నా కల నిజమవుతోంది! | My dream being true says Vedhika | Sakshi
Sakshi News home page

నా కల నిజమవుతోంది!

Published Fri, Aug 28 2015 2:21 AM | Last Updated on Thu, Sep 27 2018 8:55 PM

నా కల నిజమవుతోంది! - Sakshi

నా కల నిజమవుతోంది!

నా కల నిజమయ్యే సమయం ఆసన్నమైంది అంటున్నారు నటి వేదిక. నిజానికి ఈ బ్యూటీలో మంచి నటి ఉన్నారు. పరదేశి, కావ్య తలైవన్ చిత్రాల్లో వేదిక అభినయం ప్రశంసలందుకుంది. ఎందుకనో ఆమెకు రావలసిన గుర్తింపు రాలేదు. కోలీవుడ్‌లో అవకాశాలు కూడా అంతంత మాత్రమే. కారణం వేదిక ఇతర భాషా చిత్రాలపై కూడా దృష్టి సారించడం కావచ్చు. తాజాగా ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవా చిత్ర నిర్మాణం ప్రారంభించి ఏక కాలంలో మూడు చిత్రాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి వినోదన్. ఇందులో దివంగత సీనియర్ నటుడు ఐసరి వేలన్ మనవడు వరుణ్ హీరోగా పరిచయం అవుతున్నారు.
 
 నవ దర్శకుడు విక్టర్ పరిచయం అవుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ కోసం పెద్ద వేటనే జరిగిందట. చివరికి నటి వేదికలో తన హీరోయిన్‌కు కావలసిన లక్షణాలు ఉన్నాయనిపించడంతో ఆమెను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఆమె తెలుపుతూ దర్శకుడు విక్టర్ తనకు కథ వినిపించినప్పుడు ప్రభుదేవా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని చెప్పారన్నారు. ప్రభుదేవాకు తాను వీరాభిమానినన్నారు. అలాంటిది ఆయన చిత్రంలో నటించాలన్న తన కల ఈ విధంగా నెరవేరుతుండడం చెప్పలేనంత ఆనందంగా ఉందన్నారు.
 
 కథ విన్న తరువాత తన ఉత్సాహం రెట్టింపు అయ్యిందన్నారు. కథను దర్శకుడు అంత అద్భుతంగా తయారు చేశారని తెలిపారు. పరదేశి, కావ్యతలైవన్ చిత్రాల తరహాలోనే ఈ చిత్రంలో తన పాత్ర వైవిధ్యభరితంగా ఉంటుందన్నారు. ఇది ఫిజికో ఎమోషనల్ చిత్రం అని చెప్పారు. దర్శకుడు విక్టర్ తన పాత్ర ఎలా ఉండాలి? ఎలా ప్రవర్తించాలి అన్న విషయంలో పెద్ద పరిశోధనే చేశారని అన్నారు. ఆ విధంగా నటుడు వరుణ్‌కు తనకు రిహార్స్‌ల్స్ నిర్వహించారని తెలిపారు. ఈ ప్రక్రియ నాలాంటి నటీనటులకు వరప్రసాదం లాంటిదిగా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement