షరా మామూలే
బెళగావిలో ముగిసిన శీతాకాల సమావేశాలు
ప్రజా సమస్యలపై చర్చించని వైనం
ప్రధాన అజెండాపైనే సాగని చర్చ
వ్యక్తిగత విమర్శలతోనే కాలం వెళ్లదీశారు
ప్రజాధనం రూ. పది కోట్ల వృథా
బెంగళూరు : రాష్ట్రంలో వెనుకబడిన ఉత్తర కర్ణాటక ప్రాంత సమస్యలపై చర్చ, పరిష్కార మార్గాల సూచనల వెల్లడే ప్రధాన అజెండగా బెళగావిలో నిర్వహించిన శీతాకాల సమావేశాల వల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది! స్పీకర్ కాగోడు తిమ్మప్ప అయితే బహిరంగంగానే ఈ శాసనసభ సమావేశాల పట్ల తన అసంతృప్తిని వెళ్లగక్కారు. బెళగావిలో సువర్ణ విధానసౌధలో ఈ డిసెంబర్ 9న ప్రారంభమైన ఈ శీతాకాల సమావేశాలు రెండు సెలవు రోజులు పోను 10 రోజుల పాటు సాగి శనివారం (డిసెంబర్ 20న) ముగిశాయి. వెనుకబడిన హై-కలోని ఆరు జిల్లాల అభివృద్ధికి అవసరమైన విషయాలపై ఉభయల్లో చర్చించాల్సిన ప్రజాప్రతినిధులుఎక్కువ సమయం ఒకరిపై మరొకరు బురద చల్లుకోవడానికే సమయం వెచ్చించారు. సమావేశాలప్రారంభం రోజు చెరుకుకు మద్దతు ధర చెల్లించే విషయమై బీజేపీ ఉభయసభల్లో ప్రభుత్వాన్ని నిలదీసే క్రమంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడటంతో ఆ రోజు మొత్తం సభాకార్యకలాపాలు సాగలేదు. తర్వాత మూడు రోజులు ప్రజాప్రతినిధుల ఁసెల్ లీలల* వల్ల కూడా చట్టసభల కార్యకలాపాలు కొండెక్కాయి. తర్వాత శని, ఆదివారాలు సెలువు రోజులు. సోమవారం నుంచి నాలుగు రోజుల్లో ఉదయం పూట మాత్రమే ఉభయ సభల్లో రాష్ట్రంలోని వివిధ సమస్యలపై ప్రశ్నోత్తరాల సమయం కొనసాగింది. ఈ సమయంలో స్పీకర్‌కాగోడు తిమ్మప్ప స్వపక్షానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల పైనే ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేరుకు మాత్రమే పారదర్శక పాలన ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా చెరుకు రైతుల బాకీలు చెల్లించకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ ఁప్రభుత్వం చక్కెర కర్మాగాల యాజమాన్యానకి బంధువులా వ్యవహరిస్తోందా? అన్న అనుమానం కలుగుతోంది* అంటూ తీవ్ర వాఖ్యలు చేశారు. ఇక రాష్ట్రంలో వైద్యుల కొరతపై విపక్షనాయకుల మద్దతుతో సంబంధిత మంత్రి యూటీ ఖాదర్‌కు క్లాస్ తీసుకున్నారు. దీంతో పాలనలో ప్రభుత్వ డొల్లతనం బయటపడినట్లయింది. ఈ సమయంలోనే సోమ, మంగళ వారాలు రాష్ట్రంలోని సమస్యలపై, బుధ, గురువారాలు ఉత్తర కర్ణాటక అభివృద్ధిపై చర్చ కొనసాగింది. చర్చల సందర్భంలో ప్రతి సారి కాంగ్రెస్, బీజేపీ నాయకులు వ్యక్తిగత దూషణలకు దిగడంతో సభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. పోని చర్చలు ఎలా జరిగినా ముఖ్యమంత్రి హోదాలో సిద్ధరామయ్య సమాధానం ఇచ్చే సమయంలో ఉత్తర కర్ణాటక ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కాని, సామాజికంగా వెనుకబడిన వారికి సంక్షేమానికి ప్రత్యేక పథకాలేవైనా ప్రకటించారా అంటే అదీ లేదు. ఇక చెరుకు బకాయిలను ఇప్పించే విషయం, ప్రధాన పంటల కొనుగోలు కేంద్రాల ప్రారంభంపై కూడా సిద్ధరామయ్య నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో ఆ ప్రాంత ప్రజలతోపాటు స్వపక్షనాయకులు కూడా గుర్రుగా ఉన్నారు.
ఇక శాసనసభ సమావేశాల చివరి రెండురోజులైన శుక్ర, శనివారాలు బీజేపీ నాయకులు అవినీతి ఆరోపణలు ఉన్న మంత్రులపై చర్చకు పట్టుపట్టడంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడటంతో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. ఇక చివరి రోజైతే ఉభయ సభలు ప్రారంభమైన కొద్ది సేపటికే నిరవధికంగా వాయిదా పడ్డాయి. దీంతో పది రోజుల పాటు జరిగిన ఈ శీతాకాల సమావేశాల వల్ల ఎటువంటి ఫలితం లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఁఅసెంబ్లీ సమావేశాల్లో చురుగ్గా పాల్గొని, ప్రజా సమస్యలపై ఆరోగ్యకరమైన చర్చకు అవకాశం ఇవ్వాల్సిన శాసనసభ్యులు కేవలం నిరసనలతోనే సమయాన్ని గడిపేయడం చాలా బాధ కలిగించింది* అని స్పీకర్ కాగోడు తిమ్మప్పే విశ్లేషించడం విశేషం. దీంతో ఈ సమావేశాల నిర్వహణకుగాను రోజుకు దాదాపు కోటి రుపాలయ చొప్పున వెచ్చించిన మొత్తం పది కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు చందంగా తయారైంది.