► తీరం దాటిన నాడా
► బలహీనపడ్డ తుపాన్
► కడలూరులో ఆనందం
► పలు చోట్ల వర్షాలు
► సాగరంలో మరో ద్రోణి
నాడా గండం తప్పింది. బలహీనపడ్డ ఈ తుపాన్ శుక్రవారం కారైక్కాల్ వద్ద తీరం దాటింది. ఈ ప్రభావంతో పలుచోట్ల చెదురుమదురుగా వర్షాలు పడుతున్నారుు. నాడా తీరం దాటడంతో కడలూరు జిల్లాలోని సముద్ర తీరవాసులు ఆనందంలో మునిగారు. ఈ ఏడాది ఓ గండం నుంచి తాము బయట పడ్డామంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. ఇక, సాగరంలో మరో అల్పపీడనం బయలు దేరే అవకాశాలు ఉన్నట్టు కేంద్ర వాతావరణ కేంద్రం ప్రకటించింది. -సాక్షి, చెన్నై
సాక్షి, చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బల పడి తుపాన్‌గా మారడం, అది తమిళనాడు మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్న సమాచారం ప్రజల్లో ఆందోళనకు దారి తీసింది. గత ఏడాది వలే ఈ ఏడాది ఎక్కడ మరో గండాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందోనని కాంచీపురం, చెన్నై, తిరువళ్లూరు, కడలూరు వాసుల్లో ఉత్కంఠ పెరిగింది. నాడా పేరుతో తరుముకొచ్చిన ఈ తుపాన్ హఠాత్తుగా బలహీన పడింది. అరుునా, తీరం దాటే సమయంలో పెను ప్రళయం ఈదురు గాలుల రూపంలో తప్పదన్న సంకేతాలతో అధికార వర్గాలు అప్రమత్తంగానే వ్యవహరించారు. కడలూరు -నాగపట్నం మధ్యలో తీరం దాటనుండడంతో జాతీయ విపత్తుల నివారణ బృందాలు సైతం రంగంలోకి దిగారుు. నాడా తీరం దాటే వరకు ఉత్కంఠ తప్పలేదు.
అరుుతే, కడలూరు-నాగపట్నం వైపుగా పయనిస్తూ వచ్చిన నాడా, గురువారం అర్ధరాత్రి సమయంలో మరింతగా బలహీన పడింది. అల్పపీడనంగా మారి తన పయన మార్గాన్ని మార్చుకుంది. దీంతో రాత్రంతా పలుచోట్ల సముద్ర తీరాల్లో మోస్తరుగా వర్షం పడింది. క్రమంగా తీరం సమీపించే కొద్ది నాడా ప్రభావం తగ్గుతూ రావడంతో ఉత్కంఠ వీడింది. కారైక్కాల్‌కు పదిహేను కిమీ దూరంలో ఉదయం నాలుగున్నర గంటల సమయంలో ఎలాంటి ప్రభావం అన్నది చూపకుండా తీరం దాటింది. తుపాన్ గండం తప్పినట్టు వాతావరణ కేంద్రం ప్రకటనతో కడలూరు తీర వాసుల్లో ఆనందం రెట్టింపు అరుుంది.
కడలూరులో ఆనందం:
ఏటా కడలూరు తుపాన్ రూపంలో గండాల్ని చవిచూస్తూనే వస్తున్న విషయం తెలిసిందే. అటు పుదుచ్చేరిలో ప్రకంపనలు బయలు దేరినా, ఇటు తమిళనాడులో వాన గండాలు నెలకొన్నా, తొలుత విలవిలలాడే ప్రదేశం కడలూరే. కరువుతో తల్లడిల్లినా, గండాలతో ఇక్కడి ప్రజలు కొట్టుమిట్టాడక తప్పదు. ఏటా ఏదో ఒక ముప్పు తమకు తప్పదన్నట్టుగా ఇక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. తాజాగా నాడా సైతం కడలూరు - నాగపట్నం మధ్యలో తీరం దాటనున్న సమాచారం ప్రజల్లో కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఇక, అధికార వర్గాల్ని పరుగులు తీరుుంచింది. అరుుతే, గండం తప్పిందన్న సమాచారం అక్కడి ప్రజల ముఖాల్లో చిరునవ్వులు వికసించడం గమనార్హం.
మరో ద్రోణి:
నాడా తీరం దాటినా, అల్పపీడనంగా మారిన ఆ ప్రభావంతో సముద్ర తీరాల్లో తెరపించి తెరపించి మోస్తరుగా వర్షం పడుతోంది. చెన్నైలో కాసేపు వర్షం, మరి కాసేపు భానుడు ప్రత్యక్షం, ఇంకాసేపటికి ఆకాశం మేఘావృతం అన్నట్టుగా శుక్రవారం వాతావరణం నెలకొంది. గురువారం అర్ధరాత్రి మహాబలిపురంలో 11సెంమీ, చోళవరంలో ఆరు సెంమీ వర్షం అత్యధికంగా నమోదైంది. కాగా, అండమాన్ సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం బయలు దేరనుంది. ఈ ద్రోణి ప్రభావం ఏమిటో, పయన మార్గం ఎలా ఉంటుందోనన్నది ఆదివారం నాటికి తేలనుంది. ఈ సమాచారాన్ని కేంద్ర వాతావరణ అధికారులు ఢిల్లీలో ప్రకటించారు. ఈ అల్పపీనడం బల పడ్డ పక్షంలో తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ వైపుగా కదిలేందుకు ఆస్కారం ఎక్కువే. ఇందుకు కారణం అండమాన్ సమీపంలోని నెలకొనే అల్పపీడనాలు అత్యధికంగా ఎంచుకున్న మార్గాలు ఈ రెండే. ఇక, నాడా ప్రభావం తగ్గినా, సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతూనే ఉన్నందున, జాలర్లు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం వర్గాలు సూచిస్తున్నారుు. శనివారం సాయంత్రం తర్వాత వేట నిమిత్తం సముద్రంలోకి వెళ్లొచ్చని సూచించే పనిలో పడ్డారు.