ఇది 15 ఏళ్ల అమ్మాయి ఛాలెంజ్..! | Ludhiana 15-yr-old girl challenges Kanhaiya for debate | Sakshi
Sakshi News home page

ఇది 15 ఏళ్ల అమ్మాయి ఛాలెంజ్..!

Published Sat, Mar 5 2016 5:23 PM | Last Updated on Sun, Sep 3 2017 7:04 PM

ఇది 15 ఏళ్ల అమ్మాయి ఛాలెంజ్..!

ఇది 15 ఏళ్ల అమ్మాయి ఛాలెంజ్..!

రాజద్రోహం కేసులో అరెస్టయి విడుదలైన జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్హయ్యకుమార్.. భావప్రకటన స్వేచ్ఛ అంశంపై బహిరంగ చర్చకు రావాలంటూ 15 ఏళ్ల అమ్మాయి సవాల్ విసిరింది. ఏవిషయమైనా మాట్లాడేముందు ఓసారి ఆలోచించుకోవాలని కన్హయ్యకు సలహా ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించింది.

కన్హయ్యకు సవాల్ చేసిన అమ్మాయి పేరు జాహ్నవి బెహల్. లుథియానాకు చెందిన జాహ్నవి.. భాయ్ రణ్ధీర్ సింగ్ నగర్లో డీఏవీ పబ్లిక్ స్కూల్లో చదువుతోంది. స్వచ్ఛ్ భారత్ అభియాన్లో పాల్గొన్నందుకు గాను జాహ్నవి.. రిపబ్లిక్ డే రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి సత్కారం అందుకుంది. ఎన్జీవో రక్షా జ్యోతి ఫౌండేషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది.

ఓ జాతీయ పత్రికతో జాహ్నవి మాట్లాడుతూ.. రాజ్యాంగం భావప్రకటన స్వేచ్ఛ కల్పించిందని, దీని అర్ధం హద్దులు దాటి మాట్లాడం కాదని చెప్పింది. కన్హయ్య తదితరులు రాజకీయ లబ్ధి కోసం ఈ ప్రాథమిక హక్కును దుర్వినియోగం చేశారని ఆరోపించింది. 'జేఎన్యూలో భావప్రకటన స్వేచ్ఛ పేరుతో జరిగిన ఘటనను ఏ భారతీయుడు సహించడు. పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు భారత సైనికులు తమ జీవితాలను త్యాగం చేస్తుంటే.. మరోవైపు జేఎన్యూ విద్యార్థులు దేశ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ చర్య ప్రపంచంలో భారత్ ప్రతిష్టతను మసకబారుస్తుంది' అని జాహ్నవి అంది. జాహ్నవి గతంలో పలు సమస్యలను ప్రస్తావించింది. పెద్దల చిత్రాలు, సోషల్ మీడియాలో నీలిచిత్రాలను నిషేధించాలని కోరుతూ చండీగఢ్ హైకోర్టును పిటిషన్ దాఖలు చేసింది. స్కూల్ డ్రెస్లోనే కోర్టుకు హాజరైంది. కోర్టు తీర్పు జాహ్నవికి అనుకూలంగా వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement