఎల్జీ ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మొదటిది కీలక ప్రభుత్వ విభాగాల బాధ్యతను సలహాదారులకు అప్పగించడం. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్... విశ్రాంత అధికారులను కొన్ని కీలక విభాగాలకు సలహాదారులుగా నియమించి వారికి మంత్రులకు ఉండే కొన్ని అధికారాలను కట్టబెట్టవచ్చు, ఇక రెండోది ప్రధానకార్యదర్శి లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా అధికారుల అధికారాలను పెంచి తమ విబాగాలకు సంబంధించిన నిర్ణయాధికాకరం కట్టబెట్టవచ్చు. ఇందువల్ల రోజువారీ పాలనా వ్యవహారాలకు సంబంధించి ఫైళ్లు ఎల్జీ నివాసానికి పంపించవలసిన అవసరం ఉండ దు. అయితే అన్ని కీలక విషయాలలో అంతిమ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని ముఖ్య నిర్ణయాలకు అనుమతి కోసం ఫైళ్లు రాజ్‌నివాస్‌కు రావాల్సి ఉంటుంది. ప్రధాన కార్యదర్శి ప్రభుత్వానికి రాజ్‌నివాస్ మధ్యవర్తిగా ఉంటారు. అన్ని విభాగాలకు చెందిన ఫైళ్లు ప్రధాన కార్యదర్శి ద్వారా లె ఫ్టినెంట్ గవర్నర్‌కు చేరతాయి.
మొట్టమొదటిసారి
ఢిల్లీలో మొట్టమొదటిసారి రాష్ట్రపతి పాలన అమల్లోకి రానుంది. సంపూర్ణ రాష్ట్ర హోదా లేనందువల్ల ఢిల్లీలో భూమి, పోలీసు, శాంతి భద్రతల వ్యవహారాలు కేంద్రం చేతిలో ఉండడంతో రాజ్‌నివాస్ రెండో అధికార కేంద్రంగా ఉండనుంది. అయినప్పటికీ రాష్ట్రపతి పాలనతో పూర్తి అధికారం రాజ్‌నివాస్ కిందికి రానుంది.
ఎల్‌జీ ముందున్న కీలక సవాళ్లు
మొట్టమొదటిది ఓట్ ఆన్ ఎకౌంట్‌ను ఆమోదిం చడం. ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, ఇతర అభివృద్ధి పనుల కోసం నిధులు విడుదలకు ఎల్‌జీ... ఓట్ ఆన్ అకౌంట్‌ను ఆమోదించాల్సి ఉం టుంది. రెండోది బకాయిల చెల్లింపులకోసం డిస్కం లకు ఎన్‌టీపీసీ ఇప్పటికే అల్టిమేటం ఇచ్చింది. డిస్కంలు ఈ చెల్లింపులు జరపనట్లయితే ఢిల్లీ వాసులకు విద్యుత్ కోతలు తప్పవు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి డిస్కంలు ప్రభుత్వం వైపు చూస్తున్నాయి. అనుమతులు లభించక గడిచిన ఆరు నెలలుగా ఢిల్లీ జల్ బోర్డుకు చెందిన అనేక ప్రాజెక్టులు ఆగిపోయాయి. వాటిని పట్టాలపైకి ఎక్కించాలంటే లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి అవసరం. ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) పరిధిలోని 28 ప్రభుత్వ కళాశాలలో పాలకమండలిలో కొత్తవారిని నియమించాలనే ఆప్ సర్కారు ప్రయత్నం సఫలం కాలేదు. ఇప్పుడు ఆ కళాశాలలకు చెందిన పాలకమండళ్లలో 140 మందిని ఎల్జీ నియమించాల్సి ఉంది.
స్వరాజ్ చట్టం కింద మొహల్లా సభలకు నిధులు అందచేయాలనే ఉద్దేశంతో ఆప్ సర్కారు ఎమ్మెల్యే నిధులను విడుదల చేయలేదు. ఇపుడు వాటిని లెఫ్టినెంట్ గవర్నర్ విడుదల చేయాల్సి ఉంది. ఆప్ సర్కారు వచ్చిన తరువాత రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల (ఆర్‌డబ్ల్యూఏ)లకు భాగీధారీ కింద రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. లెఫ్టినెంట్ గవర్నర్ ఇందుకు సంబంధించి ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామనే హామీని నెరవేర్చక మునుపే కేజ్రీవాల్ సర్కారు గద్దెదిగింది. ఈ విషయాన్ని పరిశీలించడం కోసం కేజ్రీవాల్ ప్రభుత్వం నియమించిన కమిటీ నెలరోజులలో నివేదిక ఇవ్వాల్సిఉంది. తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తెస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలోకూడా లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Advertisement
Advertisement