Orphan Ashram
-
అనాధ ఆశ్రమంలో ఫుడ్ పాయిజన్ నలుగురు చిన్నారులు మృతి
-
అనాథను అక్కున చేర్చుకున్న అన్నపూర్ణ సేవా సంస్థ
నల్గొండ: మతిస్థిమితం కోల్పోయిన ఓ మహిళ సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో వారం రోజులుగా రోడ్డు వెంట ఉండి యాచక వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. స్థానికులు ఆరా తీయగా ఆమెది మధ్యప్రదేశ్ అని, తన కుటుంబ సభ్యులు కొట్టడంతో పారిపోయి ఇక్కడకు వచ్చినట్లు తెలిసింది. జడ్చర్ల– కోదాడ ప్రధాన రహదారిపై వీధి లైట్ల కింద నాలుగు రోజులుగా వర్షానికి తడుస్తూ ఉంటుండంతో స్థానికులు ఆమె ధీనస్థితిని వీడియో తీసి ‘ఈ అనాథకు దిక్కెవరు’ అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. స్పందించిన ఆర్ఎస్ఎస్ సేవా భారతి సభ్యుడు రాము ఆమెకు శనివారం అల్పాహారం అందించి నల్లగొండలోని సేవా భారతి స్వచ్ఛంద సంస్థ సభ్యులు భీమనపల్లి శ్రీకాంత్‌కు సమాచారం అందించాడు. ఆయన అంబులెన్స్‌లో నేరేడుచర్లకు వచ్చి సేవా భారతి సభ్యులు, స్థానిక పోలీసులు, మున్సిపల్ శాఖ సిబ్బంది సహకారంతో మతిస్థిమితం కోల్పోయిన మహిళళను సూర్యాపేట సమీపంలో గల దురాజ్‌పల్లిలోని అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ అనాథ ఆశ్రమంలో ఆశ్రయం కల్పించారు. కార్యక్రమంలో సేవా భారతి సభ్యులు మెట్టు వేణుగోపాల్‌రెడ్డి, చామకూరి వీరయ్య, సంపత్, రాములు, రాము, నాగిరెడ్డి, సైదిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, స్థానికులు వెంకన్న, శంకర్‌రెడ్డి, కోటేశ్వర్రావు, వెంకటకృష్ణ తదితరులున్నారు. -
ఇది నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది: శ్రీలీల
ఇండస్ట్రీలో ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోయిన్ శ్రీలీల. పెళ్లిసందD సినిమాతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ధమాకా సూపర్ హిట్‌తో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. అందానికి తోడు అదృష్టం కూడా తోడైనట్లు ఈ సినిమా హిట్‌తో శ్రీలీల క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. సీనియర్ హీరోల దగ్గర్నుంచి యంగ్‌స్టర్స్ కూడా ఆ బ్యూటీతో జతకట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ అమ్మడు కేవలం గ్లామర్‌తోనే కాదు సమాజ సేవలోనూ ముందుంటోంది. తాజాగా ఓ అనాథ ఆశ్రమాన్ని సందర్శించిన శ్రీలీల వారితో కలిసి సందడి చేసింది. చిన్నారులతో సరదాగా ఆడి పాడింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది ముద్దుగుమ్మ. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. చిన్నారులతో కలిసి ఉన్న ఫోటోలు పంచుకున్న శ్రీలీల ఓ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. ఈ రోజు నా జీవితంలో మరపురాని రోజుగా నిలిచిపోతుందని తెలిపింది. జీవితంలో ఇలాంటివి చాలా విలువైనవిగా నిలుస్తాయని అన్నారు. శ్రీలీల తన ఇన్‌స్టాలో రాస్తూ.. ' ఇదే నా చిన్న సమూహం. పెద్ద కలలతో ఉన్న నా చిన్న పిల్లలు. ఈ క్షణాలు చాలా విలువైనవని వారిని చూసే వరకు మీకు తెలియదు. నా జీవితంలో సంతోషంగా గడిపిన రోజు ఇదే. వారితో, కథలు, డ్యాన్స్, పాటలు, ప్రేమతో ఒకరినొకరు ముంచెత్తడం. ప్రేమతో నిండిన హృదయంతో వారితో ఉండడం నాకు జీవితాతం గుర్తుండిపోతుంది. వారు తమ అందమైన చిన్న చిరునవ్వులతో నన్నుచూసి పొంగిపోయారు. మీలో ప్రతి ఒక్కరూ ఇలాంటి సందర్భాన్ని అనుభవించాలని కోరుకుంటున్నారని నాకు తెలుసు. అది సాధ్యమేనని నన్ను నమ్మండి. చాలా సార్లు ప్రజలు ఇతరుల కోసం ఉండాలని కోరుకుంటారు కానీ వారికి దిశా నిర్దేశం లేదు. వారికి ఏం చేయాలో... ఎలా చేయాలో తెలియదు.' అంటూ రాసుకొచ్చింది. శ్రీలీల ఇన్‌స్టాలో రాస్తూ..' అంతా మీ చేతుల్లోనే ఉంది - ఒక్క ట్యాప్, ఒక్క గూగుల్ సెర్చ్ మీ చుట్టూ ఉన్న అందమైన పిల్లలను ఆరా తీయండి. ఇది చూసి మీరు విపరీతమైన విరాళాలు ఇస్తారని నేను ఆశించట్లేదు. కానీ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మీకు అత్యంత విలువైన సమయం, మీ ప్రేమ వారికి పంచండి. వారికి కావలసింది అదే.. వారానికి లేదా నెలకు ఒకసారి వారితో భోజనం చేస్తూ సమయాన్ని వెచ్చించండి. ఇది కడుపు నింపడమే కాదు, వారి హృదయాలను నింపుతుంది. నిండు మనసుతో #Hereforyouను ప్రారంభిద్దాం. మీరు అనాథాశ్రమాన్ని లేదా అలాంటి ఏదైనా సంస్థను సందర్శించినప్పుడల్లా ఒక చిత్రాన్ని పోస్ట్ చేసి, #Hereforyouని ట్యాగ్ చేయండి. మీ చిత్రాలను చూడటానికి నేను ఎదురు చూస్తున్నా. దీన్ని కలిసి చేద్దాం. చేయి చేయి కలిపి ##Hereforyou.' అంటూ రాసుకొచ్చింది. అనాథ అశ్రమంలోని పిల్లలను కలిసి శ్రీలీల ప్రతి ఒక్కరూ మీ విలువైన సమయాన్ని ఒక్కసారైనా కేటాయించండి అంటూ అభిమానులను కోరింది. View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) -
అమ్మగా ఎదిగాను!
‘అమ్మా!’ అనే పిలుపును ఆస్వాదించని మహిళ ఉండదు. ఆ పిలుపును ఎన్ని గొంతులతో వింటే అంత సంతోషం. అందుకే అమ్మలేని పిల్లలకు అమ్మ అయ్యారామె. వాళ్లకు అన్న... అక్క... అమ్మమ్మ... నానమ్మలనూ ఇచ్చారు. అనాథలకు ఆశ్రయంతోపాటు అనుబంధాలనూ ఇస్తున్నారు. ఆరోగ్యరాణి సొంతూరు గుంటూరు జిల్లా, మేడికొండూరు మండలం, వరగాణి. ఆమె సేవకు కేంద్రం వైయస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల. గుంటూరు నుంచి కడపకు సాగిన సేవాప్రస్థానాన్ని ఆమె సాక్షితో పంచుకున్నారు. ‘‘మా నాన్న ఆడపిల్లల చదువు కోసం చాలా గట్టిగా నిలబడ్డారు. అదే నేను ఈ రోజు బాలికల కోసం హోమ్ నడపడానికి మూలకారణం. ఆయన కొంతకాలం టీచర్‌గా ఉద్యోగం చేసి ఊరికి దూరంగా ఉండడం ఇష్టం లేక హైదరాబాద్ నుంచి వరగాణికి వచ్చేసి వ్యవసాయంలో స్థిరపడ్డారు. బంధువులు, ఊరి వాళ్లు ‘ఆడపిల్లకు పెళ్లి చేయకుండా ఇంకా ఎంతకాలం చదువుకు పంపిస్తావ్’ అని ఎంత ఒత్తిడి తెచ్చినా సరే ఆయన అవన్నీ పట్టించుకోకుండా నన్ను, మా మేనమామ కూతురిని కూడా బీఈడీ వరకు చదివించారు. పోరుమామిళ్లకు పిలుపు! టెన్త్ క్లాస్ వరకు నెల్లూరు సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదివాను. నేను బీఈడీ పూర్తి చేసిన టైమ్‌లో మా స్కూల్ హెడ్మిస్ట్రెస్ పోరుమామిళ్లలో ఉన్నారు. తెలిసిన వాళ్ల ద్వారా నా గురించి వాకబు చేశారట. మాథ్స్ టీచర్ అవసరం ఉందని పిలిపించారు. అలా 1994లో పోరుమామిళ్లలోని ‘అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా’ స్కూల్లో మాథ్స్ అసిస్టెంట్‌గా చేరాను, ఇప్పుడు అదే స్కూల్ హెడ్మాస్ట్రిస్ని . ఆ తర్వాత ఏడాది నాకు పెళ్లయింది. మా అత్తగారు కూడా ఇదే స్కూల్లో టీచర్‌గా చేశారట. ఆ సంగతి మా పెళ్లయిన తరవాత తెలిసింది. నాకు ఈ ఊరితో ఈ స్కూల్‌తో అనుబంధం నాకు తెలియక ముందు ఏనాడో ముడిపడి ఉందనిపిస్తుంది. ఇక హోమ్ స్థాపనకు దారి తీసిన పరిస్థితులు కూడా అలాంటివే. ముందస్తు ప్రణాళిక ఏమీ లేదు, అప్రయత్నంగా బాధ్యత తీసుకున్నాను. బాధ్యత ఇంటికి వచ్చింది! మా బంధువుల్లో ఒక పెద్దాయన కలసపా డులో తన ఇంట్లోనే పద్దెనిమిది మంది అబ్బాయిలకు ఆశ్రయం ఇచ్చేవారు. ఆయనకు వయసు మీద పడిన తరవాత ఓ రోజు మా వారి దగ్గరకు వచ్చి ‘‘వీళ్లంతా బాగా చదువుకుంటున్నారు. నాకు శక్తి తగ్గిపోయింది. ఈ పిల్లలను వాళ్ల ఊళ్లకు పంపించేస్తే చదువు ఆగిపోతుంది. వీళ్ల జీవితాలు మీ చేతిలో పెడుతున్నాను. చేయగలిగింది చేయండి’’ అన్నారు. అలా మా ఇంటికి వచ్చిన పిల్లలందరికీ అమ్మనయ్యాను. అందరికీ వండి, నేను బాక్సు పెట్టుకుని స్కూల్‌కి వెళ్లేదాన్ని. వాళ్లలో కొంతమంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. మా హోమ్‌కి వచ్చి ఆ రోజు భోజనం స్పాన్సర్ చేస్తుంటారు. ఇది ఇలా ఉంటే మా మామగారి పేరు మీద 2002 నుంచి సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాం, ఆ తరవాత మదర్ థెరెస్సా ఫౌండేషన్ పెట్టి వరదలు, సునామీ వంటి విపత్తుల సమయంలో సహాయ కార్యక్రమాలు చేస్తుండేవాళ్లం. నాకు ఎక్కడికెళ్లినా చదువు లేకుండా చిన్న వయసులోనే పెళ్లితో ఇంటి బాధ్యతలు మోస్తున్న టీనేజ్ బాలికల మీద దృష్టి ఆగిపోయేది. అలాగే అమ్మానాన్నలు లేకపోవడంతో బంధువుల ఇళ్లలో ఇంటి పనులతో రోజులు వెళ్లదీస్తున్న బాలికలు కూడా. అప్పుడు మా నాన్న ఆడపిల్ల చదువు గురించి ఎంత గట్టిగా నిలబడ్డారో కళ్ల ముందు మెదిలేది. చాలామంది ఆడపిల్లలకు తమకోసం ఆలోచించేందుకు అమ్మానాన్నలు కూడా లేరు. ఒకవేళ తల్లి లేక తండ్రి మాత్రమే ఉన్నప్పటికీ ఆ ఇంటి ఆడపిల్ల పరిస్థితి దయనీయంగానే ఉంటుంది. అలాంటి బాలికల కోసం పనిచేయాలని గట్టిగా సంకల్పం చెప్పుకున్నాను. ఆడపిల్లల విషయంలో ఆశ్రయం, చదువుతోపాటు భద్రత కూడా చాలా ముఖ్యం. సరిగ్గా నిర్వహించగలనా అనే సందేహం పీడించింది. అప్పుడు మా వారు ‘‘భగవంతుడు అవకాశం ఇచ్చినప్పుడు సమాజానికి తిరిగి ఇవ్వాలి. అలా చేయకపోతే దేవుడికి ఏమని లెక్క చెప్పాలి? ధైర్యంగా మొదలు పెట్టు’’ అన్నారు. అలా 2012లో 30 మంది మా హోమ్‌కి వచ్చారు. ఈ పదేళ్లలో ఆ నంబరు 250కి దగ్గరైంది. కరోనా తరవాత కొత్త అడ్మిషన్లు తీసుకోలేదు. ఇప్పుడు 52 మంది ఉన్నారు. అనుబంధాల నిలయం! మా పిల్లల్లో ఇద్దరు ఎంబీయే చేశారు, బీటెక్ చేసి లండన్ వెళ్లారు, చాలామంది బీటెక్ చేస్తున్నారు. కొంతమంది టీచర్ ట్రైనింగ్‌లో ఉన్నారు. మా బాధ్యతగా సమాజానికి బాధ్యతగల ΄పౌరులను ఇస్తున్నాం. నేను కన్న పిల్లల్లో అబ్బాయి ఎంబీయే. మా చారిటీ హాస్పిటల్ చూసుకుంటున్నాడు. అమ్మాయి సివిల్స్‌కి ప్రిపేరవుతోంది. హోమ్‌లో పిల్లలకు నేను అమ్మని, మా అబ్బాయి అన్న, అమ్మాయి అక్క. ఇక మా అమ్మని అమ్మమ్మ, అత్తమ్మని నానమ్మ అని పిలుస్తారు. హోమ్ అంటే ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టడమే కాదు, బంధాలతో అనుబంధాలను అల్లుకోవాలి. మరొకరి ఆశ్రయంలో ఉన్నామనే భావన కలగకూడదు. అందుకే అందరం ఇదే హోమ్‌లో ఉంటాం’’ అని చెప్పారు ఆరోగ్యరాణి. - చిత్తా ఆరోగ్యరాణి, ఫౌండర్, మదర్ థెరెస్సా ఫౌండేషన్, పోరుమామిళ్ల, కడప జిల్లా – వాకా మంజులారెడ్డి ఫొటోలు: పాలకొలను వెంకటరామిరెడ్డి, సాక్షి, బద్వేల్, కడపజిల్లా -
కరోనా వైరస్ ప్రభావంతో అనాథ ఆశ్రమాలకు కష్టాలు
-
చిన్నారులను అందంగా అలంకరించి..
పటాన్చెరు: అమీన్‌ఫూర్ అనాథశ్రమంలో ఐదో తరగతి చదువుతున్న బాలికపై ఏడాదిగా అత్యాచారం జరిగిన తర్వాత ఆశ్రమంపై ఆరోపణలు ఒక్కొక్కటికి వెలుగులోకి వస్తున్నాయి. అనాథశ్రమం ముసుగులో అనేక చీకటి వ్యవహారాలు సాగేవని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆంధ్ర ప్రాంత బడా నాయకులతో పాటు గల్లీ లీడర్లు కూడ ఆ అనాథాశ్రమానికి వచ్చి పోయేవారని, చిన్నారులను అందంగా అలంకరించి బయటకు పంపే వారని చెబుతున్నారు. వాస్తవానికి పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనుమతి లేనిది ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా పంపకూడదు. రంగారెడ్డి జిల్లాలో అనాథాశ్రమం రిజిస్ట్రేషన్ జరిగింది. అయితే రంగారెడ్డి జిల్లా శివారు, సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్లో అనాథాశ్రమం నిర్వహిస్తున్నారు. (మరో బాలికపైనా అఘాయిత్యం!) అనాథశ్రమ భవనంపైఉన్న అడ్రస్ మాత్రం మియాపూర్ అనే రాసి ఉంది. అయినా రంగారెడ్డి జిల్లా అధికారులు స్పందించలేదు. రేయింబవళ్లు అధికారుల స్టిక్కర్లగల వాహనాల రాకపోకలు సాగేవని, చిన్నారులను చాలా వేధించేవారని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు. అశ్రమ చిన్నారులే కాకుండా బయట నుంచి కూడా మహిళలు, యువతులు వచ్చి పోయేవారనే ఆరోపణలు ఉన్నాయి. అనాథశ్రమంలో ఉన్న చిన్నారులందరూ రంగారెడ్డి జిల్లా సీడబ్ల్యూసీ(చైల్డ్ వెల్ఫేర్ కమిటీ) సిఫారసు చేసిన వారే ఉండాలి. అధికారిక లెక్కల ప్రకారం ఆశ్రమంలో 49 మంది విద్యార్థులు ఉండాలి కానీ, 60 మంది వరకు బాలికలు ఉండేవారని చెబుతున్నారు. జిల్లా అధికారులకు తెలియకుండా అనాథ పిల్లలు చేర్చుకోవడం నిబంధనలకు విరుద్ధం. తరచూ చిరునామాలు మారుస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రంగారెడ్డి జిల్లాలో ఉండాల్సిన అనాథాశ్రమం అమీన్పూర్లో నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు ఆ ఆశ్రమాన్ని కొనసాగిస్తుండటం విశేషం. అధికార యంత్రంగానికి తెలియకుండా నిర్వాహకులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2005లో మియాపూర్ దీప్తి శ్రీనగర్‌లో ఆశ్రమం నిర్వహించేవారని తెలిసింది. విజయవాడకు చెందిన నిర్వాకురాలు ఇక్కడ స్థిరపడి అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్ఆర్ఐలు నుంచి విరాళాలు సేకరించేవారని, చాలా స్వల్పవ్యవధిలో రూ.2 కోట్ల విలువైన భవనం నిర్మించాలరని తెలిసింది. ఆశ్రమం ముసుగులో కొందరు బడా బాబులు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చారని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఆ కోణంలో కూడా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అనాథాశ్రమానికి నిధులు ఇచ్చే వారికి పూర్తి సొమ్ము ఇచ్చేసి అందులో కొంత సొమ్మును కమిషన్ రూపంలో తీసుకునే ఆశ్రమాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఉలిక్కి పడిన అమీన్పూర్ పటాన్చెరు: అమీన్పూర్లో మరో ‘ముజఫర్‌పూర్’ ఘటన స్థానికులను కదిలించింది. అనాథ బాలికను చిదిమేసిన అంశంపై మానవతవాదులు కదిలిపోయారు. అన్ని టీవీ చానళ్లలోనూ ఈ వార్తపై కథనాలివ్వడంతో అమీన్పూర్ వాసులు ఒక్కసారిగా ఆందోళనకులోనయ్యారు. అమీన్‌పూర్‌లోని మియాపూర్ శివారులో మారుతి అనాథాశ్రమం ఉంది. అందులోని బాలిక ఏడాదిపాటు అత్యాచారానికి గురైంది. ఈనెల 12న నిలోఫర్ ఆసుపత్రిలో మృతి చెందింది. నిందితుడు వేణుగోపాల్ బాలికపై అత్యాచారం చేశాడని, అందుకు సహకరించిన అనాథాశ్రమ నిర్వాహకురాలు విజయ, ఆమె సోదరుడు జైపాల్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అనాథాశ్రమం రంగారెడ్డి జిల్లా పరిధిలో రిజిస్ట్రేషన్ అయ్యింది. అనాథశ్రమ చిరునామాలను తరుచూ మారుస్తూ విజయ ఆ ఆశ్రమాన్ని నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆశ్రమంలోని మిగిలిన చిన్నారుల విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. బాలిక మృతికి కారకులైన వారందరినీ శిక్షించాలని వివిధ సంఘాలు, పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. డీఎస్పీ రాజేశ్వర్ సాక్షితో మాట్లాడుతూ బోయిన్‌పల్లిలో కేసు నమోదయ్యిందని, అత్యాచార నిందితులను అరెస్టు చేశామన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పట్టణ నాయకుడు కె.నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు నాయని లలిత ఓ ప్రకటనలో ఖండించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. వైఎస్సాఆర్సీపీ ఎస్పీ విభాగం జిల్లా అధ్యక్షుడు డప్పు రాజు మాట్లాడుతూ బాలిక మృతికి కారకులైన వారందరినీ గుర్తించాలని, ఆశ్రమ అనుమతులన్ని రద్దు చేయాలన్నారు. -
అనాథ యువతికి మూడుముళ్లు
రాయచూరు రూరల్: అనాథ యువతిని యువకు డు పెళ్లాడి కొత్త జీవితంలో అడుగుపెట్టారు. రాయచూరు నగరంలో గురువారం యరమరస్ కనకదాస అనాథ పిల్లల ఆశ్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మీనాక్షి (19), ఏగనూరువాసి యల్లప్ప (23)లు మూడుముళ్లు, వేదమంత్రాల మధ్య ఒక్కటయ్యారు. మీనాక్షి తల్లిదండ్రులు బతుకుతెరువు కోసం రాయచూరుకు వచ్చారు. కొన్నేళ్ల కిందట వారిద్దరూ చనిపోవడంతో కూతురు మీనాక్షికి నా అన్నవారు లేకపోయారు. అనాథగా ఉన్న మీనాక్షికి అనాథశ్రమమే ఇల్లయింది. ఈ నేపథ్యంలో ఆశ్రమం మీదుగా రాకపోకలు సాగించే రైతు యల్లప్పకు, మీనాక్షితో పరిచయం ఏర్పడింది. అతడు తన తల్లిదండ్రులకు, పెద్దలకు చెప్పగా సంతోషంగా పెళ్లికి అంగీకరించారు. ఈ నేపథ్యంలో యరమరాస్‌లోని రాఘవేంద్ర స్వామిమఠంలో మూడుముళ్లు వేశాడు. జిల్లా ఎస్పీ వేదమూర్తి, నగర సభ సభ్యుడు నరసరెడ్డి, భరత్ రెడ్డిలు వారిని ఆశీర్వదించారు. -
సూపర్ మామ్
మాతృత్వం పేగుబంధానికే పరిమితం కాదని రుజువు చేస్తోంది సూపర్ మామ్. నా అన్న వారు లేని పిల్లలకు.. అక్కున చేర్చుకునే మాతృమూర్తులను పరిచయం చేస్తోందీ కొత్త కాన్సెప్ట్. అనాథఆశ్రమాల్లో అమ్మ లాలన కోసం ఆశగా ఎదురు చూసే చిన్నారులకు ఆత్మీయత చూపి వారి జీవన విధానాన్ని మార్చే ప్రయత్నంలో భాగంగానే ‘సూపర్ మామ్’ను ప్రారంభించామని అంటున్నారు మార్గ్ ఫౌండేషన్ ఫౌండర్ నఫీసా ఇస్మాయిల్. ఎవరూ లేని అనాథలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలకమైన ‘అమ్మ’ పాత్రను పోషించడానికి మాతృమూర్తులను స్వాగతిస్తున్నారు. ఈ అమ్మదనం గురించి మరిన్ని విశేషాలు నఫీసా మాటల్లోనే.. - వాంకె శ్రీనివాస్ సిటీవాసులు చాలా మంది బర్త్‌డే సెలబ్రేషన్స్ అని, పెళ్లి రోజు వేడుకలని.. ఇలా ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకొని అనాథ ఆశ్రమాలకు వెళ్లి అక్కడి పిల్లలతో కలసి సంబరాలు చేసుకోవడం పెరిగిపోయింది. వేడుకలు చేసుకోవడం వరకు బాగానే ఉన్నా.. మనకు తెలియకుండానే ఆ పిల్లలకు మరింత వేదనను మిగులుస్తున్నామన్నది మరచిపోతున్నాం. మన పిల్లలతో కేక్ కట్ చేసి ప్రేమానురాగాలను వాళ్ల కళ్లకు కడుతుంటే.. నా అనే వాళ్లు లేని పిల్లలకు పేరేంట్స్ గుర్తొస్తుంటారు. మనకు అలాంటి లైఫ్ ఎందుకు లేదా అని లోలోపలే ఆవేదన చెందుతుంటారు. అనాథాశ్రమాలకు వెళ్లి బర్త్ డే సెలబ్రేషన్స్, అన్నదానం, విద్యాదానానికి మాత్రమే పరిమితం కాకుండా.. ప్రతి నెలలో వీలైనన్నిసార్లు వాళ్లని కలసి సమస్యలను తెలుసుకొని గైడ్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించేదాన్ని. స్నేహితుల ప్రోత్సాహంతో... నాలుగేళ్ల క్రితం క్రిమినల్ లాయర్‌గా పనిచేస్తున్నప్పుడు వరకట్న హత్య, అత్యాచారం కేసుల్లో చాలా మంది పిల్లలు పేరేంట్స్‌కు దూరమవుతుండటం చూశా. వీరు జైలులో మగ్గుతుంటే.. అమ్మమ్మ, తాత ఉన్నా పేదరికం అడ్డురావడంతో పిల్లలని అనాథశ్రమాల్లో చేర్పిస్తుండటం చాలా బాధించింది. ఈ విషయాన్ని స్పెయిన్‌లో ఉన్న మా ఫ్రెండ్స్‌తో చర్చించా. ‘సూపర్ మామ్’ ఆలోచనను పంచుకున్నా. వాళ్లు నన్ను ముందుకు వెళ్లమని ప్రోత్సహించడంతో.. ఇప్పుడు ఈ ప్రాజెక్టుతో బిజీగా మారిపోయాను. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథాశ్రమాల ద్వారానే సూపర్ మామ్ చేపట్టాలని అధికారులతో చర్చలు జరుపుతున్నా. పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందనుకుంటున్నా. ఇలా చేస్తాం... ఒక్కో అనాథ ఆశ్రమంలో దాదాపు 60 మంది పిల్లలు ఉండొచ్చు. ఒక్కో పిల్లాడికి సూపర్ మామ్‌గా ఉండేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తాం. సామాజిక ఆలోచనతో ముందుకు వచ్చిన వారిని తీసుకొని ఒక్కో పిల్లాడితో అటాచ్ చేస్తాం. ఇలా వారు వీలున్నప్పుడుల్లా మాట్లాడుతూ వాళ్ల సమస్యలు తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా ఎమోషనల్ సపోర్ట్ ఇస్తుంటాం. కెరీర్‌పై వాళ్లకు అవగాహన వచ్చే స్థాయి వరకు తీసుకువెళ్తాం. ఆ పిల్లలను ఎవరైనా దత్తత తీసుకునే వరకు అమ్మ లేని లోటు లేకుండా చేస్తాం. వారు భవిష్యత్‌లో పది మందికి సహయపడేలా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం. ఇలా చేయడం వల్ల ఆ చిన్నారులు ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలుంటాయి. ఇప్పటివరకు ఈ పిల్లలను ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల.. కొందరు వాళ్ల బలహీనతలను ఉపయోగించుకొని నా అన్న ఫీలింగ్‌ను కలిగించి, సంఘ వ్యతిరేక శక్తులుగా మారుస్తున్నారు. అందుకే ఆ పిల్లల్లో సాఫ్ట్ ఫీలింగ్ కలిగించి మంచి భవిష్యత్‌కు సూపర్ మామ్ ద్వారా బాటలు వేయాలనుకుంటున్నాం. మదర్ నఫీసా... ముగ్గురు పిల్లల తల్లి నఫీసా. 2007లో మార్గ్ ఫౌండేషన్ ప్రారంభించి మహిళా సాధికారత దిశగా కృషి చేస్తున్న నఫీసాకు కర్మవీర్ పురస్కార్ దక్కింది. ఈమె పెద్దమ్మాయి సారా మెడిసిన్ చేయగా, కుమారుడు తాసిఫ్ ఢిల్లీలో సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. చిన్న అమ్మాయి సైబ లా ప్రిపేర్ అవుతోంది. ముగ్గురు బిడ్డలను సరైన మార్గంలో పెట్టిన నఫీసా.. ఇప్పుడు సమాజానికి ఉపయోగపడే సూపర్ మామ్‌గా మారుతున్నారు. -
సినీ పరిశ్రమకు విశాఖ వేదిక : బ్రహ్మాజీ
అచ్యుతాపురం : భవిష్యత్తులో సినీ పరిశ్రమకు విశాఖ వేదిక కానుందని ప్రముఖ సినీనటుడు బ్రహ్మాజీ అన్నారు. కొండకర్లలో ‘ఇచ్చా’ స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాథ ఆశ్రమాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఇక్కడి విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే పలువురు విశాఖలో షూటింగ్ చేపడుతున్నారన్నారు. అరకుకు విమాన సౌకర్యాలు మెరుగుపరచగలిగితే పర్యాటకం, సినీ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు. తన కెరీర్లో 25 చిత్రాల్లో గుర్తింపు తెచ్చిన పాత్రలు పోషించినట్టు చెప్పారు. ప్రస్తుతం ‘పండుగ చేసుకో’, యూవీ క్రియేషన్స్ చిత్రాల్లో నటిస్తున్నానన్నారు. వర్ధమాన నటులు ఓపికతో శ్రమపడాల్సి ఉందన్నారు. పైరసీ కారణంగా పరిశ్రమ దెబ్బతింటుందని వాపోయారు. హుదూద్ తుఫాన్ కారణంగా విశాఖకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. విశాఖను పునర్నిర్మించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. అంతకు ముందు ఆయన అనాథ ఆశ్రమంలోని పిల్లల్ని దగ్గరకు తీసుకుని కాసేపు వారితో సరదాగా గడిపారు. అనాథలు, వికలాంగులకు మరింత సేవలందేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి మథూ టుక్నైట్‌ను అభినందించారు. -
శహభాష్... సుబ్బాయమ్మ...!
ఎన్నెన్ని ప్రసవ వేదనలు, ఎన్నెన్ని ఆనందాలు, ఎన్నెన్ని సంతోషాలు, ఎన్నెన్ని నిరాశలు... 44 ఏళ్ల ప్రస్థానంలో సుబ్బాయమ్మ చూసిన విశేషాలెన్నెన్నో. ఇన్నేళ్లలో ఆమె వేలాది మంది శిశువులను ప్రపంచానికి పరిచయం చేసింది. వేలాది మంది తల్లుల కన్నీరు తుడిచింది. వారి బాధలు పంచుకుంది. ఇప్పుడు ఎనభై నాలుగేళ్ల వయసులోనూ సేవే పరమార్థంగా గడుపుతోంది. ప్రాథమిక విద్య కూడా పూర్తి చేయని సుబ్బాయమ్మ ఇప్పుడు పెద్ద పెద్ద డాక్టర్లకు గురువు. అమ్మగర్భం మరో బ్రహ్మలోకం అంటారు. ఆ లోకంలో ఉన్న పసిమొగ్గలను ఈ లోకంలోకి తెస్తూ... 44 ఏళ్లుగా సేవ చేస్తున్న సుబ్బాయమ్మ గురించి... * జీవితంలో సంపాదించిందంతా అనాథాశ్రమానికిచ్చిన త్యాగమూర్తి... * 84 ఏళ్ల వయసులో పదేళ్లుగా అనాథ పిల్లలకు సేవ చేస్తూ...తరిస్తున్న సేవామూర్తి... * మా వైద్యులందరికీ గురవని కితాబిచ్చిన పట్టణ సీనియర్ వైద్యులు... * ఆశ్రమం ధైర్యంగా నడుస్తోందంటే 84ఏళ్ల సుబ్బాయమ్మ అనుభవమే...నిర్వాహకులు... * సుబ్బాయమ్మ త్యాగం...కావాలి మరికొందరికైనా స్ఫూర్తి... పార్వతీపురం: ఆమె ఓ సాధారణ మాతృమూర్తి. కానీ 44 ఏళ్లు అసాధారణంగా సేవలు చేస్తున్నారు. అందరికీ తలలో నాలుకలా వ్యవహరిస్తూ వైద్యాధికారులకు సైతం గురువుగా పేరు సంపాదించారు. జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా అన్నింటినీ తట్టుకుని నిలబడ్డారు. నిలబడి పది మందికీ ఆదర్శంగా నిలిచారు. ఇప్పుడు కూడా తన సంపాదనలో కొంత భాగాన్ని జట్టు ఆశ్రమానికి ఇచ్చి అనాథలకు సేవలు అందిస్తున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు తల్లిగా... ఆశ్రమం నడిపే నిర్వాహకులకు పెద్ద దిక్కుగా తన 84 ఏళ్ల అనుభవాన్ని ఆమె ఇలా పంచుకున్నారు. అమ్మా, నాన్నలే నాకు స్ఫూర్తి... నా పేరు ఆదిమడపల సుబ్బాయమ్మ. మాది గుంటూరు జిల్లా బాపట్ల. మా నాన్న ముత్తిరెడ్డి రాఘవయ్య వ్యవసాయంతోపాటు రెండెడ్ల బండి తోలేవాడు. మా అమ్మ కనకమ్మ. మేము ఐదుగురు సంతానం. నాకు ఊహ తెలిసినప్పటి నుండే మా అమ్మా, నాన్నలు సంపాదించిన దానిలో కొంత సాటివారికి సహాయం చేసేవారు. మాది సాధారణ కుటుంబం అయినప్పటికీ మాకున్నంతలో తోటివారికి సహాయం చేసేవారు. అప్పటి నుంచే నాకు చేతనైనంత తోటివారికి సహాయం చేయడం అలవడింది. అప్పటి నుంచే ఆనందం తెలిసింది. బాపట్ల నుంచి సాలూరుకు... నా వివాహం తర్వాత బాపట్ల నుంచి సాలూరుకు వచ్చాం. తర్వాత పిల్లలతో పాటు 65 ఏళ్ల క్రితం పార్వతీపురం వచ్చి ఇక్కడ స్థిరపడ్డాం. నాకు ఇద్దరు పిల్లలు పాప, బాబు. భర్త చనిపోయాక పిల్లల్ని పెంచే బాధ్యత నాపై పడింది. నాకు అక్షరం ముక్క రాదు. దీంతో ఓ పెద్దావిడకు తోడుగా పురుడు పోసేందుకు వెళ్లేదానిని. ఆమె వద్ద నాకు ఈ విద్య అబ్బింది. అప్పటి నుంచి అదే జీవనోపాధిగా మారింది. ఆ రోజుల్లో ఒక్కో పురుటికి రూ.50లు నుంచి *60లు ఇచ్చేవారు. కొంతమంది పేదవారు అది కూడా ఇవ్వలేకపోయేవారు. ఒక్కో రోజు 7 వరకు ప్రసవాలు చేసేదాన్ని. ఆ రోజుల్లో ఇం తగా ఆపరేషన్లు, వైద్య సదుపాయాలుండేవి కాదు. ఆస్పత్రుల్లోను, వీధులు, గ్రామాల్లోను ఇంటింటికి వెళ్లి ప్రసవాలు చేసేదాన్ని. 44 ఏళ్ల పాటు... అలా మొదలైన నా జీవిత ప్రస్థానం 44 ఏళ్ల పాటు సాగింది. దీనిలో భాగంగా పురిటికి రూ.50 నుంచి 500లు పెరిగింది. దీంతో నేను సుమారు రూ.6లక్షలు వరకు సంపాదించాను. అప్పటికే పిల్లలు వారి జీవితాల్లో స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో జట్టు వ్యవస్థాపకులు డొల్లు పారినాయుడు అనాథాశ్రమాన్ని స్థాపించారు. టీచర్ ఉద్యోగం వదులుకొని ఆ రోజుల్లో అనాథపిల్లల కోసం పాటుపడుతున్న పారినాయుడు అంటే మనసులో ఎనలేని అభిమానం ఏర్పడింది. ఎలాగైనా నా వంతుగా సహాయం చేయాలనుకున్నాను. తొలుత రూ.20వేలు ఆశ్రమానికి విరాళమిచ్చాను. అనాథ పిల్లలకు సేవ చేయాలనే... అప్పుడప్పుడు ఆశ్రమానికి వెళ్లి ఏదైనా పిల్లలకివ్వాలన్న కోరిక ఉండేది. ఓ మారు పిండి వంటలు చేసి పిల్లలకు తీసుకెళ్లాను. అప్పటికి ఉన్నత ఉద్యోగాలను విడిచిపెట్టి అనాథ పిల్లలకు సేవ చేసేందుకు వచ్చిన జట్టు నిర్వాహకురాలు వి.పద్మజను చూసిన నాకు...పిల్లలకు నేనెందుకు సేవ చేయకూడదనిపించింది. బాగా ఆలోచించి ఈ విషయాన్ని జట్టు వ్యవస్థాపకులు, నిర్వాహకులతో చెప్పాను. వారు ఆనందంగా స్వాగతించారు. సంపాదనంతా జట్టు ఆశ్రమానికే... అప్పటికే నా వద్ద ఉన్న సంపాదన రూ.2లక్షలు ఆశ్రమానికి చ్చి, పిల్లలకు సేవ చేస్తూ జీవితాన్ని ఎనలేని సంతృప్తితో గడుపుతున్నాను. తల్లిదండ్రులు లేని పిల్లలకు తల్లిదండ్రినై, మలిదశలో ఆసరా లేని వృద్ధులకు తోడునై ఆశ్రమంలో ఆనందంగా గడుపుతున్నాను. తల్లిదండ్రులను మరిపించే సేవలు ఆమె సొంతం... ఇదిలా ఉండగా జట్టు ఆశ్రమంలో ఉన్న అనాథపిల్లలు, వృద్ధులకు సుబ్బాయమ్మ 84 ఏళ్ల వయసులో కూడా తల్లిదండ్రులను మరిపించే సేవలందిస్తోంది. వారి పెంపకంలో తన అనుభవాన్ని జత చేస్తూ జట్టు ఆశ్రమానికే పెద్ద దిక్కుగా నిలుస్తోంది. వైద్యులందరికీ గురువు! ‘ఆమె చేయి చల్లదనం...నాడు వేలాది మంది గర్భిణులకు ధైర్యాన్నిచ్చింది. ఆమె పురుడు పోసేందుకు వచ్చిందంటే మరికొద్ది సేపులో పండంటి బిడ్డ తమ చేతికొస్తుందనే కొండంత ధైర్యం ఆ ఇంటివాళ్లకు కలిగేది. పురిటి నొప్పులు భరించలేని స్త్రీకి మరి కొద్ది సేపులో మాతృమూర్తి మాధుర్యాన్ని, అమ్మతనంలోని కమ్మదనాన్ని చవిచూస్తావంటూ ధైర్యాన్ని చెప్పి ఎంతమందికో గుండె ధైర్యాన్నిచ్చిన సుబ్బాయమ్మను...పట్టణ సీనియర్ వైద్యులు సైతం మాకు గురువని మెచ్చుకుంటున్నారు. సుబ్బాయమ్మ ఆశయం... కావాలి మరికొందరికైనా స్ఫూర్తి... జీవితంలో పైసా పైసా కూడబెట్టి...సంపాదించినదంతా పిల్లలకు అప్పగించి మలి దశ లో ప్రశాంతంగా జీవించాలనేది ప్రతి వ్యక్తి సాధారణమైనఆశ. కాని సుబ్బాయమ్మ మాత్రం తన పిల్లల జీవితాలను స్థిరపరచి, వారి అనుమతితో స్థానిక జట్టు ఆశ్రమంలో ఆనాథ పిల్లలకు సేవలందిస్తూ...తన జీవితాశయాన్ని నెరవేర్చుకుంటున్న ఆదిమడపల సుబ్బాయమ్మ మరికొందరికైనా స్ఫూర్తి కావాలి.