కొత్త జంటను ఆశీర్వదిస్తున్న ఎస్పీ వేదమూర్తి తదితరులు
రాయచూరు రూరల్: అనాథ యువతిని యువకు డు పెళ్లాడి కొత్త జీవితంలో అడుగుపెట్టారు. రాయచూరు నగరంలో గురువారం యరమరస్ కనకదాస అనాథ పిల్లల ఆశ్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మీనాక్షి (19), ఏగనూరువాసి యల్లప్ప (23)లు మూడుముళ్లు, వేదమంత్రాల మధ్య ఒక్కటయ్యారు. మీనాక్షి తల్లిదండ్రులు బతుకుతెరువు కోసం రాయచూరుకు వచ్చారు. కొన్నేళ్ల కిందట వారిద్దరూ చనిపోవడంతో కూతురు మీనాక్షికి నా అన్నవారు లేకపోయారు. అనాథగా ఉన్న మీనాక్షికి అనాథశ్రమమే ఇల్లయింది. ఈ నేపథ్యంలో ఆశ్రమం మీదుగా రాకపోకలు సాగించే రైతు యల్లప్పకు, మీనాక్షితో పరిచయం ఏర్పడింది. అతడు తన తల్లిదండ్రులకు, పెద్దలకు చెప్పగా సంతోషంగా పెళ్లికి అంగీకరించారు. ఈ నేపథ్యంలో యరమరాస్‌లోని రాఘవేంద్ర స్వామిమఠంలో మూడుముళ్లు వేశాడు. జిల్లా ఎస్పీ వేదమూర్తి, నగర సభ సభ్యుడు నరసరెడ్డి, భరత్ రెడ్డిలు వారిని ఆశీర్వదించారు.
Comments
Please login to add a commentAdd a comment