ఇండియా టుడే సదస్సులో పాల్గొన్న కేటీఆర్
చెన్నై: పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ అత్యంత ఆకర్షణీయ ప్రదేశమని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం చెన్నైలో జరిగిన ఇండియా టుడే సదస్సులో ఆయన పాల్గొన్నారు. టీఎస్ ఐపాస్‌తో పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని కేటీఆర్ చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో తొలిస్థానం రావడం తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు.
చెన్నైలో కేటీఆర్ పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. టీవీఎస్, మురుగప్ప, ఎంఆర్ఎఫ్, రానే ఇంజనీరింగ్ సంస్థల ప్రతినిధులను కలిశారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడులపై వారితో చర్చించారు.