మణిరత్నంకు నాని హ్యాండ్ | Actor Nani Facing Troubles After Hiking Remuneration! | Sakshi
Sakshi News home page

మణిరత్నంకు నాని హ్యాండ్

Published Wed, Oct 28 2015 3:23 AM | Last Updated on Thu, Sep 27 2018 8:48 PM

మణిరత్నంకు నాని హ్యాండ్ - Sakshi

మణిరత్నంకు నాని హ్యాండ్

తమిళసినిమా : మంచి హిట్ చిత్రం ఇచ్చిన తర్వాత కూడా దర్శకుడు మణిరత్నంకు కాలం కలసిరావడం లేదు. ఓ కాదల్ కణ్మణి చిత్రం తర్వాత ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తాజా చిత్ర ప్రయత్నాలు వరుసగా బెడిసి కొడుతున్నాయి. ఓ కాదల్ కణ్మణిని మంచి ఫీల్ లవ్‌స్టోరీగా తెరకెక్కించిన మణిరత్నం ఈ సారి కమర్షియల్ చిత్రాన్ని రూపొందించాలని భావించారు. దాన్ని మల్టీస్టారర్ చిత్రంగా మలచాల ని తలిచారు. నటుడు కార్తీ, దల్కర్‌సల్మాన్ హీరోలుగా నిత్యామీనన్, కీర్తీసురేశ్ హీరోయిన్లుగా మంచి యాక్షన్ ఓరియంటెడ్ చిత్రానికి ప్లాన్ చేశారు.

అంతా సవ్యంగా సాగుతుందనుకున్న తరుణంలో చిత్రం నుంచి అనూహ్యంగా దుల్కర్‌సల్మాన్ వైదొలిగారు. సరే అని అయన స్థానంలోకి టాలీవుడ్ నటుడు నానీని తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో నటి కీర్తీసురేశ్ మణిరత్నానికి హ్యాండిచ్చింది. ఆమె పాత్రకు బాలీవుడ్ భామను రీప్లేస్ చేశారు. ఇక షూటింగే తరువాయి అనుకుంటున్న సమయంలో తాజాగా నానీ కూడా మణిరత్నంకు టాటా చెప్పడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

మరో విషయం ఏమిటంటే ఆదిలోనే ఇన్ని అవరోధాలు ఎదురవ్వడంతో మణిరత్నం ఈ చిత్రాన్నే డ్రాప్ చేసినట్లు సమాచారం. ఇంతకుముందు కూడా నాగార్జున, మహేశ్‌బాబు, ఐశ్వర్యారాయ్, శ్రుతీహాసన్ కలయికలో ఒక భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని చేయ సంకల్పించి ఫైనాన్స్, తారల కాల్‌షీట్స్ సమస్య కారణంగా వదిలేశారు. తాజా సమాచారం ఏమిటంటే నటుడు ధనుష్‌తో మణిరత్నం ఒక హిందీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ వర్గాల టాక్. ధనుష్ ఇప్పటికే బాలీవుడ్‌లో రెండు చిత్రాలు చేసి ఉండటంతో ఆయన హీరోగా ఒక చిత్రాన్ని వర్కౌట్ చేయడానికి మణిరత్నం కథను వండుతున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement