Speaker kagodu timmappa
-
సభ్యుల గైర్హాజరుపై స్పీకర్ గరం
బెంగళూరు: విధానసభలో మంత్రులు, ఎమ్మెల్యేల గైర్హాజరుపై స్పీకర్ కాగోడు తిమ్మప్ప తీవ్రంగా స్పందించారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా గురువారం విధానసభ కార్యకలాపాలు ప్రారంభమైన సందర్భంలో ఐటీ శాఖమంత్రి ఎస్.ఆర్ పాటిల్ ఒక్కరే చట్టసభలో కన్పించారు. ఇక అధికార పార్టీకు చెందిన ఇద్దరు ముగ్గురు శాసనసభ్యులు మాత్రమే హాజరయ్యారు. దీంతో సభలో ప్రభుత్వ ప్రతినిధులు తక్కువగా ఉన్న విషయాన్ని స్పీకర్ కాగోడు తిమ్మప్ప విపక్షసభ్యులు దృష్టికి తీసుకువచ్చారు. ‘వారికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. అసలు శాసనసభ అంటే ఏంటో మంత్రులతో పాటు అధికార పార్టీకు చెందిన శాసనసభ్యులకు అర్థమయినట్లు లేదు.’ అని అసహనం వ్యక్తం చేశారు. ఆ సమయంలో బీజేపీ సీనియర్ నేత విశ్వేశ్వర హెగ్డే కాగేరి కలుగ జేసుకుని ‘మంత్రి అంబరీష్ ఒక్కరే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారన్న వార్తలు వస్తున్నాయి. అయితే సభలో పరిస్థితి చూస్తుంటే మంత్రులందరూ అధికార కాంగ్రెస్‌కు టా...టా చెప్పినట్లు ఉంది.’ అని వ్యంగ్యాస్త్రం వదిలారు. అంతేకాక అంబరీష్ మంత్రి పదవికి రాజీనామా చేసుంటే ఆ పత్రాన్ని మీకేమైనా అందించారా అని స్పీకర్ కాగోడు తిమ్మప్పను ఉద్దేశించి ప్రశ్నించారు. ఈ సమయంలో ఎస్.ఆర్ పాటిల్ ఏదో చెప్పడానికి ప్రయత్నించగా విశ్వేశ్వర హెగ్డే కాగేరి వినిపించుకోకుండా....‘బాబురావ్ చించన్ సూర్ పై చెక్ బౌన్స్ కేసు., చిన్న నీటిపారుదల శాఖ మంత్రి శివరాజ్ తంగడి పై హత్యారోపణలు, రైతుల ఆత్మహత్యలపై నిర్లక్ష్యపు సమాధానాలు చెబుతున్న ఉద్యాన శాఖ మంత్రి శ్యామనూరు శివశంకరప్ప ఇలా ప్రతి ఒక్కరిపై ఏదో ఒక ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మంత్రులే శాసనసభకు గైర్హాజరైతే ఏ విషయాలపై చర్చించాలి.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో శాసనసభలో జేడీఎస్ పార్టీ ఉపనాయకుడు వై.వి.ఎస్ దత్తా కలుగజేసుకుని ‘అభివృద్ధిలో వెనకబడిన ఉత్తర కర్ణాటక విషయమై చర్చించేందుకే స్పీకర్ రెండు రోజుల సమయాన్ని కేటాయించారు. అయితే ఈ విషయమై అధికార పార్టీకు ఎటువంటి ఆసక్తి లేదు. ఇక ప్రభుత్వ ప్రతినిధుల్లో 85 శాతం మంది ఇలా నిర్లక్ష్యవైఖరితో ప్రజాస్వామ్యానికి నిలువుటద్దం అయిన శాసనసభకు గైర్హాజరు కావడం సరికాదు. కనీసం ఉత్తర కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యేలు లేకపోతే ఎలా.’ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సమయంలో స్పీకర్ కాగోడు తిమ్మప్ప కలుగజేసుకుని అధికార పార్టీ నాయకులతో తాను మాట్లాడి హాజరు శాతం పెంచడానికి ప్రయత్నిస్తానని చెప్పి పరిస్థితిని యథాస్థితికి తేవడంతో శాసనసభలో సభా కార్యక్రమాలు యథావిధిగా జరగడం ప్రారంభించాయి. -
వాయిదా తీర్మానానికి అధికార పక్షం సభ్యుడి పట్టు..
బెంగళూరు: శాసనసభలో వాయిదా తీర్మానానికి అధికార పక్షం నాయకుడే పట్టుబట్టిన ఘటన బెళగావిలో జరగుతున్న వర్షాకాల శాసనసభ సమవేశాల్లో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు... నిధుల విడుదల్లో హైదరాబాద్-కర్ణాటక ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని దీనిపై చ ర్చించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీకు చెందిన ఏ.ఎస్ పాటిల్ నడహళ్లి వాయిదా తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందుకు విపక్షనాయకుడైన శెట్టర్‌తో పాటు పాటు పలువురు జేడీఎస్ నాయకులు మద్దతు తెలి పారు. ఈ సమయంలో కలుగ జేసుకున్న స్పీకర్ కాగోడు తిమ్మప్ప ఈ విషయంపై చర్చను సోమవారం జరుపుదామన్నారు. అయితే ఇప్పుడే చర్చ జరపాల్సిందేనని నాడహళ్లి పట్టుబట్టారు. అరవై ఏళ్ల నుంచి హైదరాబాద్ కర్ణాటక పూర్తిగా వెనుకబడిన ప్రాంతంగానే గుర్తింపు పొందిందన్నారు. ఈ విషయంపై చర్చించడానికి అనుగుణంగా పాలక పక్షం నాయకులే వాయిదా తీర్మానానికి సంతకాలు చేశారని వెల్లడించారు. దీంతో కంగుతిన్న ప్రభుత్వ విప్ పీ.ఎం అశోక్ తప్పుడు సమాచారమిచ్చి నాడహళ్లి తమ పార్టీ నా యకులతో సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా అయ న్ను పార్టీ ఇప్పటికే సస్పెండ్ చేసిందని పేర్కొన్నారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరినొక రు ఏకవచనంతో దూషించుకోవడం మొ దలు పెట్టారు. వీరిద్దరికీ సర్ధిచెప్పడానికి స్పీకర్ కాగోడు తిమ్మప్ప తీవ్రంగా శ్రమిం చాల్సి వచ్చింది. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు, మాజీ స్పీకర్ రమేశ్ కుమార్ కలుగజేసుకుని పాలక పక్షం వారు వాయిదా తీర్మానం పెట్టడం సరికాదన్నా రు. ఈ సంప్రదాయాన్ని మనం మొదటి నుంచి అనుసరిస్తున్నామని తెలి పారు. అటుపై వాయిదా తీర్మానానికి మ ద్దతు తెలుపుతూ సంతకాలు చేసిన సీ. ఎస్ నాడగౌడ, జీ.టీ పాటిల్ మాట్లాడుతూ...‘నంజుండప్ప నివేదికపై చర్చ కోసం అంటే సంతకాలు చేశాం. అం దులో ఏముందో కూడా మాకు తెలియదు.’ అ న్నారు. ఈ సమయంలో కలుగజేసుకున్న బీజేపీ నాయకుడు విశ్వేశ్వర హెగ్డే కాగేరి ‘బాధ్యతాయుతమైన స్థానం లో ఉండి ఓ కాగితంలో ఏముందో చదవకుండా సంతకాలు ఎలా చేస్తారో’ అని ప్రశ్నించారు. ఈ విషయమై స్పీకర్ చర్యలు తీసుకోవాలని సభాముఖంగా కోరారు. దీంతో స్పీక ర్ కాగోడు తిమ్మప్ప కలుగజేసుకుని చేసి న తప్పుకు క్షమాపణ చెప్పండంటూ స భ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాయిదా తీర్మానంలో ఏముందో చదవకుండా సంతకం చేయడం తప్పు. చేసిన తప్పుకు క్షమాపణ కోరండి.’ అని సూచించారు. దీంతో వారు తెలియక చేసిన తప్పు అని దీనికి చింతిస్తున్నామని చెప్పడంతో సభ కార్యకలాపాలు ముం దుకు సాగాయి. -
ప్రభుత్వం తప్పు చేసింది
- ప్రజలను శిక్షించడం సరికాదు - స్పీకర్ కాగోడు తిమ్మప్ప సాక్షి, బెంగళూరు: చెరువుల్లో ఆక్రమణల తొలగింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలను స్పీకర్ కాగోడు తిమ్మప్ప తప్పుబట్టారు. ప్రభుత్వం తప్పులు చేస్తూ శిక్ష మాత్రం సాధారణ ప్రజలకు విధిస్తోందని విమర్శించారు. ఇంతటి బాధ్యతారాహిత్య పాలనా విధానాన్ని మునుపెన్నడూ తాను చూడలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరులో ఆదివారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. నగరంలోని చెరువు ప్రాంతాలను ప్రభుత్వ విభాగంలో ఓ భాగమైన బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ (బీడీఏ) లే అవుట్లను చేసి ప్రజలకు విక్రయించిందన్నారు. ఇందులో పూర్తీ బాధ్యత ప్రభుత్వానిదే అని అభిప్రాయపడ్డారు. ఈ లే అవుట్లను ఎప్పటికప్పుడు రెగ్యులరైజేషన్ చేయాల్సిన ప్రభుత్వం మిన్నకుండి హఠాత్తుగా ఆక్రమణల తొలగింపు పేరుతో ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చడం తగదని అన్నారు. ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఆ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి తప్పిస్తే వారికి ఇబ్బందులు కలిగించే నిర్ణయాలు తీసుకోకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను ప్రస్తుతం ఉంటున్న డాలర్స్ కాలనీ కూడా చెరువు స్థలాన్నిలే అవుట్‌గా మార్చి గతంలో బీడీఏనే విక్రయించింది. ఈ మొత్తం ప్రక్రియ చట్టప్రకారమే జరిగింది. అయితే ఇది అక్రమమని పేర్కొంటూ ఇక్కడి ఇళ్లను కూల్చడానికి ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం సరికాదు. బీడీఏ లే అవుట్లు చేసే సమయంలో ప్రభుత్వం ఎందుకు ఊరికే కుర్చొన్నట్లు? ఇప్పుడు ఎందుకు కూల్చడానికి తొందర పడుతున్నట్లు? ఈ విషయాలన్నీ పేర్కొంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు త్వరలో లేఖ రాస్తా’ అని పేర్కొన్నారు. చెరువు ఆక్రమణల విషయమై ఏర్పాటైన సభాసమితికి కూడా నివేదిక తొందరగా ఇమ్మని సూచిస్తున్నట్లు ఈ సందర్భంగా కాగోడు తిమ్మప్ప తెలిపారు. చెరువుల ఆక్రమణల తొలగింపు వల్ల ఇప్పటి వరకూ దాదాపు 180 మంది పేద, మధ్య ప్రజలు ఇళ్లను కోల్పోయి వీధిన పడ్డారని ఆయన వాపోయారు. ఆక్రమణతొలగింపు వల్ల గూడును కోల్పోయిన వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కాగోడు తిమ్మప్ప స్పష్టం చేశారు. -
అతిక్రమిస్తే.. చర్యలు తప్పవు
బెంగళూరు : శాసనసభలో నిబంధనలు అతిక్రమిస్తూ సమస్యలపై చర్చలు పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించే శాసనసభ్యులపై కఠిన చర్యలు తప్పవని స్పీకర్ కాగోడు తిమ్మప్ప హెచ్చరించారు. రేపటి (సోమవారం) నుంచి శాసనసభ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో విధాన సౌధలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజాసమస్యలను చర్చించేందుకు చట్టసభలు ఏర్పాటయ్యాయన్నారు. సోమవారం నుంచి మొదలయ్యే చట్టసభల్లో ఆర్కావతి డీ నోటిఫికేషన్, చెరుకు రైతుల సమస్యలపై చర్చకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. అయితే శాసనసభలు జరిగే 10 రోజులూ వాటి పైనే చర్చజరగాలని చూడటం సరికాదన్నారు. ఈ దిశగా ఆలోచించి అనవసర చర్చకు మొగ్గుచూపుతూ విలువైన సభాసమయాన్ని హరించడానికి ప్రయత్నించే సభ్యుల పట్ల కఠినంగా వ్యవహరిస్తానన్నారు. మొదటి రోజున గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా ఉభయ సభలను ఉద్దేశించి హిందిలో ప్రసంగించనున్నారని తెలిపారు. తమకు వచ్చిన భాషలో చట్టసభల్లో ప్రసంగించడానికి అవకాశం ఉందన్నారు. కర్ణాటక విద్యా హక్కు చట్టానికి తీసుకువచ్చే మార్పులో కూడిన ముసాయిదా బిల్లు, చెరువుల సంరక్షణ, అభివృద్ధి విషయంపై రూపొందించిన ముసాయిదా బిల్లు తదితర విషయాలకు చట్టసభల్లో అనుమతి లభించే అవకాశం ఉందన్నారు. ప్రత్యేక చానల్ : చట్టసభల ప్రసారం కోసం ప్రత్యేక చానల్ ఏర్పాటు కోసం కేంద్రం నుంచి సూచన అందిందన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. ఇక చానల్ ప్రారంభించే విషయం ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. పేపర్‌లెస్ చట్టసభల నిర్వహణ కోసం కృషి చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. -
వాటిని పెద్దగా పట్టించుకోను తనపై వస్తున్న విమర్శలపై
స్పీకర్ కాగోడు తిమ్మప్ప సమాధానం బెంగళూరు:ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ తనపై వస్తున్న విమర్శలపై ప్రతిస్పందించేందుకు స్పీకర్ కాగోడు తిమ్మప్ప నిరాకరించారు. అలాంటి విమర్శలను తాను పెద్దగా పట్టించుకోనని అన్నారు. అది ఓ ముగిసిపోయిన అధ్యాయమంటూ సమాధానమిచ్చారు. బుధవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను తెలియజేసే అధికారం ఉందని అన్నారు. ఎవరి అభిప్రాయాలను వారు చెబుతూ ఉంటారని, అలాంటి వ్యాఖ్యలన్నింటిపై తాను స్పందించబోనని, అసలు పట్టించుకోనని తెలిపారు. తాను ప్రతిపక్ష నేతగా వ్యవహరించడం లేదని, కేవలం ఒక స్పీకర్‌గా ఆ పదవికి మాత్రమే న్యాయం చేస్తున్నానని స్పష్టం చేశారు. కాగా, గత కొంతకాలంగా స్పీకర్ కాగోడు తిమ్మప్ప మంత్రుల పనితీరుపై బహిరంగ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయనపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేసేందుకు కొంతమంది మంత్రులు, ముఖ్యమంత్రి అనుయాయులు సిద్ధమయ్యారంటూ వార్తలు వెలువడిన విషయం తెలసిందే. ఈ ఘట్టానికి ముగింపు పలికేందుకే స్పీకర్ కాగోడు తిమ్మప్ప ‘అది ఓ ముగిసిపోయిన ఘట్టం’ అంటూ విలేకరులతో చెప్పారని తెలుస్తోంది. -
మంత్రివర్గంలో కాగోడుకు స్థానం కల్పించండి
శివమొగ్గ: స్పీకర్ కాగోడు తిమ్మప్పకు ఉప ముఖ్యమంత్రి స్థానం కల్పించాలని మానవ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా సమితి అధ్యక్షుడు బి.ఎన్.రాజు మాట్లాడుతూ.. రాష్ర్టం లో ఉన్న బంజరు భూములను రైతులు సాగు చేసుకోవాలంటే స్పీకర్ కాగోడు తిమ్మప్పను ఉప ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అంతే కాకుండా అటవీ, రెవెన్యూ శాఖలను అప్పగించాలని డిమాండ్ చేశారు. రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోందని, ఇప్పటి వరకూ బంజరు భూములను సాగు చేసుకోవడంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం శోచనీయమని అన్నారు. బంజరు భూముల సాగుదారుల సంక్షేమానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని అసహనం వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేకిగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతుల సమస్యలు తీర్చే సత్తా ఒక్క కాగోడు తిమ్మప్పకే ఉందం టూ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ధర్నాలో సమితి కార్యాధ్యక్షుడు అరుణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి అక్రంఖాన్ పాల్గొన్నారు. -
ఏమిటీ సమావేశాలు..?
అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్ కాగోడు తిమ్మప్ప అసంతృప్తి బెంగళూరు : బెళగావిలోని సువర్ణసౌధలో 10 రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాలు ఎంత మాత్రం సంతృప్తికరంగా సాగలేదని స్పీకర్ కాగోడు తిమ్మప్ప ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా శనివారమిక్కడ సువర్ణసౌధ ఆవరణలో కాగోడు తిమ్మప్ప విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో చురుగ్గా పాల్గొని, ప్రజా సమస్యల పట్ల ఆరోగ్యకరమైన చర్చకు అవకాశం ఇవ్వాల్సిన శాసన సభ్యులు కేవలం నిరసనలతోనే సమయాన్ని గడిపేయడం చాలా బాధ కలిగించిందని అన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాలు కేవలం ఉత్తర కర్ణాటక ప్రాంత సమస్యలను చర్చించేందుకు ఏర్పాటు కాలేదని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజా సమస్యలపై చర్చించి ఒక పరిష్కారాన్ని కనుగొనేందుకే సమావేశాలు నిర్వహించామని చెప్పారు. అయినప్పటికీ ఆ ఉత్తర కర్ణాటక ప్రాంత అభివృద్ధిపై చర్చించేందుకు గాను రెండు రోజుల సమయాన్ని ప్రత్యేకంగా కేటాయించామని తెలిపారు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలు కాకుండా ఇతర అంశాలపైనే ఎక్కువగానే చర్చ జరిగిందని, దీంతో ముఖ్యమైన ప్రజా సమస్యలు కూడా చర్చకు దూరంగానే ఉండిపోయాయని అన్నారు. రానున్న ఏడాది నిర్వహించనున్న బడ్జెట్ సమావేశాలు బెంగళూరులో నిర్వహించాలా లేక బెళగావిలోని సువర్ణసౌధలో నిర్వహించాలా అన్న విషయాన్ని పూర్తిగా ముఖ్యమంత్రి విచక్షణకే వదిలేస్తున్నట్లు స్పీకర్ కాగోడు తిమ్మప్ప వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు వ్యర్థం ప్రజల సమస్యలపై అర్థవంతమైన చర్చకు వేదిక కావాల్సిన అసెంబ్లీ సమావేశాలు పూర్తిగా వ్యర్థమయ్యాయని జేడీఎస్ పార్టీ నేత వైఎస్వీ దత్త పేర్కొన్నారు. శనివారమిక్కడ సువర్ణసౌధ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీతో పాటు బీజేపీ నేతలు కూడా తమ సొంత ప్రయోజనాల కోసం రూపొం దించుకున్న అజెండాలతో సమావేశాల్లో నిరసనలకు దిగడంతో ప్రజల ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోందని అన్నారు. -
షరా మామూలే
బెళగావిలో ముగిసిన శీతాకాల సమావేశాలు ప్రజా సమస్యలపై చర్చించని వైనం ప్రధాన అజెండాపైనే సాగని చర్చ వ్యక్తిగత విమర్శలతోనే కాలం వెళ్లదీశారు ప్రజాధనం రూ. పది కోట్ల వృథా బెంగళూరు : రాష్ట్రంలో వెనుకబడిన ఉత్తర కర్ణాటక ప్రాంత సమస్యలపై చర్చ, పరిష్కార మార్గాల సూచనల వెల్లడే ప్రధాన అజెండగా బెళగావిలో నిర్వహించిన శీతాకాల సమావేశాల వల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది! స్పీకర్ కాగోడు తిమ్మప్ప అయితే బహిరంగంగానే ఈ శాసనసభ సమావేశాల పట్ల తన అసంతృప్తిని వెళ్లగక్కారు. బెళగావిలో సువర్ణ విధానసౌధలో ఈ డిసెంబర్ 9న ప్రారంభమైన ఈ శీతాకాల సమావేశాలు రెండు సెలవు రోజులు పోను 10 రోజుల పాటు సాగి శనివారం (డిసెంబర్ 20న) ముగిశాయి. వెనుకబడిన హై-కలోని ఆరు జిల్లాల అభివృద్ధికి అవసరమైన విషయాలపై ఉభయల్లో చర్చించాల్సిన ప్రజాప్రతినిధులుఎక్కువ సమయం ఒకరిపై మరొకరు బురద చల్లుకోవడానికే సమయం వెచ్చించారు. సమావేశాలప్రారంభం రోజు చెరుకుకు మద్దతు ధర చెల్లించే విషయమై బీజేపీ ఉభయసభల్లో ప్రభుత్వాన్ని నిలదీసే క్రమంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడటంతో ఆ రోజు మొత్తం సభాకార్యకలాపాలు సాగలేదు. తర్వాత మూడు రోజులు ప్రజాప్రతినిధుల ఁసెల్ లీలల* వల్ల కూడా చట్టసభల కార్యకలాపాలు కొండెక్కాయి. తర్వాత శని, ఆదివారాలు సెలువు రోజులు. సోమవారం నుంచి నాలుగు రోజుల్లో ఉదయం పూట మాత్రమే ఉభయ సభల్లో రాష్ట్రంలోని వివిధ సమస్యలపై ప్రశ్నోత్తరాల సమయం కొనసాగింది. ఈ సమయంలో స్పీకర్కాగోడు తిమ్మప్ప స్వపక్షానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల పైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరుకు మాత్రమే పారదర్శక పాలన ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా చెరుకు రైతుల బాకీలు చెల్లించకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ ఁప్రభుత్వం చక్కెర కర్మాగాల యాజమాన్యానకి బంధువులా వ్యవహరిస్తోందా? అన్న అనుమానం కలుగుతోంది* అంటూ తీవ్ర వాఖ్యలు చేశారు. ఇక రాష్ట్రంలో వైద్యుల కొరతపై విపక్షనాయకుల మద్దతుతో సంబంధిత మంత్రి యూటీ ఖాదర్‌కు క్లాస్ తీసుకున్నారు. దీంతో పాలనలో ప్రభుత్వ డొల్లతనం బయటపడినట్లయింది. ఈ సమయంలోనే సోమ, మంగళ వారాలు రాష్ట్రంలోని సమస్యలపై, బుధ, గురువారాలు ఉత్తర కర్ణాటక అభివృద్ధిపై చర్చ కొనసాగింది. చర్చల సందర్భంలో ప్రతి సారి కాంగ్రెస్, బీజేపీ నాయకులు వ్యక్తిగత దూషణలకు దిగడంతో సభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. పోని చర్చలు ఎలా జరిగినా ముఖ్యమంత్రి హోదాలో సిద్ధరామయ్య సమాధానం ఇచ్చే సమయంలో ఉత్తర కర్ణాటక ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కాని, సామాజికంగా వెనుకబడిన వారికి సంక్షేమానికి ప్రత్యేక పథకాలేవైనా ప్రకటించారా అంటే అదీ లేదు. ఇక చెరుకు బకాయిలను ఇప్పించే విషయం, ప్రధాన పంటల కొనుగోలు కేంద్రాల ప్రారంభంపై కూడా సిద్ధరామయ్య నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో ఆ ప్రాంత ప్రజలతోపాటు స్వపక్షనాయకులు కూడా గుర్రుగా ఉన్నారు. ఇక శాసనసభ సమావేశాల చివరి రెండురోజులైన శుక్ర, శనివారాలు బీజేపీ నాయకులు అవినీతి ఆరోపణలు ఉన్న మంత్రులపై చర్చకు పట్టుపట్టడంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడటంతో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. ఇక చివరి రోజైతే ఉభయ సభలు ప్రారంభమైన కొద్ది సేపటికే నిరవధికంగా వాయిదా పడ్డాయి. దీంతో పది రోజుల పాటు జరిగిన ఈ శీతాకాల సమావేశాల వల్ల ఎటువంటి ఫలితం లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఁఅసెంబ్లీ సమావేశాల్లో చురుగ్గా పాల్గొని, ప్రజా సమస్యలపై ఆరోగ్యకరమైన చర్చకు అవకాశం ఇవ్వాల్సిన శాసనసభ్యులు కేవలం నిరసనలతోనే సమయాన్ని గడిపేయడం చాలా బాధ కలిగించింది* అని స్పీకర్ కాగోడు తిమ్మప్పే విశ్లేషించడం విశేషం. దీంతో ఈ సమావేశాల నిర్వహణకుగాను రోజుకు దాదాపు కోటి రుపాలయ చొప్పున వెచ్చించిన మొత్తం పది కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు చందంగా తయారైంది. -
నేనూ అరవగలను
కాంగ్రెస్ సభ్యులపై స్పీకర్ ఆగ్రహం బెంగళూరు : ‘అరవడం మీకే కాదు.. నాకూ వచ్చు. సభలో గొడవ చేయకుండా ఊరికే ఉండండి’ అంటూ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులతో పాటు పార్టీ చీఫ్ విప్ తీరుపై స్పీకర్ కాగోడు తిమ్మప్ప మండిపడ్డారు. గురువారం ఉదయం శాసనసభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే... ‘సెల్’ వీక్షణతో మీడియా కంట పడిన ఎమ్మెల్యే ప్రభుచౌహాన్ తీరును విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు చీఫ్ విప్ కూడా వెల్‌లోకి దూసుకెళ్లారు. వెల్‌లోకి వచ్చిన సభ్యులను తిరిగి వారి స్థానాల్లోకి వెళ్లిపోవాల్సిందిగా స్పీకర్ కాగోడు తిమ్మప్ప సూచించారు. అయినా అధికార పార్టీ ఎమ్మల్యేల తీరులో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో స్పీకర్ సహనం కోల్పోయారు. ‘అరవడం మీకే కాదు నాకూ వచ్చు’ అని గద్దించడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా మౌనం వహించాల్సి వచ్చింది. ఇక అనంతరం అధికార పక్ష చీఫ్ విప్ పై కూడా స్పీకర్ కాగోడు తిమ్మప్ప మండిపడ్డారు. ‘సభా కార్యకలాపాల విషయంలో ఎమ్మెల్యేలకు మార్గదర్శిగా వ్యవహరించాల్సిన బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మీరు కూడా ఇలా ప్రవర్తించడం ఏ మాత్రం సరికాదు’ అని అనడంతో ప్రభుత్వ చీఫ్ విప్ పీఎం అశోక్ కూడా మౌనంగా తన స్థానంలోకి వెళ్లిపోయారు. ఆ వెంటనే మళ్లీ చిరునవ్వుతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప సభా కార్యకలాపాలు కొనసాగించడం గమనార్హం. -
ఇదేమి పారదర్శక పాలన?
సర్కార్‌పై స్పీకర్ గరం బెంగళూరు : ‘ పారదర్శక పాలనంటే ఇదేనా. ముందు అవినీతిపరులపై చర్యలు తీసుకోండి’ అంటూ మంత్రులపై స్పీకర్ కాగోడు తిమ్మప్ప మండిపడ్డారు. ఇలా విపక్ష నాయకులపైనే కాక స్వపక్షమైన కాంగ్రెస్ మంత్రులపై కూడా స్పీకర్ కాగోడు తిమ్మప్ప గరం అయ్యారు. స్పీకర్ స్థానానికి తరతమ భేదం లేదని మరోసారి రుజువు చేశారు. వివరాలు... బుధవారం శాసనసభ సమావేశాల కార్యక్రమాల్లో భాగంగా శృంగేరి జిల్లా పంచాయిత్‌లో జరిగిన నిధుల దుర్వినియోగానికి సంబంధించి సంబంధిత అధికారిని సస్పెండ్ చేయాలని నియోజక వర్గ ఎమ్మెల్యే జీవరాజ్ స్పీకర్ ద్వారా న్యాయశాఖ మంత్రి టీబీ జయచంద్ర దృష్టికి తీసుకువచ్చారు. పూర్వాపరాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి సమాధానం ఇస్తుంటే మధ్యలో కలుగ జేసుకున్న స్పీకర్ కాగోడు తిమ్మప్ప ‘పారదర్శక పాలన అంటూ చెప్పుకుచ్చే మీరు ఆరోపణలు ఉన్న అధికారిని అదేస్థానంలో ఎలా కొనసాగిస్తారు. మొదట ఆయన్ను తొలగిస్తామని ఇప్పుడే చెప్పండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సదరు మంత్రి ఆధికారిని సస్పెండ్ చేస్తున్నట్లు అప్పటికప్పుడు ప్రకటన చేశారు. అంతేకాకుండా విపక్షాలు అడిగాన ఓ ప్రశ్నకు ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్వీ దేశ్‌పాండే సుదీర్ఘ జవాబు ఇస్తుండటం విని ‘సూటిగా చెప్పండి. సమయం వృథా చేయకండి’ అని సూచించారు. ఇదిలా ఉండగా విపక్ష శాసనసభ్యులు అడుగుతున్న ప్రతి ప్రశ్నకు ‘అందుకు అనుగుణమైన ప్రశ్న నేను అడుగుతాను... నేను కూడా’ అంటూ లేచినిలబడి సభలో గందరగోళ పరిస్థితులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సృష్టించడం మొదలు పెట్టారు. దీంతో ఆగ్రహించిన స్పీకర్ తిమ్మప్ప ‘మొదట మీరు మీ స్థానాల్లో కుర్చొండి. నా అనుమతి లేకుండా ప్రశ్నలు ఎలా అడుగుతారు. ఇలా చేయడం సరికాదు. విలువైన సభాసమయాన్ని వృథా చేయకండి’ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభలో పరిస్థితిని చక్కదిద్దారు.