రమేష్‌తో రొమాన్స్! | Meenakshi Dixit Romance with Ramesh | Sakshi
Sakshi News home page

రమేష్‌తో రొమాన్స్!

Published Wed, Jan 14 2015 2:46 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 PM

రమేష్‌తో రొమాన్స్!

రమేష్‌తో రొమాన్స్!

హాస్యనటుడు వడి వేలుతో తెనాలి రామన్ చిత్రంలో డ్యూయట్స్ పాడిన నటి మీనాక్షి దీక్షిత్, ఇప్పుడు కోలీవుడ్‌లో అవకాశాలు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్‌లో నటించే లక్కీచాన్స్ కొట్టేసింది. ఆర్‌బీ చౌదరి నిర్మిస్తున్న, ఇంకా పేరు పెట్టని చిత్రంలో ఆయన తనయుడు జిత్తన్ రమేష్ హీరోగా నటిస్తున్నారు. రమేష్‌కు జంటగా మీనాక్షి దీక్షిత్ నటించనుంది. పూర్తి వినోద భరింతగా, తెరకెక్కనున్న ఈ చిత్రం ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుందని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ చిత్రంతో కోలీవుడ్‌లో తనకు మంచి గుర్తింపు వస్తుందన్న ఆశాభావాన్ని మీనాక్షి దీక్షిత్ వ్యక్తం చే స్తోంది. ఈ అమ్మడు ఇప్పటికే మరో హాస్యనటుడు ప్రేమ్‌జీతో కలసి టక్కర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణం పూర్తి కావచ్చింది. ఈ రెండు చిత్రాలు విడుదల అనంతరం నటిగా తన స్థాయి పెరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిత్తన్ రమేష్ జిత్తన్ -2 అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం కూడా త్వరలో తెరపైకి రానుంది. కొంత కాలంగా నటనకు దూరంగా ఉన్న జిత్తన్ రమేష్‌కు ఈ చిత్రం విజయం చాలా అవసరం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement