వచ్చే నెల నుంచి అందుబాటులో ఐటీఓ మెట్రో | Metro aitio available from next month | Sakshi
Sakshi News home page

వచ్చే నెల నుంచి అందుబాటులో ఐటీఓ మెట్రో

Published Sat, Feb 21 2015 12:33 AM | Last Updated on Tue, Oct 16 2018 5:14 PM

Metro aitio available from next month

{పయోగాత్మక పరుగు విజయవంతం
స్టేషన్ లోపలా, వెలుపలా ఫినిషింగ్ పనులు
ఆఖరిదశకు చేరుకున్న సబ్‌వేల నిర్మాణం
డెడ్‌లైన్‌కంటే తొమ్మిది నెలల ముందే సేవలు

 
న్యూఢిల్లీ : ఐటీఓ వరకు మెట్రో  సదుపాయం కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. ఈ సదుపాయం వచ్చే నెలాఖరునాటికల్లా అందుబాటులోకి రానుంది. ఇందుకు  సంబంధించిన ప్రయోగాత్మక పరుగు విజయవంతమైందని అంటున్నారు. ప్రస్తుతం ఈ స్టేషన్ లోపలా వెలుపలా ఫినిషింగ్ పనులు జరుగుతున్నాయి. స్టేషన్‌కు రాకపోకలు సాగించడంతోపాటు రోడ్డు దాటడానికి నిర్మించిన సబ్‌వేను సాధారణ ప్రజలకు ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగతా రెండు సబ్‌వేల నిర్మాణ పనులు ఆఖరి దశలో ఉన్నాయి.
 భద్రతా తనిఖీకోసం కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీకి వచ్చే వారం లాంఛనంగా లేఖ రాయనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.  మార్చి మూడోవారం ఐటీఓ మెట్రో స్టేషన్ ద్వారాలు సామాన్యుల కోసం తెరచుకుంటాయని వారు అంటున్నారు. మెట్రో స్టేషన్‌లో ఎలక్ట్రానికల్, సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్, ఫైర్ స్టేఫీ, ట్రాక్ సిస్టం, ఓహెచ్‌ఈకి సంబంధించిన పనులు పూర్తయ్యాయని, వాటికి సంబంధించిన పరీక్షలు కూడా విజయంతమయ్యాయని సంబంధిత అధికారులు తెలిపారు. మండీ హౌజ్ నుంచి ఐటీఓ మెట్రో స్టేషన్ వరకు మెట్రో ట్రయల్ రన్ గత ఏడాది డిసెంబర్ 18న మొదలైంది. సాధారణంగా నెల రోజుల ట్రయల్ తరువాత సేఫ్టీ కమిషనర్‌తో తనిఖీ జరిపించి మెట్రో రైల్వే స్టేషన్‌ను ప్రారంభిస్తారు. అయితే మండీహౌజ్, బదర్ పూర్ మధ్య మెట్రో రైలు రోజంతా నడుస్తున్నందువల్ల ఐటీఓ స్టేషన్ వరకు ట్రయల్‌ను రాత్రి పూట మాత్రమే నిర్వహిస్తున్నారు. అందువల్ల ఐటీఓ స్టేషన్ వరకు ట్రయల్ రన్‌ను పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పట్టిందని అధికారులు అంటున్నారు.

డాల్ మ్యూజియం, డీడీయూమార్గ్‌పై నిర్మించిన నాలుగు ఎంట్రీ గేట్లు, సబ్‌వేలను స్టేషన్‌తోపాటు తెరవనున్నట్లు మెట్రో అధికారులు చెబుతున్నారు.స్టేషన్ కారిడార్‌లో ఐటీఓ పరిసరాల చరిత్రను తెలియజెప్పే పెయింటింగ్‌లను ఉంచాలని ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) యోచిస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఈ స్టేషన్ నిర్మాణ పనులను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనేది డీఎంఆర్‌సీ లక్ష్యం. అయితే ప్రయాణికుల డిమాండ్, రద్దీని దృష్టిలో పెట్టుకుని దీనిని తొమ్మిది నెలల మేర ముందుకు జరిపారు. ఈ స్టేషన్ నుంచి ప్రతిరోజూ 22 వేల మంది ప్రయాణిస్తారని అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement