శివమొగ్గ: స్పీకర్ కాగోడు తిమ్మప్పకు ఉప ముఖ్యమంత్రి స్థానం కల్పించాలని మానవ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా సమితి అధ్యక్షుడు బి.ఎన్.రాజు మాట్లాడుతూ.. రాష్ర్టం లో ఉన్న బంజరు భూములను రైతులు సాగు చేసుకోవాలంటే స్పీకర్ కాగోడు తిమ్మప్పను ఉప ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అంతే కాకుండా అటవీ, రెవెన్యూ శాఖలను అప్పగించాలని డిమాండ్ చేశారు.
రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోందని, ఇప్పటి వరకూ బంజరు భూములను సాగు చేసుకోవడంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం శోచనీయమని అన్నారు. బంజరు భూముల సాగుదారుల సంక్షేమానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని అసహనం వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేకిగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతుల సమస్యలు తీర్చే సత్తా ఒక్క కాగోడు తిమ్మప్పకే ఉందం టూ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ధర్నాలో సమితి కార్యాధ్యక్షుడు అరుణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి అక్రంఖాన్ పాల్గొన్నారు.
మంత్రివర్గంలో కాగోడుకు స్థానం కల్పించండి
Published Tue, Jan 6 2015 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 7:15 PM
Advertisement
Advertisement